DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహిళా రక్షణ కై  సుభద్ర వాహిని ఏర్పాటు : రైల్వే డిఆర్ఎం మాధుర్ 

మహిళా రక్షణ కై  à°­à°¦à±à°° వాహిని ఏర్పాటు : రైల్వే à°¡à°¿ ఆర్ à°Žà°‚ మాధుర్ 

విశాఖపట్నం, జూన్     : విశాఖపట్నం పట్నం రైల్వే స్టేషన్ లో మహిళా ప్రయాణీకులకు ఎటువంటి

అసౌకర్యం కలుగకుండా, ఎటువంటి అఘాయిత్యాలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల లో భాగంగా రైల్వే పోలీసు విభాగం ( ఆర్ పీ ఎఫ్ ) ఆధ్వర్యవం లో సుభద్ర వాహిని

బృందాన్ని ఏర్పాటు చేసినట్టు విశాఖపట్నం రైల్వే డివిజనల్ మేనేజర్ ముకుల్ శరన్ మాధుర్ తెలిపారు. సోమవారం విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో నిర్వహించిన సమావేశం లో

అయన మాట్లాడుతూ ఈ సంవత్సరం మహిళా రక్షణ కై కేటాయించామని, డి ఆర్ ఎం చైర్మన్ గా, సీనియర్ డివిజనల్ రక్షణ కమిషనర్ ( ఆర్ పీ ఎఫ్ , విశాఖ) సీనియర్ డివిజినల్ మెడికల్ అధికారి (

విశాఖ) లతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీనిలో భాగం గా మహిళా రక్షణ లో ఈ సుభద్ర వాహిని బృందం అనుక్షణం నిమగ్నమై ఉంటుందన్నారు. ఈ బృందం లో 20 మంది మహిళా సభ్యులు

ఉంటారని, విశాఖ రైల్వే స్టేషన్ కు రాక పోకలు సాగించే రైళ్లల్లో ప్రయాణించే మహిళా ప్రయాణీకులకు సహాయ సహకారాలు అందిస్తారని తెలియచేసారు. ముఖ్యంగా బాలికలు, మహిళపై

ఈవ్ టీజింగ్ లు జరిగినా, మహిళలకు కేటాయించిన బోగీల్లో పురుషులు కూర్చున్నా వారిపై తగిన చర్యలు తీసుకుంటారని వివరించారు. ఈ బృందానికి ప్రత్యేక డ్రెస్ కోడ్ కూడా

ఉందన్నారు. వీరిని చూడగానే సుభద్ర వాహిని సభ్యులుగా గుర్తించవచ్చన్నారు. 
ఈ సమావేశం లో అదనపు రైల్వే డివిజనల్ మేనేజర్ కె. ధనుంజయ్ రావు, రైల్వే పోలీసు విభాగం

సీనియర్ రక్షణ కమిషనర్ జితేంద్ర శ్రీవాస్తవ, డివిజనల్ కమర్షియల్ మేనేజర్ అశోక్ రావు, రైల్వే ఉన్నతాధికారులు, రైల్వే పోలీసు విభాగం అధికారులు పాల్గొన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam