DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వెంకయ్య పై వ్యక్తిగత విమర్శ చేసే స్థాయి నీకు లేదు. . .

వైఎస్ జగన్ కు బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి హెచ్చరిక 

సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి

సీఎం కు రాజ్యాంగ హోదా విలువ తెలియక పోవడం

దౌర్భాగ్యం 

వైఎస్ జగన్ తీరుపై బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి మండిపాటు 

యార్లగడ్డా . . నీ ఉద్యోగం ఉందొ  à°²à±‡à°¦à±‹ సాయంత్రం లోగా చెప్పాలి

టీడీపీ

అంటరాని పార్టీ యే: . .

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS) : . . .

విశాఖపట్నం, నవంబర్ 12, 2019 (డిఎన్‌ఎస్‌) : రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి వెంకయ్యనాయుడు ని ఎపి సీఎం జగన్

వ్యక్తిగతంగా విమర్శించే స్థాయి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి లేదని బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం

నగరంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు భాష కోసం వెంకయ్య నాయుడు విశేష కృషి చేసారని, అయన బీజేపీ

పార్టీలోనే సుదీర్ఘ కాలం పని చేసారని, గంటకో పార్టీ మారలేదన్నారు. భారత రాజకీయాల్లో వెంకయ్య ఒక రోల్ మోడల్ గా అభివర్ణించారు. అయన చరిత్ర తెలియక పొతే

తెలుసుకోమన్నారు. ప్రతి రాష్ట్రంలోని వారూ వారి మాతృభాషలోనే ప్రాధమిక విద్య ను అభ్యసించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారని, అంతే గాని ఏ భాషనూ అయన

వద్దని చెప్పలేదన్నారు. జై ఆంధ్రా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి వెంకయ్య అన్నారు. 

భారతీయ విద్య వ్యవస్థను బ్రష్టు పట్టించిన మెకాలే, నిజాం లకు

వారసుడిగా జగన్ మోహన్ రెడ్డి ప్రవర్తించారన్నారు. వెంకయ్య నాయుడు భారతీయ అత్యున్నత ఉప రాష్ట్రపతి à°—à°¾  à°°à°¾à°œà±à°¯à°¾à°‚à°—  à°ªà°¦à°µà°¿à°²à±‹ ఉన్నారని, అలాంటి వ్యక్తిమీద చవకబారు

వ్యాఖ్యలు చేసిన వైఎస్ జగన్ కు రాజ్యాంగ పదవులపై గౌరవం లేదని తెలుస్తోందన్నారు. అలా పదవులపై విలువ లేనప్పుడు గవర్నర్ చేత ముఖ్యమంత్రి గా ఎందుకు ప్రమాణం

చేయుంచుకున్నావని జగన్ ను ప్రశ్నించారు. 

అధికార తెలుగు భాషను ముఖ్యమంత్రి అవనించడమేనని, అనకాపల్లిలో కాని అమెరికా లోకాని వెంకయ్య  à°—ారు ఓకేలాగ

 à°…న్నిభాషలవిషయంలో ఓకేలాగ మాట్లాడుతారన్నారు. 

తెలుగులో చదువుకున్న పివి  à°­à°¾à°°à°¤ ప్రధానిగా కాలేదా ! రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి  à°ªà°¨à°¿à°šà±‡à°¯à°²à±‡à°¦à°¾ ! నేడు

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఉన్నత స్థానంలో దేశ ద్వితియ పౌరుడుగా  à°…త్యన్నతతస్థాయిలో  à°‰à°¨à±à°¨à°µà°¿à°·à°¯à°‚ మీకుకూడ తెలుసు కాదా?

ఇలా వ్యవహరిస్తే మీ పార్టీకి

మంచిది కాదు, మీ పాలనకూ మంచిది కాదని, త్వరలోనే ప్రజలు గట్టిగా బుద్ది చెప్తారన్నారు. 

మాతృభాషను అందరూ గౌరవించాలి అని వెంకయ్యనాయుడు చెప్పడం తప్పుగా

అనిపించిందా. ? మీ తండ్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి తెలుగులో చదువుకోలేదా..
ముఖ్యమంత్రిగా పనిచేయలేదా!  à°ªà±à°°à°œà°¾ సమస్యలను ప్రక్కదారి పట్టించడమే à°ˆ విధమైన ప్రజా

వ్యతిరేక జీలో లని విడుదల చెయ్యడానికి కారణం మీ అలోచనా కాదా అని మండిపడ్డారు. ఈ ఆరు నెలల పాలనలో ఎన్ని కార్పొరేట్ స్కూళ్లను మూసేసారో సీఎం చెప్పాలని, దీనిపై

బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. 

యార్లగడ్డ నీ ఉద్యోగం ఉందా.. లేదో సాయంత్రం లోగా చెప్పాలి

తెలుగు భాషకు బద్ద వ్యతిరేకులా పని చేస్తున్న

వైఎస్ జగన్ అధికార భాష సంఘం డీక్షుడు యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ఉద్యోగం ఉంచాడో లేక à°Šà°¡ పీకాడో à°ˆ రోజు సాయంత్రం లోగా యార్లగడ్డే చెప్పాలని డిమాండ్ చేసారు.  à°®à±€

తండ్రి ప్రపంచ తెలుగు మహా సభలు నిర్వహించిన విషయం గుర్తుంచుకోవాలనన్నారు. చరిత్రలో చాలామంది నియంతలు ఏమయ్యారో తెలుసు కోవాలి

చరిత్రలో మీ పేరు మొదట ఉండాలా..

చివర ఉండాలా.. నిర్ణయించుకోండని, ప్రభుత్వ తీరు గొయ్యి తవుకుని à°† గొయ్యిలో పడ్డట్టుగా ఉండదు అన్నారు. 

టీడీపీ అంటరాని పార్టీ యే: . . .

నమ్మక ద్రోహి, ఆంధ్ర

ప్రజల ద్రోహి చంద్రబాబుతో బీజేపీ కలిసి ఎన్నడూ పని చెయ్యదు అని విష్ణు వర్ధన్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో పాలనను పూర్తి గా భ్రష్టు పట్టించారని, బీజేపీ కి

పూర్తిగా నమ్మక ద్రోహం చేసారని, ఆ మాటకొస్తే వాళ్ళ పార్టీ కి కూడా ద్రోహం చేశారన్నారు. ఆ పార్టీ నుంచి ఎవరు వచ్చినా బీజేపీ లో చేర్చుకుంటామని, అయితే చంద్రబాబు,

అతని కొడుకు లోకేష్ లకు మాత్రం బీజేపీ లో స్థానం లేదని తేల్చేశారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam