DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్టూడెంట్ బస్ పాస్ లకు ఏడాది గడువు కాలం : ఆర్టీసీ ఈడీ అన్సారీ 

విశాఖపట్నం, జూన్ 11, 2018 (DNS Online) : విశాఖపట్నం లో వివిధ విద్య సంస్థల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థినీ విద్యార్థులకు ప్రతీ ఏటా అందించే బస్సు పాస్ ల జారీ ని సులభతరం

చేస్తున్నట్టు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ఎస్ ఆ అన్సారీ తెలిపారు. సోమవారం నగరం లోని ఎం వీ పీ కోలనీ బస్ డిపో వద్ద , 2018 - 19 విద్య సంవత్సరం కు గాను విద్యార్థుల

బసుపాస్ లను ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ గతం లో ప్రతి మూడు నెలలకు ఒకసారి రెన్యూవల్ చేసుకోవాల్సి వచ్చేదని, అయితే విద్యార్థుల విలువైన కాలాన్ని

దృష్టిలో ఉంచుకుని, ఈ విద్య సంవత్సరం నుంచి 12 నెలల గడువు కాల పరిమితి తో పాస్ లను అందిస్తున్నామన్నారు. తద్వారా సమయం తో పాటు రెన్యూవల్ చార్జీలు కూడా

మిగులుతాయన్నారు. 

రెన్యూవల్ ఇబ్బంది లేకుండా à°ˆ సదుపాయం కల్పిస్తున్నట్టు వివరించారు. బస్సు పాస్ కోసం దరఖాస్తు చేసేవారు www .apsrtcpass.in  à°¦à±à°µà°¾à°°à°¾ అంతర్జాలం లో గానీ

లేదా ఆయా ప్రాంతాలకు సమీపంలో ఉన్న డిపో బస్ పాస్ కౌంటర్ల వద్ద గానీ ఆర్టీసీ సిబ్బంది చే వెరిఫికేషన్  à°¸à±à°Ÿà°¾à°‚ప్ వేయించుకున్న తర్వాత దరఖాస్ట్ తో పాటు ఆధార్ కార్డు

నకలు దరఖాస్తు కు జత చేయాలన్నారు.  à°µà°¿à°¦à±à°¯à°¾à°°à±à°¥à±à°²à± చెల్లించవలసిన ఫీజు రుసుము వివరాలను తెలిపారు. గతం లో ఇచ్చిన మూడు నెలల గడువు పాస్ లు కూడా అందుబాటులో ఉంటాయన్నారు.

ఈ ఏడాది గడువు బస్ పాస్ లు విశాఖపట్నం నగరం లోని ఎం వీ పీ కోలనీ, మద్దిలపాలెం, ద్వారకా బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, ఎం ఏ డి కొత్తరోడ్, పెందుర్తి, సింహాచలం, గాజువాక,

కూర్మన్నపాలెం, మధురవాడ ( చంద్రం పాలెం ) ల బస్ కౌంటర్ల వద్ద లభిస్తాయన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో

వినియోగించుకోవాలన్నారు. 

ఈ విలేకరుల సమావేశం లో విశాఖ ప్రాంతీయ మేనేజర్ సుధీష్ కుమార్, డిప్యూటీ సి టీ ఎం అర్బన్ ఎం. సుధా బిందు, డిప్యూటీ సి టీ ఎం రూరల్ కె,

వెంకట రావు, వివిధ డిపోల మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు. 


ఉచిత బస్సు పాస్ ల వివరాలు :

ఆర్టీసీ సంస్థ విద్యార్థులకు అందిస్తున్న ఉచిత బస్సు పాస్ లను

బాలురు ( 12 సంవత్సరాల లోపు), బాలికలు ( 18 సంవత్సరాల లోపు) అర్హులన్నారు. స్కూల్ యాజమాన్యం చే ధ్రువీకరణ చేయించుకుని, ఏపీఎస్ ఆర్టీసీ సిబ్బంది చే వెరిఫికేషన్ స్టాంప్

వేయించిన దరఖాస్తు తో పాటు రెండు ఫోటోలను జతపరచాలన్నారు. 

జనరల్ బస్ పాస్ - సిటీ :  à°°à±‚. 390 (3 నెలకు), 10 à°µ తరగతి విద్యార్థులకు 10 నెలలకు రూ. 1300 ,  9 నెలలకు రూ. 1170 ,  8 నెలలకు రూ. 1040 ,  7

నెలలకు రూ. 910 ,  à°‡à°‚టర్ విద్యార్థులకు 11 నెలలకు రూ. 1430 ,  10 నెలలకు రూ. 1300 ,  9 నెలలకు రూ. 1170 ,  8 నెలలకు రూ. 1040 లు ధరలు నిర్ణయించారు. 

జనరల్ బస్ పాస్ స్పెషల్ - (జె à°“ సి) :  à°°à±‚. 630 (3 నెలకు), 10 à°µ

తరగతి విద్యార్థులకు 10 నెలలకు రూ. 2100 ,  9 నెలలకు రూ. 1890 ,  8 నెలలకు రూ. 1680 ,  7 నెలలకు రూ. 1470 ,  à°‡à°‚టర్ విద్యార్థులకు 11 నెలలకు రూ. 2310 ,  10 నెలలకు రూ. 2100 ,  9 నెలలకు రూ. 1890 ,  8 నెలలకు రూ. 1680 లు ధరలు

నిర్ణయించారు. 

దీనికి అదనంగా జనరల్ బసుపాస్ - గ్రేటర్ విశాఖ లో తిరిగేందుకు ప్రత్యేక ధరలను నిర్ధారించారు. జనరల్ బసుపాస్ కు అదనంగా రూ. 105  à°¨à±à°‚à°šà°¿ రూ  385 , అదనపు

టారిఫ్ ను వసూలు చేయాలని నిర్ణయించారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam