DNS Media | Latest News, Breaking News And Update In Telugu

70 ఏళ్ళల్లో కాంగ్రెస్ చెయ్యని పని . . మోడీ చేసి చూపారు  

కాశ్మీర్ లో అంతా ప్రశాంతంగానే ఉంది : . ..  

మోడీ కి ఒక్కసారి అవకాశం ఇస్తేనే - . . .

పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం : . .

హోమ్ శాఖా సహాయ మంత్రి

కిషెన్ రెడ్డి ప్రకటన.    

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . .

విశాఖపట్నం, నవంబర్ 13, 2019 (డిఎన్‌ఎస్‌) : స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏడు దశాబ్దాల కాలం దేశాన్ని పాలించిన

కాంగ్రెస్ పార్టీ చెయ్యలేని పనిని బీజేపీ నేతగా నరేంద్ర మోడీ ఎంతో కాశ్మీర్ సమస్యను సమర్ధవంతంగా పరిష్కరించారని,  à°•à±‡à°‚ద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి

తెలిపారు. రెండు రోజుల విశాఖ నగర పర్యటనకు వచ్చిన ఆయన బుధవారం భారతీయ జనతా పార్టీ నగర కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నాటి జవహర్ లాల్

నెహ్రు, ఇండియా, పీవీ నర్సింహారావు, రాజీవ్ వరకూ అందరికీ దేశ ప్రజలు 400 ఎంపీ సీట్లకు పైగా మెజారిటీ ఇచ్చి అధికారాన్ని కట్టబెట్టారని, కాశ్మీర్ ప్రజలకు ఈ పాలకులు

గుదిబండలా 370 ఆర్టికల్ ను కట్టబెట్టారన్నారు. అయినప్పటికీ వీళ్ళెవ్వరికీ కాశ్మీర్ ప్రజల రక్షణ పట్టలేదన్నారు. ఈ 370 ఆర్టికల్ ను ప్రవేశ పెట్టి కాశ్మీర్ లోయ,

రాష్ట్రాన్ని మొత్తం అగాధం లోని నెట్టేసిన ఘనుడు నెహ్రూయే అన్నారు. నాడు హోమ్ మంత్రి హోదాలో కాశ్మీర్ ను భారత్ లో పూర్తి స్థాయిలో కలిపేసి విధంగా సర్దార్ పటేల్

పూర్తి గా శ్రమిస్తే, తన రాజకీయ మనుగడ కోసం దాన్ని తుంగలోకి తొక్కి పాకిస్తాన్ కు అనుకూలంగా 370 ఆర్టికల్ ను అమలులోకి తెచ్చిన ఘనుడు నెహ్రు ఏ అన్నారు. ఎన్నో

పర్యాయాలు కాంగ్రెస్ పార్టీకి భారత పార్లమెంట్ లో పూర్తి మెజారిటీ ఇస్తే. . కాశ్మీర్ లో మత కల్లోలాలు రెచ్చగొట్టేలా సహకరించారు తప్ప, అమాయక కాశ్మీర్ ప్రజలకు

శాంతియుత జీవనాన్ని ఇవ్వలేదన్నారు. 

కాశ్మీర్ లో అంతా ప్రశాంతంగానే ఉంది : . . .  

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ రాష్ట్రంలోనూ, కేంద్రపాలిత ప్రాంతమైన

లడక్ లోనూ పూర్తి శాంతి భద్రతలు నెలకొన్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పుడిప్పుడే సాధారణ వాతావరణం ఏర్పడుతోందని, విద్య సంస్థలు, వ్యాపార సంస్థలు, పర్యాటక

కేంద్రాలు, సాధారణ జన జీవనం యాధస్థితికి చేరుకుంటోందన్నారు. 

మోడీ కి ఒక్కసారి అవకాశం ఇస్తేనే - . . .

నరేంద్ర మోడీ కి ఒక్క సారి అవకాశం ఇస్తేనే ఇన్ని

అపరిష్కృత సమస్యలకు శాంతియుతంగా పరిష్కారం చూపించారన్నారు. సబ్ కా సాత్ - సబ్ కా వికాస్ - సబ్ కా విశ్వాస్ నినాదమే ధ్యేయంగా దేశ వ్యాప్తంగా ఎన్నో సంస్కరణలను

చేపట్టారన్నారు. 
సుమారు 140 ఏళ్ళ నుంచి హిందువులు, ముస్లిం లలోనే ఎంతో సందిగ్ధం పెంచిన అయోధ్య శ్రీరామ జన్మభూమి పై నరేంద్ర మోడీ 2.0 తొలినాళ్లలోనే శాశ్వత పరిష్కారం

అందరికీ ఆమోదయోగ్యంగా లభించిందన్నారు. అదే విధంగా ముస్లిం సోదరీమణులకు అండగా నిలబెట్టానని ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ట్రిపుల్ తలాక్ విధానాన్ని రద్దు

చేశారన్నారు. బాలిక వికాస్, రైతు సంక్షేమం, ముద్ర రుణాలు, బాలిక సురక్ష, సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్, అయుష్మాన్ భారత్, గ్రామీణ ఆవాస్, జన్ ధన్ యోజన, అందరికీ బ్యాంకు

అకౌంట్ లు, తదితర ఎన్నో సంక్షేమ పధకాలను అందించారన్నారు. ప్రధానంగా భారత్ దేశానికి  à°‡à°¤à°° దేశాల నుంచి రక్షణ కల్పిస్తున్న సైనిక బలగాలకు à°…à°‚à°¡à°—à°¾ నిలిచి వారితో

మమేకమై పర్వ దినోత్సవాలను దేశ సరిహద్దుల్లోనే  à°œà°°à±à°ªà±à°•à±à°‚టున్న ఏకైక ప్రధాని నరేంద్ర మోడీయే అన్నారు. 

పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం : .

.

తెలుగుదేశం పార్టీకి చెందిన  à°µà°¿à°¶à°¾à°– ఉత్తర ఎమ్మెల్యే à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ను కలిసిన ఫోటోలు వైరల్ కావడంపై కిషెన్

రెడ్డి స్పందించారు.  
బీజేపీ సిద్ధాంతాలు నచ్చి, పార్టీలోకి ఎవరు వచ్చినా సాదర పూర్వకంగా ఆహ్వానిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణా

రాష్ట్రాల్లో బీజేపీ మరింత బలోపేతం అవుతోందన్నారు. దీనిలో భాగంగానే ఆంధ్ర నుంచి ఇప్పడికే నలుగురు రాజ్యసభ సభ్యులు తెలుగుదేశం నుంచి బీజేపీ లో చేరారని,

మరికొందరు ఎమ్మెల్యే లు బీజేపీ తో నడిచేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.  à°ªà°¾à°°à±à°Ÿà±€ అధిష్టానంతో ఎందరో చర్చలు జరుపుతారని, వాళ్ళు పార్టీ లో చేరేవరకూ బహిర్గతం

చెయ్యడం వీలుకాదన్నారు. 

అనంతరం తూర్పు గోదావరిజిల్లా ప్రత్తిపాడు కు చెందిన పలువురు కేంద్రమంత్రి కిషెన్ రెడ్డి సమాశంలో బీజేపీ లో చేరారు. వారికి కిషెన్

రెడ్డి కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. 

à°ˆ విలేకరుల సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ శాఖా ఇంచార్జి సునీల్ దేవధర్, రాష్ట్ర శాఖా à°…ధ్యక్షులు కన్నా

లక్ష్మీనారాయణ, ఉత్తరాంధ్ర జిల్లాల ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ ఎంపీ హరిబాబు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, అధికార

ప్రతినిధి సుహాసిని ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam