DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*టిడిపి లో చీలిక తప్పదు, మిగిలేది చంద్రబాబు ఒక్కడే. ..* 

*టిడిపి ఎమ్మెల్యేలు బాబును పార్టీ నుంచి వెళ్ళగొడతారు* 

*మూడొంతుల ఎమ్మెలేలు చీలి, మాదే టిడిపి అంటారు*

*బాబు కు ప్రజలే రిటైర్ మెంట్ ఇచ్చేసారు, అయినా

వినడం లేదు* 

*బాబు వి అన్ని దొంగనాటక దీక్షలే, వాటిలో చిత్తశుద్ధి లేదు* 

*ఇసుక దీక్ష పేరుతొ నాటకం ఆడబోయి బొక్కబోర్లా పడ్డాడు* 

*వైకాపా ప్రధాన

కార్యదర్శి దాడి వీరభద్ర రావు* 

*రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం )*: . . .

*విశాఖపట్నం, నవంబర్ 15, 2019 (డిఎన్‌ఎస్‌): మూడొంతుల మందితెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు

బయటకు వచ్చి, వేరుకుంపటి పెట్టి మాదే అసలైన టిడిపి అంటరాని, ఆరోజు అతి తొందరలోనే ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు అన్నారు.

శుక్రవారం నగరంలోని పార్టీ నగర కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ ప్రసుత రాష్ట్ర రాజకీయ పరిస్థితులను బట్టి అందుతున్న సంకేతాలు

ప్రకారం తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబునే బయటకు పంపుతారన్నారు. ప్రజలు గత ఎన్నికల్లోనే చంద్రబాబు కు పదవి విరమణ ప్రకటించేశారని, అయినా కూడా నేను ఉన్నా అంటూ

వెంటపడుతున్నదన్నారు. టిడిపి నుంచి కనీసం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బయటకు వచ్చి తమదే అసలైన టిడిపి అని శాసన సభాపతికి లేఖలు

సమర్పించబోతున్నారన్నారు. ఇదే జరిగితే పార్టీ తుడిచిపెట్టుకు పోయినట్టేనన్నారు.* 

*చంద్రబాబు కు అభిమానం ఉన్నది కేవలం అతని కొడుకు లోకేష్ మీద తప్ప, మరో

మనిషి మీద లేదన్నారు. చంద్రబాబు చేసే దీక్షలన్నీ దొంగ దీక్షలేనని, దేనిలోనూ చిత్తశుద్ధి లేదని, గురువారం గుంటూరులో ఇసుక దీక్ష అంటూ 12 గంటల పాటు తెలుగు ప్రజలకి

పెద్ద సినిమా చూపిద్దామనుకుని బొక్కబోర్లా పడ్డాడని ఎద్దేవా చేసారు. ఇద్దరు జూనియర్ ఆర్టిస్ట్ లకు భవన కార్మికులుగా మేకప్ వేసి 12 గంటల సమయం షో చేశారని, ఈ దీక్షే

నిజంగా చేసి ఉంటె దీనిలో పాల్గొనేందుకు తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా ఎందుకు రాలేదని హేళన చేసారు. ఇతను దీక్ష పేరుతొ షో చేస్తే టిడిపి ఎమ్మెల్యేలు పార్టీలు

మారే  à°¸à°®à°¾à°²à±‹à°šà°¨à°²à±‹ ఉంది ఇతనికే పెద్ద షో చూపెట్టారన్నారు.* 

*గుళ్ళల్లో అన్యమత ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని

మతాలనూ గౌరవిస్తుందని తెలిపారు. పార్టీ పేరిట దుష్ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అన్నవరం లో ఏకంగా గుడిలోనే క్రైస్తవ పాటలు పాడడం

ఖండిస్తున్నామన్నారు.*  
 
*à°ˆ విలేకరుల సమావేశంలో పార్టీ సీనియర్ నేత రవిరెడ్డి పాల్గొన్నారు.* 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam