DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నేటి నుంచి వైజాగ్ జూనియర్ లిటరరీ ఫస్ట్ 

బాలల అభ్యున్నతి కోసం అంతర్జాతీయ వక్తల సూచనలు 

బాలలే రచయితలుగా పుస్తక ప్రచురణలు 

à°•à°¥ రచనలు, కధనాల పై రెండురోజుల వేడుకలు 

తోలుబొమ్మలాట పై

ప్రత్యేక కధనం :. .

పిల్లల తో వ్యవహరించే తీరు పై : . .

రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం ): . . .

విశాఖపట్నం, నవంబర్ 15, 2019 (డిఎన్‌ఎస్‌): బాలల లోని నైపుణ్యాన్ని వెలికి

తీసేందుకు లిట్ లాంటర్న్ కల్చర్, లిటరేచర్ వెల్ఫేర్ సొసైటీ సంస్థ రెండు రోజుల పాటు బాలల సాహిత్య వేడుకలు నిర్వహిస్తోంది. ఈ నెల 16 నుంచి రెండు రోజుల పాటు విశాఖ నగరం

లోని సాగర తీరం లో గల హవామహల్ వేదికగా నవయుగ వైజాగ్ జూనియర్ లిటరరీ ఫస్ట్ ను నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు సోనాల్ సర్ద, ప్రియా ఉప్పలపాటి, సంధ్య గోడే లు

వివరించారు. ఈ కార్యక్రమం వివరాలను తెలియచేసేందుకు నిర్వహించిన విలేకరుల సమావేశం లో వారు మాట్లాడుతూ గత ఏడాది ప్రారంభించిన ఈ బాలల వేడుకలకు బాలలు,

తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. దీనిలో భాగంగా ఈ ఏడాది రెండు రోజుల పాటు హవామహల్ లో ఈ వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు.

ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ పలువురు ప్రముఖులచే చిన్నారులకు వయసుల వారీగా కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ పోటీల్లోసుమారు 20 మంది జాతీయ,

అంతర్జాతీయ వక్తలు, బాలల సాహిత్యం పై పరిశోధనలు చేస్తున్న వారు, పారో ఆనంద్, రూపా పాయ్, జీవ రఘునాధ్, దీపా కిరణ్, కపిల్ పాండే, తదితర పుస్తక రచయితలూ, కథకులు,

ప్రచురణకర్తలు పాల్గొన్నటున్నారన్నారు. ప్రముఖ బాలల కథకులు రోజర్ జంకిన్స్ మాట్లాడుతూ చిన్నారులతో వ్యవహరించాలంటే వారి స్థాయికి పెద్దలు తగ్గి

ప్రవర్తించానన్నారు. సమావేశంలో పేజెస్ అధినేత సునీల్ నెవాటియా తదితరులు పాల్గొన్నారు. 

తోలుబొమ్మలాట పై ప్రత్యేక కధనం :. . .

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి

ప్రత్యేకమైన తోలుబొమ్మలాట ప్రక్రియ ను ఈ వేడుకల్లో ప్రదర్శించడం జరుగుతుందన్నారు. ఈ ప్రదర్శన ద్వారా పిల్లల్లో పలు సామాజిక, విద్యా సంబంధిత అంశాలపై చైతన్యం,

అవగాహనా కల్పించడం జరుగుతుందన్నారు. 

పిల్లల తో వ్యవహరించే తీరు పై : . . .   

సాధారణం గా పిల్లలు అందరూ ఒకే విధమైన ప్రవర్తనలో ఉండరని, వారితో

వ్యవహరించవలసిన విధానాన్ని ప్రముఖ పిల్లల అవగాహనా నిపుణులతో తల్లిదండ్రులకు సదస్సు నిర్వహించడం జరుగుతుందన్నారు. 
ఈ రెండు రోజుల కార్యక్రమం లో నగర వాసులు తమ

చిన్నారులతో కలిసి వచ్చి, à°ˆ సదస్సుల్లో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam