DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎయు పూర్వ విద్యార్థి మేళా కు ఆకర్షణ సి ఎం వైఎస్ జగన్

ఎయు నుంచి పట్టా పొందిన ప్రతి ఒక్కరు పూర్వ విద్యార్ధే. . .

సాగర తీరం వద్ద డిసెంబర్ 13 à°¨ ఎయు పూర్వ విద్యార్థి మేళా 

90 లక్షల విద్యార్థి సైన్యం ఎయు చరిత్ర:

చైర్మన్ బీలా..

ప్రపంచంలోని ఎయు విద్యార్థులను కలిపేదీ à°ˆ మేళా 

రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం ): . . .

విశాఖపట్నం, నవంబర్ 16, 2019 (డిఎన్‌ఎస్‌): డిసెంబర్ 13 à°¨

అట్టహాసంగా జరుగనున్న ఆంధ్ర విశ్వ కళాపరిషత్  (ఎయు) పూర్వ విద్యార్థి మేళాకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాన ఆకర్షణ కానున్నారు.

శనివారం ఎయు సమావేశ మందిరం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పూర్వ విద్యార్థి సంఘం అధ్యక్షులు డాక్టర్ బీల సత్యనారాయణ మాట్లాడుతూ గత 90 ఏళ్ళ చరిత్రలో ఎయు నుంచి

వివిధ డిగ్రీలు పొందిన వారు నాటి నుంచీ నేటి వరకూ దేశ విదేశాల్లో దేశాల్లో అత్యున్నత  à°¹à±‹à°¦à°¾à°²à±à°²à±‹ ఉన్నారని తెలిపారు. భారత ఉపరాష్ట్రపతి à°Žà°‚. వెంకయ్య నాయుడు కూడా ఎయు

పూర్వ విద్యార్ధేనని, భారత రిజర్వ్ బ్యాంకు పూర్వ గవర్నర్ à°¡à°¿ వి సుబ్బారావు, జిఎంఆర్ సంస్థల చైర్మన్ గ్రంధి మల్లిఖార్జున రావు,  à°‡à°‚డియన్ బ్యాంకు సిఎండి  à°ªà°¦à±à°®à°œ

చుండూరు ఇలా ఎందరో ఎయు నుంచి విద్యార్భ్యాసం చేసినవారేనన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎయు కుటుంబ సభ్యులను ఒక్కటి చేసేందుకే ఈ మేళ నిర్వహిస్తున్నామని

తెలిపారు. ఎయు ఇంచార్జి ఉపకులపతి డాక్టర్ పివిజిడి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, ఎయు నుంచి సర్టిఫికెట్, డిప్లమా, డిగ్రీ, ఎంఫిల్, పీహెడీ, తదితర పట్టాలు పొందిన ప్రతి

ఒక్కరూ ఎయు పూర్వ విద్యార్ధిగానే కొనసాగుతారన్నారు. ఎయు నుంచి ఇతర విశ్వవిద్యాలయాలకు వెళ్లే ముందువరకూ చాలా కళాశాలలు, యూనివర్సిటీలు ఏయూకు అనుబంధంగా ఉండేవని,

అప్పడి వరకూ పట్టాలు తీసుకున్న వారు కూడా ఎయు విద్యార్థులేనన్నారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ ఎన్నో విద్యాలయాలు ఎయు నుంచి ప్రారంభమయ్యాయన్నారు. గత

తొమ్మిది దశాబ్దాల్లో ఎయు నుంచి 90 లక్షలకు పైగా విద్యార్థులు వివిధ విభాగాల నుంచి పట్టాలు పొందారన్నారు. 

డిసెంబర్ 13 న విశాఖపట్నం సాగర తీరంలోని ఎయు

కన్వెన్షన్ కేంద్రంలో ఈ సమావేశం సాయంత్రం 4 నుంచి ప్రారంభమవుతుందన్నారు. దీనికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిధిగా

హాజరవుతున్నట్టు తెలిపారు. అదే సమయంలో శాసన సభ సమావేశాలు ఉన్నప్పడికి ఈ మంచి కార్యక్రమానికి తప్పని సరిగా వస్తానని హామీ ఇచ్చారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది

మంది కు ఉపాధి కల్పిస్తున్న టెక్ మహీంద్రా సి ఈఓ కూడా విశిష్ట అతిధిగా వస్తారన్నారు.   

ఇప్పడికే పూర్వ విద్యార్థుల నుంచి ఎంతో సహకారం లభిస్తోందని తెలిపారు.

ఇక నుంచి ఎయు లో జరిగే ప్రతి కార్యక్రమం లోనూ పూర్వ విద్యార్థి ప్రతినిధులకు పెద్ద పీట వేస్తామన్నారు. ఎయు అధికారులు, విద్యార్థులతో సహా ఎవరికైనా ఎటువంటి సమస్యలు

వచ్చినా నేరుగా పూర్వ విద్యార్థి సంఘాన్ని సంప్రదించాలన్నారు.  

90 లక్షల విద్యార్థి సైన్యం ఎయు చరిత్ర: . . .

గత తొమ్మిది దశాబ్దాల్లో ఎయు నుంచి విద్యాభ్యాసం

చేసిన వారి సంఖ్యా సుమారు 90 లక్షలకు పైగానే ఉంటుందని ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఎయు ఖ్యాతిని దేశ విదేశాల్లో ఇనుమడింపచేసిన వీరందరికీ సముచిత గౌరవం ఇవ్వ వలసిన

భాద్యత ఎయు పై ఉందన్నారు. దీనిలో భాగంగానే అదే రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ అన్ని విభాగాల్లోనూ విద్యార్థి సమావేశాలు జరుగుతాయని, పెద్దలు, చిన్నలు తేడా లేకుండా

అందరూ కలిసి చర్చల్లో పాల్గొంటారన్నారు. నేడు ప్రపంచంలోని ఏ దేశంలో, ఏ సంస్థలో  à°šà±‚సినా ఎయు విద్యార్థి దర్శనం ఇస్తారన్నారు. అమెరికా, యుకె, కెనడా, ఆస్ట్రేలియా,

న్యూజిలాండ్, జెర్మనీ, తదితర దేశాల్లో అత్యున్నత స్థానాల్లో ఉన్నారన్నారు. 

పలు భవనాల నిర్మాణానికి హామీలు :. . .

ఎయు లోని పలు భవనాలను, వసతి గృహాలను

నిర్మించేందుకు పూర్వ విద్యార్థులు హామీ ఇచ్చారని వాటికి అదే రోజున శంఖుస్థాపన చేయనున్నట్టు తెలియచేసారు.  à°ˆ విలేకరుల సమావేశంలో రిజిస్ట్రార్ కృష్ణమోహన్, ఇతర

సభ్యులు పాల్గొన్నారు. 

ఎయు తో అనుబంధం ఉన్న ప్రముఖుల్లో కొందరు : . . . . 

భారత రాష్ట్ర పతిగా విధులు నిర్వహించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇదే విద్యాలయానికి

రెండవ ఉపకులపతిగా విధులు నిర్వహించారు. ప్రస్తుత భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఎయు న్యాయ కళాశాల విద్యార్థి కావడం గమనార్హం. అదే విధంగా ఇథియోపియా దేశంలో

అత్యున్నత హోదాల్లో ఉన్న వారు కూడా ఎయు విద్యార్థులే. 

ఇతర ప్రముఖుల్లో పలువురు :
  
పద్మజ చుండూరు, à°Žà°‚à°¡à°¿ , సి à°Žà°‚ à°¡à°¿  à°‡à°‚డియన్ బ్యాంకు
ప్రొఫెసర్ కె వి రమణ, మాజీ

ఉపకులపతి  
శ్రీనివాస కందుల 
జె వి ఆర్ ప్రసాద్ రావు ఐ ఏ ఎస్
à°¡à°¿ వి సుబ్బారావు, ఆర్బీ ఐ మాజీ  à°—వర్నర్ 
హెచ్ జె దొర మాజీ డిజిపి
పిప్ ఎల్  à°¸à°‚జీవ రెడ్డి, ఐ ఏ ఎస్
ఎస్

ఆర్ రావు, ఐ ఏ ఎస్
డాక్టర్ à°Žà°‚. మాలకొండయ్య, ఐ పీఎస్ 
పూర్ణ సగ్గుర్తి  à°šà±ˆà°°à±à°®à°¨à± గ్లోబల్ కార్పొరేట్
డాక్టర్ ఎం. ఎస్ సంజీవ రావు
త్రివిక్రమ్ శ్రీనివాస్
కె. ఐ

వరప్రసాద్, శాంతా బయో టెక్నాలజీ
హయగ్రీవ రావు
ఉప్పుగుండూరి అశ్వథా నారాయణ
ప్రో. కె ఎస్ చలం
డాక్టర్ కూటికుప్పల సూర్యారావు
డాక్టర్ నిలి బెండపూడి
ప్రో. ఆర్

రాధాకృష్ణ, మాజీ ఉపకులపతి 
ప్రో. కె సి రెడ్డి, చైర్మన్, ఐఐఐటి 
ఎం. ఆర్ అహ్మద్
డాక్టర్ . యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్
జస్టిస్ జె. చలమేశ్వర్
జస్టిస్ రోహిణి
/> జస్టిస్ కె. రామస్వామి
గంట శ్రీనివాస రావు, ఎమ్మెల్యే
డాక్టర్ కె. హరిబాబు, మాజీ ఎంపీ
డాక్టర్ ఎం ఎం పళ్లంరాజు, మాజీ కేంద్ర మంత్రి
డాక్టర్ గ్రంధి

మల్లిఖార్జున రావు, జి ఎం ఆర్
డాక్టర్ పనబాక లక్ష్మి, మాజీ కేంద్ర మంత్రి, 
గోకరాజు గంగరాజు, మాజీ ఎంపీ
ప్రో. వై సి సింహాద్రి, మాజీ ఉపకులపతి 
ప్రో. కె. రామకృష్ణ

రావు, మాజీ ఉపకులపతి 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam