DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ లో సత్యసాయి జన్మదినోత్సవానికి భారీ ఏర్పాట్లు 

94 వ జన్మదిన వేడుకల్లో సేవా కార్యక్రమాల వెల్లువ

ఆర్తి జన సేవ, నారాయణ సేవ, విద్యా సేవ, వైద్య సేవ. . . 

డాక్టర్ సివి గోపాలరాజు కు సత్యసాయి విశిష్ట సేవా

పురస్కారం 

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం ) : . . .

విశాఖపట్నం, నవంబర్ 16, 2019 (డిఎన్‌ఎస్‌):  à°œà°¨ సంక్షేమం కోసం ఆజన్మాంతం కృషి చేసి, విద్య నుంచి వైద్యం వరకూ గ్రామ

స్థాయిలో ప్రజలకు అంతర్జాతీయ స్థాయిలో సేవలు అందించిన సత్యసాయి 94 వ జన్మ దిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు విశాఖ జిల్లా సత్యసాయి సేవ సమితి

అధ్యక్షులు వి. ఆర్ నాగేశ్వర రావు తెలియచేసారు. ఆదివారం నగరం లోని ఎంవిపి కొలని లోగల సత్యసాయి విద్యా విహార్ పాఠశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన

మాట్లాడుతూ సత్యసాయి జన్మదిన వేడుకలను à°ˆ నెల 19 నుంచి 23 వరకూ వైభవంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 19 à°¨ మహిళాదినోత్సవం,  20 à°¨ సేవా దినోత్సవం, 21 à°¨ యువజన దినోత్సవం, 22 à°¨ బాల

వికాస్ దినోత్సవం, 23 న సత్యసాయి జన్మ దినోత్సవం పురస్కరించుకుని ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

 

సత్యసాయి విశిష్ట సేవ పురస్కారం: . . .

సమాజం లోని పేదలకు విశేష సేవలు అందిస్తున్న ప్రముఖులకు ప్రతి ఏటా సత్యసాయి జన్మ దినోత్సవం సందర్భంగా పురస్కారం

అందిస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే ఎందరికో ఉచితంగా నేత్ర పరీక్షలు, చికిత్సలు చేస్తున్న విశాఖ ఐ ఆసుపత్రికి చెందిన ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్

సివి గోపాలరాజు కు à°ˆ వేడుకల సందర్భంగా సత్యసాయి విశిష్ట సేవా పురస్కారం  à°…ందించడం జరుగుతుందని తెలిపారు. 

ఈ విలేకరుల సమావేశంలో విశాఖ జిల్లా సత్యసాయి సేవ

సంస్థల కార్యదర్శి  à°ªà°¿ ఆర్ ఎస్ ఎన్ నాయుడు మాట్లాడుతూ విశాఖ జిల్లా పరిధిలో సత్యసాయి సంస్థలు అందిస్తున్న ఆర్తి జన సేవ, నారాయణ సేవ, విద్యా సేవ, వైద్య సేవ. . . తదితర

సేవలను, కార్యకలాపాలను వివరించారు.
 
ఈ సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ మీడియా రిలేషన్స్ కన్వీనర్ ద్వారం స్వామి, విశాఖ నగర / ఎంవిపి కోలనీ కన్వీనర్ రమణ తదితరులు

పాల్గొన్నారు.  

వేడుకల వివరాలు :. . .

19 à°¨ (మంగళవారం) మహిళాదినోత్సవం : ఉదయం 10 à°—à°‚à°Ÿà°² నుంచి మహిళల చే లలితా సహస్రనామ పారాయణ, 12  à°—ంటలకు మహిళలకు వస్త్రదానం, నారాయణ

సేవలో భాగంగా అన్న ప్రసాద వితరణ. సాయంత్రం 5 గంటల నుంచి వేద పారాయణ, అష్టోత్తరం, మహిళా సభ్యులచే నమ సంకీర్తన. తదుపరి సాయంత్రం 6 :30 గంటలకు సంస్థ ప్రధాన అధ్యాపకులు

కెవిఎస్ ఉష కుమారి, ఆధ్యాత్మిక ప్రసంగం చేయనున్నారు, అనంతరం భక్తి సంగీతం కొనసాగుతుంది. 

20 న (బుధ వారం) సేవా దినోత్సవం : ఉదయం 10 గంటల నుంచి సేవాదళ్ సభ్యులచే

సత్యసాయి సూపర్ స్పెషలిటీ ఆసుపతుల్లో వైద్య సేవలు పొందిన రోగులకు పునరావాస సేవా కార్యక్రమం , వస్త్రదానం, అన్న ప్రసాద వితరణ. 
సాయంత్రం 5 గంటల నుంచి వేద పారాయణ,

అష్టోత్తరం, మహిళా సభ్యులచే నమ సంకీర్తన. తదుపరి సాయంత్రం 6 :30 గంటలకు సత్యసాయి వీడియో ప్రసంగం ప్రదర్శించబడుతుంది. తదుపరి సమితి గాయకులూ ( పురుషులు) చే సత్యసాయి గాన

సుధాలహరి భక్తి సంగీతం కొనసాగుతుంది. 
 
21 న (గురువారం ) యువజన దినోత్సవం : ఉదయం 9 గంటల నుంచి యువత చే హనుమాన్ చాలీసా పారాయణ, 200 మంది పేదలకు వివిధ ప్రాంతాల్లో అన్న

ప్రసాద వితరణ. à°¸à°¾à°¯à°‚త్రం 5 à°—à°‚à°Ÿà°² నుంచి వేద పారాయణ, అష్టోత్తరం, మహిళా సభ్యులచే నమ సంకీర్తన. అనంతరం యువత, సమితి యువ గాయకులచే నామ సంకీర్తన జరుగుతుంది.   తదుపరి

సాయంత్రం 6 :30 గంటలకు సత్యసాయి యువత కార్యక్రమాల నివేదిక. అనంతరం మాహూయనంది చే భక్తి సంగీత విభావరి జరుగుతుంది. 

22 న (శుక్ర వారం ) బాల వికాస్ దినోత్సవం : సాయంత్రం 5

గంటల నుంచి వేద పారాయణ, అష్టోత్తరం, బాలవికాస గురువులు, మహిళా సభ్యులచే నామ సంకీర్తన. తదుపరి సాయంత్రం 6 :30 గంటలకు బాలవికాస్ విద్యార్థులచే సంక్షిప్త ప్రసంగాలు,

సాంస్కృతిక కార్యక్రమాలు. జరుగుతాయి.

23 à°¨ (శని వారం) సత్యసాయి జన్మ దినోత్సవం : ఉదయం 4 :40 à°—à°‚à°Ÿà°² నుంచి ఓంకారం, సుప్రభాత, గాయనీ గాయకులచే నగర సంకీర్తన,  6 à°—à°‚à°Ÿà°² నుంచి

రుద్రాభిషేకం, ఉదయం 8 గంటలకు  à°µà°¿à°¦à±à°¯à°¾à°°à±à°¥à±à°²à°•à±, వివిధ ఆసుపత్రుల్లో రోగులకు, జైల్లో ఖైదీలకు ప్రసాద వితరణ. 
ఉదయం 9 గంటల నుంచి ఎం ఎస్ ప్రకాశరావు ఆధ్వర్యవం లో సామూహిక

సత్యసాయి వ్రతాలు, తదుపరి సేవ కార్యక్రమాలు, నారాయణ సేవగా అన్న ప్రసాద వితరణ జరుగుతాయి.   
సాయంత్రం 5 గంటల నుంచి వేద పారాయణ, అష్టోత్తరం, సభ్యులచే నామ సంకీర్తన.

తదుపరి సాయంత్రం 6 :00 గంటలకు అనంతపురం కు చెందిన తోటపల్లి నాగరాజు చే ఆధ్యాత్మిక ప్రసంగం, జరుగుతుంది. అనంతరం సత్యసాయి విశిష్ట సేవా పురస్కారం విశాఖ ఐ ఆసుపత్రికి

చెందిన ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ సివి గోపాలరాజు కు అందించడం జరుగుతుంది. 
తదుపరి 94 కిలోల కేక్ ను నైవేద్యం చేయనున్నారు. జన్మదిన వేడుకల ప్రత్యేక

సంచిక సాయి స్పందన పత్రిక విడుదల, తదుపరి ఉయ్యాల సేవ, మంగళ హారతి తో కార్యక్రమాలు పూర్తి అవుతాయి. వేడుకల సందర్బంగా విశాఖ జిల్లా సత్యసాయి సేవ సంస్థల కార్యదర్శి

 à°ªà°¿ ఆర్ ఎస్ ఎన్ నాయుడు నివేదిక అందించడం జరుగుతుంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam