DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రశాంతి కి తప్పిన ప్రమాదం - గుంటూరు లో 3 గంటలకు పైగా నిలిపివేత  

ఏసీ బోగి చక్రం బోల్ట్ ఊడడంతో బోగి మార్చే ప్రయత్నం. 

ఇక్కట్లలో ప్రయాణీకులు. . తాత్సారం చేస్తున్న అధికారులు  

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్

అమరావతి) : . . .

అమరావతి, నవంబర్ 17, 2019 (డిఎన్‌ఎస్‌) : భువనేశ్వర్ నుంచి బెంగుళూరు కు వెళ్తున్న 
ప్రశాంతి ఎక్స్ ప్రెస్ (18463 ) మూడు గంటలకు పైగా గుంటూరు రైల్వే స్టేషన్ లో

నిలిచి పోయింది. ఆదివారం బయలు దేరిన à°ˆ రైలు రాత్రి 8 : 30 సమయానికే గుంటూరు కు చేరుకుందని, అయితే ఏసీ కోచ్ చక్రం బోల్ట్ వూడినట్లు గమనించడం తో అధికారులు à°ˆ  à°°à±ˆà°²à± నిలిపి

వేసి, ఏసీ కోచ్ ను రైలు నుంచి విడదీసి మరో బోగిని అమర్చడం జరిగింది. అయితే ఈ క్రమం లోనే ఈ రైలు ను గుంటూరు స్టేషన్లోనే మూడున్నర గంటలకు పైగా నిలిపేశారు. వివిధ గమ్య

స్థానాలకు వెళ్ళవలసిన ప్రయాణీకులు నానా అవస్థలు పడుతున్నారు. అధికారుల నుంచి సమాధానం మాత్రం ఇదిగో 15 నిమిషాల్లో బయలు దేరుతుంది అని మాత్రం వస్తోందని ప్రయణీకులు

ఆవేదన చెందుతున్నారు.  

ఇటీవల కాలం లో రైల్వే అధికారుల నిర్లక్ష్యానికి ప్రయాణీకులు నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా  à°­à±à°µà°¨à±‡à°¶à±à°µà°°à± ( తూర్పు కోస్తా రైల్వే

 à°œà±‹à°¨à± ) నుంచి బయలు రైళ్లల్లో కనీస సదుపాయాల మాట అలాఉంచితే. . .కనీసం బోగీలను కూడా శుభ్రం చెయ్యకుండానే పట్టాలెక్కించేస్తున్నారు. సుదూర ప్రాంతాలకు ప్రయాణించే

రైళ్లను కచ్చితంగా కండిషన్ లో ఉన్నాయో లేదో చూడాల్సిన భాద్యత భువనేశ్వర్ రైల్వే అధికారులదే. ఈ రైలు బోగి బోల్టు ఊడిపోయే విధంగా ఉంది అంటే వీళ్ళ నిర్వహణ ఏమాత్రం

భాద్యత గా ఉందొ తెలుస్తోంది. ప్రయాణీకుల అదృష్టం బాగుంది కనుక ప్రమాదం జరుగకుండా త్రుటి లో తప్పింది. ఇదే జరగరాని ప్రమాదం జరిగి ఉంటె భాద్యత ఎవరు వహించేవారు?

 à°®à±à°–్యంగా రైలు టికెట్లను ఇబ్బడి ముబ్బడి à°—à°¾ పెంచేసి భారీ ధరలు వసూలు చేసే రైల్వే అధికారులు అదే స్థాయిలో ప్రయాణీకులకు కనీస సౌకర్యాలు కల్పించాల్సి యుండగా

వాటిని మాత్రం తుంగలోకి తోక్కేస్తున్నారు. సగం దారిలో ఉండిపోయిన ప్రయాణీకులను పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడని రైల్లో ప్రయాణిస్తున్న  à°¶à°°à±à°®,

మల్లిఖార్జున దొర అనే ప్రయాణీకులు DNS కు తెలియచేసారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam