DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్వచ్ఛ సర్వేక్షన్ లో టాప్ ర్యాంకు కు కృషి చేస్తాం:  

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి): 

తిరుపతి , నవంబర్ 18, 2019 (డిఎన్‌ఎస్‌) :స్వచ్ఛ సర్వేక్షన్ 2020 లో రాష్ట్రంలోనే తిరుపతిని  à°®à±Šà°¦à°Ÿà°¿ స్థానం లో నిలుపుటకు తమ

వంతు బాధ్యత నిర్వహిస్తామని సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రతినిధులు తెలియచేస్తున్నారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం లో కమిషనర్ కార్యాలయంలో స్వచ్ఛ

సర్వేక్షన్ టీ చొక్కాలను కమిషనర్ గిరీష్ ఆవిష్కరించారు. స్వచ్ఛ సర్వేక్షన్ 2020 తిరుపతి మొదటి స్థానంలో నిలిపేందుకు నగరంలో ఉన్న ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలని

కమిషనర్ వారు తెలియజేశారు. à°•à°®à°¿à°·à°¨à°°à± మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షన్ 2020 తిరుపతి మొదటి స్థానంలో నిలుపుటకు ఈరోజు సిఎంఆర్ షాపింగ్ మాల్ 1500 à°Ÿà±€ షర్ట్ లు 20వేలు గుడ్డ సంచులు

ఇవ్వడం జరిగిందని వార్డు సెక్రటరీలు కు టీ షర్ట్ లు ఇవ్వడం జరుగుతుందని వాటిని వేసుకొని రేపట్నుంచి నగరంలో వార్డ్ సెక్రటరీలు ప్రతి ఇంటికి వెళ్లి స్వచ్ఛ

సర్వేక్షన్ పై అవగాహన నిర్వహిస్తారని మరియు ప్రతి ఇంటికి గుడ్డ సంచులు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. దీనిలో భాగంగా సిఎంఆర్ షాపింగ్ మాల్ అధిపతి రమణ, వాళ్ళ

సిబ్బందిని కమిషనర్ అభినందించారు. నగరంలో ఉన్న బ్యాంకులు, షాపింగ్ మాల్ స్వచ్ఛ సర్వేక్షన్ కి తమ వంతు సహకారం అందిస్తామని ముందుకు వస్తున్నారని అని వారికి కూడా

అభినందనలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ తో పాటు అదనపు కమిషనర్ హరిత, ఉప కమిషనర్ చంద్రమౌలేశ్వర రెడ్డి, సూపర్డెంట్ ఆఫ్ ఇంజనీర్ ఉదయ్ కుమార్, రెవెన్యూ

ఆఫీసర్ సేతు మాధవ్, à°¡à°¿ à°ˆ  à°µà°¿à°œà°¯à± కుమార్ రెడ్డి, సీఎంఆర్ షాపింగ్ మాల్ యజమాని రమణ మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు,

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam