DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇంపాక్ట్ లో శిక్షణకు ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కే ఎస్ ఇక రారా. . .

మార్గదర్శక శకానికి ముగింపు లేదు - కొనసాగింపే. .  

వేలాది మందికి మార్గదర్శుకులు- అందరికీ అంతరంగీకులు 

జ్ఞాన నేత్ర సంపన్నులు - ప్రపంచ ప్రఖ్యాత

వైద్యులు  à°°à°¤à±à°¨à°¾à°•à°°à±  

గల్లీ నుంచి ఢిల్లీ వరకూ అందరికి సుపరిచితులే. . .  

మానవేతరులకు మనోవికాసాన్ని నేర్పడానికి వెళ్లి ఉంటారేమో . . . .

గ్రామీణ

విద్యార్థులకు అండగా అనిల్ కుమార్ సోదరులు :. .

రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం ): . . .

విశాఖపట్నం, నవంబర్ 18, 2019 (డిఎన్‌ఎస్‌): గల్లీ నుంచి ఢిల్లీ వరకూ దాదాపుగా

అందరికీ సుపరిచితులైన అతి కొద్దీ మందిలో అగ్రగణ్యులు డాక్టర్ కే ఎస్ రత్నాకర్.  à°¡à°¾à°•à±à°Ÿà°°à± కె ఎస్ à°—à°¾ సుపరిచితులైన డాక్టర్ కామరాజు సుగుణ రత్నాకర్ ఆదివారం భువి

నుంచి దివికి ఎగిసారు అనే సమాచారం వేలాది మందిని కలిచివేస్తోంది. మానసిక తత్వవేత్తగా, జ్ఞాన విజ్ఞాన ప్రదాతగా వేలాది మందికి జీవన గమన శైలిని తెలియచేసిన

వ్యక్తిత్వ మనో వికాస నిపుణులు గా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వీరు ఆదివారం రాత్రి భువి నుంచి దివికి ఎగిసినట్టు తెలియడం అందరిని కలిచివేసింది. భారత దేశంలోని

అత్యంత ప్రఖ్యాతి గాంచిన ఆలిండియా వైద్య విజ్ఞాన  à°¶à°¾à°² ( ఏ ఐ ఐ à°Žà°‚ ఎస్ ) లో ప్రముఖ పాథాలజిస్ట్ à°—à°¾ వైద్య సేవలు అందించడమే కాక, విద్యార్థులను సైతం ఆధ్యాత్మిక

సంపన్నులుగాను, జ్ఞాన నేత్ర సంపన్నులుగాను తయారు చేసిన విద్యా సంపన్నులు. 
విధి నిర్వహణ భాద్యతలు పూర్తి అయినా తదుపరి, రామకృష్ణ మిషన్, వ్యక్తిత్వ వికాస

శిక్షకులు గంప నాగేశ్వర రావుల ఆధ్వర్యవంలో నిర్వహించబడుతున్న ఇంపాక్ట్ కార్యక్రమానికి మార్గదర్శకునిగా, సలహాదారుగా, సేవలు అందిస్తూనే. . .స్వయంగా అయన ఎన్నో

వందలాది ప్రసంగాలను విద్యార్థులను ఉద్దేశించి చేసారు. జరిగే కార్యక్రమంలో పాల్గొనే వారిలో సగానికి పైగా అభ్యర్థులు డాక్టర్ కె ఎస్ ప్రసంగం వినడానికే

వచ్చేవారు అంటే అతిశయోక్తి కాదు. ఈయన ప్రసంగాలను యు ట్యూబ్ లో సైతం అందుబాటు లో పెట్టడం ద్వారా లక్షలాది మందికి ఎంతో చేరువయ్యారు. ఈయన ప్రత్యక్షంగా వందలు, వేల

సంఖ్యలో శిష్యులు ఉంటె, పరోక్షంగా, సాంకేతిక మాధ్యమాల ద్వారా లక్షలాది మంది à°•à°¿ ఈయన ఆచార్యులయ్యారు. 

మానవేతరులకు నేర్పేందుకు : . .. 

ఎందరినో శిష్యులు,

ప్రశిష్యులను తయారు చేసిన కె ఎస్ భువి నుంచి దివికేగి మానవేతరులకు కూడా మనో వికాసాన్ని నేర్పేందుకు వెళ్లారేమో అనే అభిప్రాయాలను పలువురు శిష్యులు వ్యక్తం

చేస్తున్నారు. ఈయన చెప్పే 45 నిమిషాల ప్రసంగం లో ఆధ్యాత్మికత తో కూడిన ఉదాహరణలు, మహర్షులు, పెద్దలు, వేదం, ఉపనిషత్తులు మనకి అందించిన ఎంతో అమూల్యమైన విషయాలను

అందించడం లో ఈయనకు సాటి లేదు అనడం అతిశయోక్తి కాదు. చిత్త చంచల్యం, మనో కకాలం తో  à°µà°šà±à°šà°¿ ఈయన ప్రసంగం విన్న తదుపరి ఎంతో ఉన్నత భావాలతో ఇంటికి వెళ్లిన వారు

కోకోల్లలుగానే ఉంటారు. ఎందరో విద్యావంతులుగాను, పారిశ్రామికవేత్తలుగానూ తయారై, తదుపరి, తమ విజయ రహస్యాన్ని కారణం డాక్టర్ కే ఎస్ ప్రసంగం అని చెప్పారు అంటే

సామాన్యులను సైతం ఎంతగా ప్రభావితం చేసారో తెలుస్తోంది. 

గ్రామీణ విద్యార్థులకు. .  à°…à°‚à°¡à°—à°¾ .

ప్రధానంగా విద్యార్థులకు తరగతులు నిర్వహించే సమయంలో

గ్రామీణ ప్రాంతాల విద్యార్థులతో మమేకమై, వారిని ఉత్తేజిత పరుస్తూ, వారిలో ఉన్న భయాన్ని తొలగింపచేసి, ఉత్సాహంగా విజయాపదం లో నడిపించే తత్త్వం డాక్టర్ కే

ఎస్.

మద్యపానానికి వ్యతిరేకంగా ఎన్నో ప్రసంగాలు చేసి, అలవాటు ఉన్నవారిని కూడా ఆ అలవాటు మనిపించగలిగారు.

అనిల్ కుమార్ సోదరులు :. .. 

ఎంతో అనర్గళ

విద్యా సంపన్నులు à°—à°¾ పేరుగాంచిన డాక్టర్ కె ఎస్ సోదరులు సైతం విశ్వ విఖ్యాతి గాంచిన వారే.. .  à°…నంతపురం జిల్లా పుట్టపర్తి లో నెలకొన్న సత్యసాయి బాబా తెలుగు లో చేసే

ప్రసంగాలను ఆంగ్లంలో అక్కడి కక్కడే అనువదించే ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కామరాజు అనిల్ కుమార్ సోదరులు వీరు. ఎంతో వినయం, విజ్ఞానం సోదరులు ఇద్దరి à°•à°¿ సొంతం. 

/>  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam