DNS Media | Latest News, Breaking News And Update In Telugu

క్షేత్రంలో జరిగే పరిశోధన ఫలం ప్రజల్లోకి వెళ్ళాలి.

విద్యార్థి పరిజ్ఞానాన్ని రైతు అనుభవానికి జోడించాలి.  

సచివాలయాలకు దగ్గరలోనే స్టోర్ ల ఏర్పాటు: సభాపతి తమ్మినేని

అవగాహన పెంచుకొని వ్యవసాయం

చేయాలి : మంత్రి ధర్మాన 

వ్యవసాయ అధికార, విద్యార్థులతో పూర్తి స్థాయి  à°¸à°¦à°¸à±à°¸à± 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం). .

శ్రీకాకుళం,

నవంబర్ 19, 2019 (డిఎన్‌ఎస్‌):  à°µà±à°¯à°µà°¸à°¾à°¯ పరిశోధనా ఫలాలు క్షేత్ర స్ధాయికి చేరాలని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా రాగోలు

వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో కిసాన్ మేళా కార్యక్రమం మంగళ వారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం, రాష్ట్ర రహదారులు, భవనాల శాఖా

మంత్రి ధర్మాన క్రిష్ణ దాస్, జిల్లా కలెక్టర్ జె నివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రైతులను ఉద్దేశించి శాసన సభాపతి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ

వ్యవసాయ విజ్ఞానం గ్రామాలకు చేరాలన్నారు. పరిశోధన ఫలితాలు, సమాచారం రైతులకు అందాలని అప్పుడే వ్యవసాయం మరింత వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. సంప్రదాయ వ్యవసాయం

శ్రీకాకుళం రైతులు చేస్తున్నారని, జిల్లా రైతులు కష్టపడై తత్వం కలిగిన వారని అన్నారు. జిల్లాలో నాలుగు జీవ నదులు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకుని పంటల

దిగుబడిలో గణనీయమైన ప్రగతికి అవకాశం ఉందన్నారు. వంశధార ప్రాజెక్ట్ పూర్తి చేయుటకు ప్రభుత్వం నిధులు కేటాయించిందని శాసన సభాపతి చెప్పారు. వైయస్ఆర్ పొలం బడికి

సరైన రూపం ఇవ్వాలని కోరారు. 
వ్యవసాయ విద్యార్థులు తమ పరిజ్ఞానాన్ని గ్రామంలో గల రైతు అనుభవానికి జోడించాలని తద్వారా ఫలితాలు సాధించవచ్చని సూచించారు. వ్యవసాయ

విద్యార్ధులు క్షేత్ర స్థాయిలోకి వెళ్లి అక్కడ రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. ముందుగా పొలం బడి షెడ్యూల్ గ్రామాలకు ఇవ్వాలని అన్నారు. రైతులకు సరైన అవగాహన

కల్పిస్తే ప్రభుత్వ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోగలరని పేర్కొన్నారు. రైతులు నష్టపోకూడదని రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పరికరాలు అందాలనే

లక్ష్యంతో ప్రభుత్వమే సచివాలయాలకు సమీపంలో వ్యవసాయ స్టోర్ లను ఏర్పాటు చేయనుందని చెప్పారు. దళారీ వ్యవస్ధ ద్వారా రైతు నష్టపోతున్నారని, మోసపోతున్నారని

పేర్కొంటూ దళారీ వ్యవస్థ పోవాలని అన్నారు. పండించిన పంటలను నిల్వచేసుకునే వ్యవస్థ ఉండాలని చెప్పారు. వ్యవసాయంను ముఖ్యమంత్రి పండగ చేస్తున్నారని కొనియాడారు.

రైతులకు అవగాహన కలిగించుటకు శాస్త్రవేత్తలతో ముఖాముఖి ఏర్పాటు చేయాలని, ఆధునిక యాంత్రీకరణ పద్ధతులు పరిచయం చేయాలని అన్నారు. అత్యాదునిక పరిజ్ఞానాన్ని రైతులు

స్వాగతించి అందులో ఫలితాలు అనుభవించాలని కోరారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులపై రైతుకు నమ్మకం కలిగించాలని అప్పుడు రైతు వారిని వదలకుండా అనుసరిస్తాడని

అద్భుత ఫలితాలు వస్తాయని సీతారాం అన్నారు.

 à°°à°¾à°·à±à°Ÿà±à°° రహదారులు, భవనాల శాఖా మంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ మాట్లాడుతూ వ్యవసాయ జిల్లా మనది అన్నారు. అవగాహన

పెంచుకొని వ్యవసాయం చేయాలని, తద్వారా ఆర్ధికంగా ముందంజ వేయాలని అన్నారు. రైతుకు అండగా ముఖ్యమంత్రి. అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.

వ్యవసాయంలో మెలుకువలు పాటించి దిగుబడులు సాధించాలని సూచించారు. అదును పదును చూసి వ్యవసాయం చేయాలని అన్నారు. పరిశోధన ఫలితాలు పరిశీలించి ఆచరించాలని అప్పుడై

అనుకున్న ఫలితాలు వస్తాయని చెప్పారు. రాబోయే 5 సంవత్సరాలు వ్యవసాయానికి స్వర్ణయుగం అన్నారు. వ్యవసాయ అధికారులు రైతులకు పూర్తి సమాచారం అందించాలని సూచించారు.

రాష్ట్రంలో రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.4 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి ఏర్పాటు చేసారని మంత్రి చెప్పారు.

జిల్లా కలెక్టర్ జె నివాస్

మాట్లాడుతూ 1010 రకం నిషేధం చేసినపుడు రైతులు సహకరించారన్నారు. జిల్లాలో నాణ్యమైన బియ్యం ఉత్పత్తి చేయుటకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఖరీఫ్ లో 1075 రకం విత్తనాలు

సరఫరా చేసామని చెప్పారు. విత్తనాలను రైతులు ఉత్పత్తి చేయాలని పిలుపునిచ్చారు. విత్తనాలకు మంచి ధర వస్తుందని, జిల్లాలో కొరత ఉండదని అన్నారు. రైతుల అనుభవాలు

తీసుకొని పరిశోధనలు చేయాలని శాస్త్రవేత్తలకు సూచించారు. జిల్లాలో ప్రతి ఏటా వరదలు వస్తాయని  à°¦à°¾à°¨à°¿à°¨à°¿ పరిగణనలోకి తీసుకొని పరిశోధనలు జరుపుతూ వంగడాలు

సృష్టించాలని అన్నారు. రైతులు భూసార పరీక్షలు చేయించుకుని తదనుగుణంగా సూక్ష్మ పోషకాలు భూమికి అందించి సారాన్ని పెంచాలని అన్నారు. వ్యవసాయానికి మంచి రోజులు

వస్తున్నాయని పేర్కొన్నారు. గ్రామ సచివాలయాలలో వ్యవసాయ సహాయకులను ప్రభుత్వం నియమించిందని వారి సేవలు ఉపయోగించుకోవాలని కోరారు.

ఎన్ జి రంగా వ్యవసాయ

విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ à°¡à°¾.పి.రాంబాబు  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ రాష్ట్రంలో 13 కిసాన్ మేళాలు నిర్వహిస్తున్నామన్నారు. రైతులకు కొత్త వంగడాలు, పరిశోధనల

ఫలితాలు తెలిజేయడం కిసాన్ మేళా ఉద్దేశ్యం అని చెప్పారు.

ఎన్ జి à°°à°‚à°—à°¾ వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్  à°.ఎస్.రావు మాట్లాడుతూ రాష్ట్రంలో 33 వరి

పరిశోధన కేంద్రాలు ఉన్నాయన్నారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా వరి వంగడాలు సృష్టించబడతున్నాయని తెలిపారు. గిట్టుబాటు ధర రైతుకు దక్కుటకు యాంత్రీకరణపై

పరిశోధనలు చేస్తున్నామని చెప్పారు.

అనకాపల్లి ఆర్ఏఆర్ఎస్  à°…సోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ à°¡à°¾. జమున మాట్లాడుతూ భవిష్యత్తులో శ్రీకాకుళం రైస్ బౌల్

అవుతుందన్నారు. 2.10 లక్షల హెక్టార్లలో వరి పంట జిల్లాలో ఉందని చెప్పారు. నీటిలో మునిగే అవకాశం ఉన్న భూములు, మెట్టు, నీటి లభ్యత గల భూముల పరిస్థితికి అనుగుణంగా

విత్తనాలు ఎంపిక చేసుకోవాలని తద్వారా దిగుబడులకు సమస్య ఉండదని చెప్పారు.

వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త కె. వి. రమణ మూర్తి మాట్లాడుతూ 1966లో ఏ

ఆర్ సి స్థాపన జరిగిందన్నారు. కేంద్రం 10 రకాల మంచి విత్తనాలు అందిందని చెప్పారు. మరిన్ని మంచి రకాలు వస్తున్నాయని ఆయన చెప్పారు. సమీకృత వ్యవసాయ విధానాలను

అవలంభిస్తున్నామని పేర్కొన్నారు. కాండం తొలిచే పురుగు తదితరాలపై పరిశోధనలు చేస్తామని తెలిపారు.

వ్యవసాయ కళాశాల విద్యార్థులు వ్యవసాయంపై అవగాహన కలిగించు

నృత్య ప్రదర్శనలు నిర్వహించి అలరించారు. వ్యవసాయ రంగానికి అవసరమైన కరపత్రాలను ఆవిష్కరించారు. వివిధ వ్యవసాయ అనుబంధ శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శన శాలలను

పరిశీలించారు. కిసాన్ మేళాలో రైతులకు నిర్వహించిన క్విజ్ లో గెలుపొందిన రైతులకు బహుమతులు అందజేసారు.

ఈ కిసాన్ మేళాలో వ్యవసాయ మిషన్ సభ్యులు గొండు రఘురామ్,

నైరా అసోసియేట్ డీన్ ఏ వి రమణ, వ్యవసాయ శాఖ జెడి కె. శ్రీధర్, ఏ ఆర్ ఎస్ శాస్త్రవేత్తలు చిట్టిబాబు, చిన్నం నాయుడు, సురేష్,  à°—ొండు కృష్ణ మూర్తి, చిరంజీవి నాగ్ , చిట్టి

జనార్ధన రావు, రైతులు, సంబంధించిన శాఖల అధికారులు, కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ పరిశోధనా కేంద్రం, నైరా వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు, విద్యార్ధులు తదితరులు

పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam