DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నవశకంతో నవ్య నూతనంగా ఇంటి వద్దకే  ప్రభుత్వ సేవలు 

ఇంటింటి సర్వే తో అర్హులకు పూర్తి లబ్ది : కలెక్టర్ నివాస్ 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, నవంబర్ 20, 2019 (డిఎన్‌ఎస్‌):

జిల్లాలోని ప్రజల అవసరాలను గుర్తించి వారికి కావలసిన ప్రయోజనాలను ఇంటివద్దకు చేరవేసేందుకు వై.ఎస్.ఆర్.నవశకం అని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్

పేర్కొన్నారు. బుధవారం ఉదయం  à°µà±ˆ.ఎస్.ఆర్.నవశకం నియోజక వర్గ స్థాయి గ్రామసభ కార్యక్రమం గార మండలం గొంటి గ్రామ సచివాలయ భవనం వద్ద జరిగింది. ముందుగా  à°µà±ˆ.ఎస్.ఆర్ చిత్ర

పటానికి పూలమాలను వేసి జ్యోతి ప్రజ్వలన చేసిన కలెక్టర్ మాట్లాడుతూ నవశకంలో భాగంగా ఇంటింటి సర్వే ఉంటుందని చెప్పారు. దీనిపై ప్రజలు తమకు అందుతున్న సంక్షేమ

పథకాలు ఆగిపోతాయనే అపోహలువద్దని కలెక్టర్ స్పష్టం చేశారు. తమవద్ద ప్రజల వివరాలు అన్నీ ఉన్నాయని, ఈ సర్వే ద్వారా ప్రజలు మరిన్ని ప్రయోజనాలు పొందుతారే తప్ప

ఇప్పుడు పొందుతున్న పథకాలు ఏమీ నష్టపోరని చెప్పారు. ప్రతీ 50 గృహాలకు à°’à°• వాలంటీరును నియమించడం జరిగిందని, వారు మీ ఇంటివద్దకు వచ్చి సన్న బియ్యం, వైఎస్‌ఆర్‌

పెన్షన్‌ కానుక, ఆరోగ్యశ్రీ, జగనన్న విద్యా దీవెన, విద్యా వసతి కార్యక్రమాల్లో కార్డులను ప్రత్యేకంగా అందజేసేందుకు వాలంటీర్లు సర్వే చేస్తారన్నారు. అలాగే

వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా, కాపు నేస్తం, నేతన్న భరోసా, గీతన్న నేస్తం, అమ్మఒడి, వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకంలో అర్హుల పేర్లను వాలంటీర్లు అందజేస్తారని

కలెక్టర్ తెలిపారు. దర్జీలు, రజక, నాయీ బ్రాహ్మణులకు ఆర్థిక సహకారం అందజేసేలా బీసీ సంక్షేమ శాఖ ద్వారా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, అర్హులైన  à°µà°¾à°°à°‚దరూ

 à°¦à°°à°–ాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ స్పష్టం చేసారు. వచ్చే ఏడాది జనవరి నుండి అమ్మఒడి పథకం అమలు కానుందని à°ˆ పథకం క్రింద దరఖాస్తు చేసుకునే పిల్లల తల్లులకు విధిగా

ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతా కలిగిఉండాలని అన్నారు. వైఎస్‌ఆర్‌ కాపు నేస్తంలో 45 సంవత్సరాలు నిండి 60 ఏళ్లలోపుగల ఎస్‌హెచ్‌జీ మహిళలకు రూ.15 వేల ఆర్థిక సాయం అందజేయడం

జరుగుతుందని అన్నారు. మహిళలకు మంచి రోజులు రాబోతున్నాయని కలెక్టర్ తెలిపారు. జూనియర్ కళాశాల, కళాశాలల్లో చదివే విద్యార్ధులకు ఇకపై ఉపకార వేతనాలు అందకపోతే

దరఖాస్తు చేసి పొందవచ్చని చెప్పారు.  à°…లాగే టైలర్లు, రజకులు, నాయీ బ్రాహ్మణుల వృత్తితో జీవించే వారికి ఆర్థికంగా బలోపేతం చేసేందుకుగాను ప్రతి ఏటా రూ.10వేలు వంతున

ఆర్ధిక సహాయం అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. వైఎస్‌ఆర్‌ కాపునేస్తం ద్వారా కాపు, బలిజ, తెలగ కులస్తులకు ఏటా రూ.15వేలు వంతున లబ్ధిచేకూరేవిధంగా

చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇకపై ప్రజలు ఇతర కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదని, ఏ పనినైనా తమ గ్రామంలోని సచివాలయం నుండే పొందవచ్చని చెప్పారు. ప్రభుత్వ

పథకాల అర్హుల జాబితాలను ఆయా గ్రామసచివాలయాల్లో ప్రదర్శించడం జరుగుతుందని, దీనిపై అభ్యంతరాలు ఉంటే వాటిని తెలియజేయవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.  à°ªà±à°°à°­à±à°¤à±à°µ

పథకాలు ప్రజలకు సజావుగా చేరాలంటే వాలంటీర్ల పాత్ర కీలకమని, కావున వాలంటీర్లు పారదర్శకంగా పనిచేయాలని ఆదేశించారు. సర్వేలో ఏ ఒక్క  à°…ర్హత à°—à°² అభ్యర్థి

నష్టపోరాదని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు.
        శ్రీకాకుళం శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు సామాన్యులకు అనుకూలంగా à°ˆ ప్రభుత్వం

ఉంటుందని ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి నాడే ప్రకటించారని,అందులో భాగంగా నేడు నవశకం అమలుకాబోతుందని చెప్పారు. సన్నబియ్యం, పింఛను, ఆరోగ్యశ్రీ, రేషన్

వంటి పథకాల ద్వారా సామాన్యుల అవసరాలు తీరాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అర్హతల మేరకు పార్టీలకు అతీతంగా ఈ పథకాలను వర్తింపజేయడం జరుగుతుందని, గతంలో ఇలా

ఉండేదికాదని చెప్పారు. విశాలమైన ఆలోచన కలిగిన నాయకుని పద్దతి ఇదని స్పష్టం చేసారు. ప్రజాస్వామ్యంలో అర్హతగల ప్రతీ ఒక్కరికీ సంక్షేమఫలాలు అందాలని, ఆ దిశగా ఈ

ప్రభుత్వం పనిచేస్తుందని, దీన్ని ప్రజలు గుర్తించాలని అన్నారు. సంక్షేమ పథకాలు అందజేసే వాలంటీర్లు ముందుగా ప్రభుత్వ పథకాలపై అవగాహన కలిగిఉండాలని సూచించారు.

అవసరమైతే అధికారుల సలహాలు, సూచనలు పొంది ప్రభుత్వం చేస్తున్న ఈ మంచి ప్రయత్నానికి సహకరించాలని కోరారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజలు ఆరోగ్యాన్ని

ప్రభుత్వమే సంరక్షిస్తుందని, ఆరోగ్యం కోసం ఎంతైనా ఖర్చుచేస్తుందన్నారు. అయితే మనదేశంలో అటువంటి పరిస్థితి ఇంకారాలేదని,అయితే మన రాష్ట్రంలో

వై.యస్.ఆర్.

ఆరోగ్యశ్రీ అందరికీ వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం హర్షదాయకమన్నారు. చిన్న అనారోగ్యం వస్తే 30 వేల వరకు ఖర్చు చేసే సంప్రదాయానికి ఇకపై

స్వస్తి పలకాలన్నారు. కాపు నేస్తం కింద రూ.15 వేలు, టైలర్లు, రజకులు, నాయీ బ్రాహ్మణుల కొరకు రూ.10వేలు, అమ్మఒడి కింద రూ.15వేలు, నేతన్ననేస్తం, ఇమూముల నేస్తం, మత్య్సకార

నేస్తం వంటి  à°‡à°²à°¾ ఎన్నో పథకాల ద్వారా ఆర్ధిక సహాయం అందించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఏ ఒక్క వర్గానికి విడిచిపెట్టకుండా అన్ని

వర్గాల వారికి ఆర్ధిక సహాయం అందించే  à°¦à°¿à°¶à°—à°¾ ముఖ్యమంత్రి చేస్తున్న à°ˆ ప్రయత్నానికి చేయూతనివ్వాలని, అభినందించాలని శాసనసభ్యులు కోరారు. తొలుత

వై.యస్.ఆర్.చిత్రపటానికి పూలమాలను వేసి జ్యోతి ప్రజ్వలన చేసారు.

        à°ˆ కార్యక్రమంలో గార, శ్రీకాకుళం తహశీల్ధారులు జె.రామారావు, ఐ.à°Ÿà°¿.కుమార్, మండల పరిషత్

అభివృద్ధి అధికారి జి.రాజేశ్వరరావు, గొండు రఘురాం,డి.సి.యం.యస్ మాజీ ఛైర్మన్ గొండు కృష్ణమూర్తి, జిల్లా ప్రజాపరిషత్ మాజీ వైస్ ఛైర్మన్లు ఎచ్చెర్ల సూరిబాబు మార్పు

ధర్మారావు, ముంజేటి కృష్ణమూర్తి, పీస శ్రీహరి, చిట్టి జనార్ధనరావు, బరాటం రామశేషు, మాజీ సర్పంచులు అప్పలనరసయ్య, ధర్మారావు, ఇతర అధికారులు, రైతులు, ప్రజలు, తదితరులు

పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam