DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నూతన హార్బర్ పోలీస్ స్టేషన్ భవనానికి శంకుస్ధాపన

విశాఖపట్నం, జూన్ 14 2018 (DNS Online ) : విశాఖ నగరం లోని రామకృష్ణ జంక్షన్ రైతు బజారు వద్ద నూతనంగా నిర్మిస్తున్న హార్బర్ పోలీస్ స్టేషన్ భవన సముదాయానికి విశాఖపట్నం పోర్టు

ట్రస్ట్ చైర్మన్ à°Žà°‚. à°Ÿà°¿  à°•à±ƒà°·à±à°£à°¬à°¾à°¬à± గురువారం శంకు స్ధాపన చేశారు. దీని కోసం పోర్టు 1000 చదరపు మీటర్ల భూమిని కేటాయించింది. పోర్టు లోపల స్టాకింగ్ యార్డ్

పునర్నిర్మాణంలో భాగంగా హార్బర్ పోలీస్ స్టేషన్ ను సైతం తొలగించారు. విశాఖ నగర పోలీసు కమీషనర్ విజ్ఞప్తి మేరకు పోర్టు యాజమాన్యం రామకృష్ణ జంక్షన్ వద్ద

రైతుబజార్ సమీపంలో అందరికి అందుబాటులో ఉండేలా హార్బర్ పోలీస్ స్టేషన్ కు స్ధలం కేటాయించారు. ఈ సందర్భంగా విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ చైర్మన్ ఎం. టి కృష్ణబాబు

మాట్లాడుతూ హార్బర్ పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం 1 కోటి 16 లక్షల రూపాయలు వెచ్చిస్తున్నట్లు వెల్లడించారు. అన్ని సదుపాయాలతో మోడల్ స్టేషన్ గా నిర్మించనున్నట్లు

తెలిపారు. రామకృష్ణ జంక్షన్ ఐతే అందరికి అందుబాటులో ఉంటుందని ఇక్కడ స్ధలాన్ని ఎంపిక చేసినట్లు కృష్ణబాబు వెల్లడించారు. ఏడాది కాలంలో స్టేషన్ నిర్మాణ పనులు

పూర్తి చేస్తామని తెలిపారు. à°ˆ కార్యక్రమంలో జేసీ 2 రవికుమార్ మూర్తి, ఎసిపి రంగరాజు తో పాటు పోర్టు విభాగాధిపతులు, ఉద్యోగులు పాల్గొన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam