DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ వేదికగా 46 ఏళ్ళ "కన్నెవయసు"  చిత్ర  వేడుకలు 

పోస్టర్ ఆవిష్కరించిన విఎంఆర్ à°¡à°¿ ఏ చైర్మన్ ద్రోణంరాజు 

ఇదే వేదికపై సత్యశ్రీ పునర్జన్మ వేడుకలు  

అండగా నిలిచిన వారికి ఆత్మీయ సత్కారం :. . ..

(DNS

రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, నవంబర్ 25, 2019 (డిఎన్‌ఎస్‌):  à°…లనాటి మేటి చిత్రం కన్నెవయసు 46 వసంతాల మహోత్సవ వేడుకల పోస్టర్ ను విశాఖపట్నం మెట్రో

ప్రాంత అభివృద్ధి సంస్థ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో చారిత్రక విశేషాలకు ఆలవాలంగా నిలిచిన

సినీపరిశ్రమ అందించిన మరో ఆణిముత్యం కన్నె వయసు చిత్రం అన్నారు. ఆ చిత్రం లో పనిచేసి, నాటి బృంద సభ్యులను సత్కరించుకోవడం ద్వారా తనకు అండగా నిలిచిన సినీ

పరిశ్రమకు కృతజ్ఞత తీర్చుకుంటున్న సత్యశ్రీ ( నేటి చిత్ర దర్శకుడు) అభినందనీయులున్నారు.  à°ªà±‹à°¸à±à°Ÿà°°à± విడుదల కార్యక్రమంలో దర్శక - రచయిత  à°¤à°¨à°¿à°•à±†à°³à±à°³ సత్యశ్రీ, ఐవీ

సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. 

à°…à°‚à°¡à°—à°¾ నిలిచిన వారికి ఆత్మీయ సత్కారం :. . . . 

ఈ కార్యకమం లో నాటి చిత్ర కధానాయిక రోజా రమణి, చిత్ర దర్శకుడు ఓ ఎస్ ఆర్

అంజనేయులను సత్కరించనున్నారు. ఈ కార్యకమం ఈ నెల 28 న విశాఖపట్నం లోని మద్దిలపాలెం కూడలి వద్ద గల కళాభారతి ఆడిటోరియంలో సాయంత్రం ఆరు గంటలకు నిర్వహించనున్నారు. ఈ

సందర్బంగా కార్యక్రమం నిర్వాహకులు తనికెళ్ళ సత్యశ్రీ మాట్లాడుతూ తనకు చిత్ర పరిశ్రమలో సహాయ దర్శకునిగా, రచయిత గా అవకాశం కల్పించి, సినీ ప్రస్థానం లో కీలక భూమిక

వహించిన పెద్దలు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకునే కార్యక్రమం చేపట్టినట్టు తెలియచేసారు. 23 ఏళ్ళ క్రితం తన జీవితంలో జరిగిన ఓ ఘటన కారణంగా తన రెండు చేతులు, ఒక కాలు

కోల్పోవడం జరిగిందని, అయినప్పటికీ ఎందరో మహానుభావులు అండగా నిలబడి తనకు పునర్జీవితాన్ని ఇచ్చిన రోజు నవంబర్ 28 అని, దాన్ని పురస్కరించుకుని తనకు జీవితాన్ని

ఇచ్చిన సినీ ప్రముఖులను సత్కరించుకున్నట్టు తెలియచేసారు. à°ˆ కార్యక్రమం లో నగరవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని, ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నారు. 

à°ˆ

కార్యక్రమానికి అతిథులుగా వీఎంఆర్‌ఏ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాసరావు, వైఎస్సార్‌ సీపీ ఉత్తర సమన్వయకర్త కేకే రాజు, కేజీహెచ్‌ సూపరిటిండెంట్‌ డాక్టర్‌

అర్జున్‌ హాజరు కానున్నారు. à°ˆ సందర్భంగా జాతీయ పాత్రికేయ సంఘం కార్యదర్శి, వీజేఎఫ్‌ అధ్యక్షులు  à°—ంట్ల శ్రీనుబాబు, మల్లారెడ్డి ఆసుపత్రి (హైద్రాబాద్) నిర్వహణ

అధికారి జి. ప్రభాకర్ రెడ్డి, అరబిందో ఫార్మాస్యూటికల్ ప్రతినిధి జి. సాయి బాబు, హోటల్ కారంత్స్ అధినేతలు, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ప్రబోధ్

కుమార్, సిద్ధాంతి పిఠాపురం 10 à°µ శక్తిపీఠం వంశపారంపర్య అర్చకులు కోట వీర వెంకట సత్యనారాయణ మూర్తి, ఆంధ్రభూమి వెన్నెల కాలమిస్ట్‌ సరయూ శేఖర్‌, సూర్య దినపత్రిక

రీజనల్‌ మేనేజర్‌ కె. రాజారావులకు ఆత్మీయ సత్కారం చేయనున్నారు. సినీ నేపథ్య గాయకులు, మాధవపెద్ది (ఫేం) చింతలపాటి సురేష్‌ ఆధ్వర్యంలో సంగీత విభావరి జరుగనుంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam