DNS Media | Latest News, Breaking News And Update In Telugu

27న విఎంఆర్డిఏ కార్యాచరణ పై సమగ్ర సమావేశం

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, నవంబర్ 25, 2019 (డిఎన్‌ఎస్‌): శ్రీకాకుళం జిల్లా నుంచి తూర్పు గోదావరి జిల్లావరకూ విస్తరించిన

విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటి (వి.à°Žà°‚.ఆర్.à°¡à°¿.ఏ – విశాపట్నం మెట్రోపాలిటన్ ప్రాంతీయ పట్టణ అభివృద్ధి సంస్ధ) అభివృద్ధి ప్రణాళికపై à°ˆ

నెల 27వ తేదీన సమావేశం నిర్వహిస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ సోమ వారం ఒక ప్రకటనలో తెలిపారు. 2051 సంవత్సరం నాటికి అభివృద్ధి ప్రణాళికపై

వి.ఎం.ఆర్.డి.ఏ చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా లియా అసోసియేట్స్ సౌత్ ఏసియా ప్రైవేట్ లిమిటెడ్ ను కన్సల్టెంట్ గా వి.ఎం.ఆర్.డి.ఏ నియమించడం జరిగిందని

చెప్పారు. ఈ వ్యూహాత్మక ప్రణాళికలో వి.ఎం.ఆర్.డి.ఏ ప్రాంత వృద్ధికి వ్యూహాలు, ఆర్ధిక వృద్ధి వ్యూహాలు, జనాభా, వనరుల పరిరక్షణ, కోస్టల్ జోన్ రెగ్యులేషన్లు, విపత్తుల

నిర్వహణ తదితర వ్యూహాలతో ప్రణాళికలను రూపొందిస్తుందని చెప్పారు. వి.ఎం.ఆర్.డి.ఏ ప్రాంతంలో విశాఖపట్నం, విజయనగరం జిల్లాలతోపాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన 11

మండలాలు ఉందన్నారు. దీనిపై సంబంధిత శాఖలు,ప్రజాప్రతినిధులతో 27వ తేదీన సమావేశాన్ని వి.ఎం.ఆర్.డి.ఏ నిర్వహిస్తుందని చెప్పారు. ఉదయం వివిధ శాఖల అధికారులతోను,

మధ్యాహ్నం ప్రజాప్రతినిధులతోను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని తగిన

సమాచారాన్ని, సలహాలు, సూచనలు అందించాలని ఆయన కోరారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam