DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహిళా ఉద్యోగినులపై ‘పశువు’లా ప్రవర్తిస్తున్న అధికారి…!

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, నవంబర్ 27, 2019 (డిఎన్‌ఎస్‌) : ఆయన à°’à°• జిల్లా స్థాయి అధికారి. ఆయన మరో శాఖ నుండి గుంటూరు జిల్లాకు డిప్యూటేషన్‌పై

ఇటీవలే మరో శాఖకు వచ్చారు. అంతకు ముందు మామూలు పదవిలో ఉండేవారట. చంద్రబాబు ప్రభుత్వంలో కుక్కిన పేనులా ఉన్న à°† అధికారి జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తన

సామాజికవర్గ ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చి నిబందనలకు విర్దుదంగా పెద్దస్థాయి అధికారిగా నియమింపడ్డారు. ఇంకేముంది అధికార దర్పం ప్రదర్శించటం ప్రారంభించారు.
/> తన కార్యాలయంలో వివిధ హోదాలో పనిచేస్తున్న కింది స్థాయి అధికారులను, అవుట్‌సోర్సింగ్‌, మహిళా ఉద్యోగులపై పెత్తనం చేయటం ప్రారంభించారు. చెప్పిన మాట వినకుంటే

శంకరగిరి మాన్యాలు పట్టిస్తానని అంటున్నారట. మహిళా ఉద్యోగుల వ్యక్తిగత వివరాలను పదే పదే అడిగి తెలుసుకుంటున్నారట. వారితో ద్వంద అర్దాలతో మాట్లాడుతున్నారట.

నేను తలుచుకుంటే మీ అందరినీ ఇక్కడి నుండి బదిలీ చేస్తానంటూ పరోక్షంగా బెదిరిస్తున్నారట. ఆయన సామాజికవర్గ ఎమ్మెల్యేల ఇద్దరి ఆశీస్సులతో ఈ అధికారికి అహంభావం

వచ్చిందంటున్నారు.

నిబందనలకు విరుద్దంగా నియమింపడిన ఈ అధికారికి అన్ని అవలక్షణాలు ఉన్నాయని అనుకుంటున్నారు. గతంలో తాను పెద్ద హోదాలో పని చేసానని

పలువురికి చెప్పుకుంటున్నారట. నిన్నమొన్నటి వరకు ఆయన చేసింది కింది స్థాయి ఉద్యోగం, పై స్థాయి అధికారులకు వంగి వంగి దండాలు పెట్టేవారట. ఒక్కసారిగా ఊహించని

అధికారం రావటంతో తనలో ఉన్న అపరిచితుడుని బయటపెడుతున్నారట. ఈ అధికారి వ్యవహార శైలిపై ఆరా తీయగా ముఖ్యంగా మహిళా ఉద్యోగులను పరోక్షంగా బెదిరిస్తూ తనకు అనుకూలంగా

మలుచుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించటంతో కొంతమంది మహిళా ఉద్యోగులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు à°°à°‚à°—à°‚ సిద్దం చేసుకున్నారట. à°ˆ నోటా ఆనోటా విషయం బయటకు

పొక్కటంతో సదరు ఆ అధికారి తన ప్రవర్తనను తాత్కాలికంగా మార్చుకున్నప్పటికీ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులందరిపై నిఘా పెట్టారట.
ఆ అధికారి ఇంతకు ముందు ఏ శాఖలో

పని చేశారో అక్కడ పని చేసేఉద్యోగులందరికీ తెలుసు.ఈ అధికారి రాక ముందు చాలా మంది అధికారులు వివిధ శాఖల నుండి వచ్చి బాధ్యతలు నిర్వహించి వెళ్లారు. వారిలో ఏ ఒక్కరూ

à°ˆ అధికారిలా ‘పశువు’లా ప్రవర్తించలేదంటున్నారు అక్కడ పని చేసే ఉద్యోగులు. à°ˆ అధికారి అధికార రంగులు మార్చి ఉద్యోగులను ఇబ్బంది పెట్టడంలో అపార అనుభవం ఉన్నదని

ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం విచారణ జరిపిస్తే ఈ అధికారి రాసలీలలు, వ్యహారశైలి, పనితీరుతో పాటు ఇంకా వెలికి రాని విషయాలు కూడా బయటకు రావటం

ఖాయమంటున్నారు.ఆ అధికారిని సొంత శాఖకు పంపించాలని ఆయన వైఖరితో ఇబ్బంది పడుతున్న ఉద్యోగులు కోరుకుంటున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam