DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చంద్రబాబు అమరావతి పర్యటన లో హైటెన్షన్

కాన్వాయ్‌పై రాళ్లు, చెప్పులు.. బస్సు పై రాళ్ళ దాడి 

ఒకవైపు ఘన స్వాగతం -  à°®à°°à±‹ వైపు నిరసనలు 

 

అమరావతికి చంద్రబాబు సాష్టాంగ ప్రణామం: . . .

 

DNS

రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, నవంబర్ 28, 2019 (డిఎన్‌ఎస్‌) : టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంతంలో గురువారం

చేస్తున్న పర్యటన కాస్త ఉద్రిక్తతల మధ్య సాగుతోంది. ఒక వర్గం ఘనస్వాగతం పలకగా, మరో వర్గం నుంచి తిరస్కరణ, చెప్పుల దాడి, రాళ్ళ దాడులు ఎదురయ్యాయి. ఉండవల్లిలోని తన

నివాసం నుంచి బస్సులు, కార్లలో టీడీపీ నేతలు చంద్రబాబు వెంట బయలుదేరారు. మార్గమధ్యంలో ఆయన కాన్వాయ్‌పై ఆందోళనకారులు రాళ్లు, చెప్పులు విసిరారు. చంద్రబాబు గో

బ్యాక్ అంటూ వారు నినాదాలు చేశారు. గ్రామ ట్యాంకణం ఎందుకు పూర్తి చెయ్యలేదు అని ఒక వర్గం రైతులు, వైసీపీ వర్గీయులుగా చెప్పబడుతున్న వారు ప్రశ్నించారు. ముందుగా

రైతులకు చంద్రబాబు క్షమాపణ చెప్పిన తర్వాతే పర్యటన మొదలు పెట్టాలని నినాదాలు చేసారు. కృష్ణానది నుంచి రాయపూడి వరకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన రైతులు అందులో

చంద్రబాబుకు ప్రశ్నలు సంధించారు. రాజధాని పేరిట రైతులను మోసం చేసిన చంద్రబాబు మళ్లీ అమరావతికి ఎలా వస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. బాబు కు అనుకూలంగా నినాదాలు

చేస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పోలీసులు అడ్డు కోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. 

అమరావతికి చంద్రబాబు సాష్టాంగ ప్రణామం: . . .

గతం

లో రాజధాని à°•à°¿ నాటి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో  à°šà°‚ద్రబాబు స్పష్ఠంగా ప్రణామం చేసారు. à°ˆ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ à°ˆ ప్రాంతం

గ్రామదేవతల ఆశీసులతో శక్తిమంత మైనదని, గంగా, యమున, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణ . . తదితర 33 నదుల నుంచి పుణ్యజలాలు తీసుకు వచ్చి అశీసులు అందించడం జరిగిందన్నారు.

మహనీయులు జన్మించిన ప్రాంతాల నుంచి తీసుకు వచ్చిన మట్టిని ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగిందన్నారు. సుమారు 13000 గ్రామాలు, 3000 వార్డుల మన మట్టి - మన నీరు తో శక్తి సమన్వితమైన

మన రాజధాని అమరావతి అజరామరం కావాలన్నదే మనందరి సంకల్పం కావాలని పిలుపునిచ్చారు. 

గత ఆరు నెలలుగా ఆపేసిన అన్ని పనులు వెంటనే పూర్తి చేయాలని, రైతులకు, రైతు

కూలీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేసారు. రాజధానిపై ఐదు కోట్ల ఆంధ్రుల భావోద్వేగాలు వైసీపీ నేతలకు తెలుసన్నారు. పథకం ప్రకారం దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఆ

కుట్రలను బయటపెట్టేందుకే అమరావతికి వెళ్తున్నానని చంద్రబాబు తెలిపారు. 

చంద్రబాబు వెంట ఎమ్మెల్యే కె.  à°…చ్చింనాయుడు, వాసుపల్లి గణేష్ కుమార్, కె. కళా

వెంకట రావు , ఇతర తెలుగు దేశం నేతలు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam