DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నేటి నుండి కార్తీక కళామహోత్సవం : కలెక్టర్ నివాస్ 

సంప్రదాయ కళలను ఆదరించండి : స్వాతి సోమ్ నాధ్   , 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, నవంబర్ 29, 2019 (డిఎన్‌ఎస్‌): సంప్రదాయం

గురుకులంలో శని, ఆది వారాలు రెండు రోజులపాటు కార్తీక కళా మహోత్సవం -2019 నిర్వహిస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. కార్తీక కళా మహోత్సవం

నిర్వహణపై శుక్ర వారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నవంబరు 30, డిశంబరు 1 తేదీలలో రెండు

రోజులపాటు కళామహోత్సవం ఉంటుందని పేరగాంచిన కళాకారులు పాల్గొని ప్రదర్శనలు ఇస్తున్నారని చెప్పారు. ప్రతి ఏటా బాపూజీ కళామందిర్ లో కార్తీక కళామహోత్సవాన్ని

సంప్రదాయం సంస్ధ నిర్వహిస్తున్న సంగతి అందరికి విదితమేనని, అయితే శ్రీకాకుళం పట్టణానికి కూతవేటు దూరంలో గల కళ్లేపల్లి గ్రామంలో నిర్మించిన సంప్రదాయంలో

తరగతులు ప్రారంభం కావడం సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో కళామహోత్సవాన్ని అచ్చటనే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా కళలకు కాణాచి అని ఎందరో

మహోన్నత వ్యక్తులు జిల్లాకు పేరు తీసుకు వచ్చారని చెప్పారు. జిల్లా కళలు, సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుటకు కళలలో జిల్లాను ఉన్నత శిఖరాలకు

తీసుకువెళ్ళుటకు సంప్రదాయం సంస్ధను నెలకొల్పడం జరిగిందన్నారు. సంప్రదాయం గురుకులంలో ఇప్పటికే 70 మంది విద్యార్ధులు కూచిపూడి, వయోలిన్, ఓకల్ అంశాలను

అభ్యసిస్తున్నారని చెప్పారు. విద్యార్ధుల చదువులకు ఆటంకం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పారు.
          కళామహోత్సవాలను రాష్ట్ర శాసన సభాపతి

తమ్మినేని సీతారాం ప్రారంభిస్తారని చెప్పారు. శని వారం హైదరాబాదుకు చెందిన ప్రఖ్యాత నృత్యకారులు డా.పసుమర్తి శేషుబాబు బృందం, సింధుజా రావు బృందంతో క్లాసికల్

ఫ్యూజన్ డాన్స్ ఉంటాయని చెప్పారు. వీటితోపాటు లక్ష్మీగణపతి శర్మ, కె.శివకుమార్ ఆద్వర్యంలో శాస్త్రీయ కూచిపూడి నృత్యాలు ఉంటాయని చెప్పారు. సాయంత్రం 5 గంటలకు

నాదస్వరం కార్యక్రమంతో ప్రారంభం అవుతుందని అన్నారు. సంప్రదాయం విద్యార్ధులు సంగీత నృత్య ప్రదర్శన, రెడ్డి సత్యనారాయణ, పార్వతీశం, రాథల నాట్యం ఉంటుందని చెప్పారు.

ఉదయం 9 గంటల నుండి డా.పసుమర్తి శేషుబాబు భామా కలాపంలో నృత్య శిక్షణ ఇవ్వనున్నారని తెలిపారు.
      డిశంబరు 1à°µ తేదీ ఉదయం 9 à°—à°‚à°Ÿà°² నుండి మరల భామా కలాపం శిక్షణ

కొనసాగుతుందని చెప్పారు. సాయంత్రం 5 గంటలకు మంగళ వాయిద్యం, 6 గంటలకు సంప్రదాయం విద్యార్ధులు సంగీత నృత్య ప్రదర్శన, 6.30 గంటలకు సురాపు లక్ష్మీగణపతి శర్మ బృందం

శాస్త్రీయ, సినీ, సంగీత విభావరి., 7.15 గంటలకు కాయల శివకుమార్ బృందం శాస్త్రీయ నృత్య ప్రదర్శన ఉంటుందని చెప్పారు.
    సంప్రదాయానికి ఎస్.వి.విశ్వవిద్యాలయం గుర్తింపు :

సంప్రదాయం గురుకులంలో నిర్వహించే కూచిపూడి, వయోలిన్, ఓకల్ కోర్సులకు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం అనుబంధ (ఎఫిలియోషన్) సంగీత పాఠశాలగా గుర్తింపును

ఇచ్చిందని చెప్పారు. విశ్వవిద్యాలయ అధికారులు శుక్ర వారం సంప్రదాయం గురుకులం ను తనిఖీ చేసారని చెప్పారు.
          à°ˆ మీడియా ప్రతినిధుల సమావేశంలో సంప్రదాయం

సంచాలకులు స్వాతి సోమనాథ్ పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam