DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విజయవాడ వేదికగా ఆర్ఎస్ఎస్  సేవా సంగమం    

డిసెంబర్ 7 నుంచి రెండు రోజుల సదస్సు  

(DNS రిపోర్ట్ : BVS సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, నవంబర్ 30, 2019 (డిఎన్‌ఎస్‌): సేవా భారతి స్వచ్చంద

సంస్థ నిర్వహించే సేవ సంగమం సదస్సులు డిసెంబర్ 7 నుంచి రెండు రోజుల పాటు విజయవాడ వేదికగా జరుగనున్నట్టు ఆర్ ఎస్ ఎస్ విశాఖ పట్నం విభాగ్ సంఘ సంచలక్ అధ్యక్షులు

డాక్టర్ ఎం. విజయ్ గోపాల్ తెలిపారు. శనివారం నగరం లోని బివికె కళాశాల ప్రాంగణం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా గ్రామా స్థాయి

నుంచి దేశ రాజధాని వరకు   వివిధ ప్రాంతాల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ( ఆర్ ఎస్ ఎస్)  à°•à°¾à°°à±à°¯à°•à°°à±à°¤à°²à± వివిధ విభాగాల్లో అందిస్తున్న సేవలను మరింత విస్తృతం చెయ్యాలనే

సంకల్పనతో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి అఖిల భారత స్థాయిలోనూ, ప్రాంతీయ స్థాయిలోనూ సదస్సు నిర్వహించడం జరుగుతుందన్నారు. సమాజం లోని పీడిత, శోషిత, వాంఛిత, బడుగు

బలహీన వర్గాల వారికీ ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారికి తోడుగా ఉంది, వారికి కనీస ఆరోగ్యం కోసం కృషి చేస్తూ వారిలో స్వావలంబన సాధించడానికి ఆర్ ఎస్ ఎస్

చేసే సేవా విభాగమే సేవా భారత్ అని తెలిపారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధులుగా పాల్గొనేందుకు రాష్ట్రంలోని అత్యంత ప్రముఖులు హాజరవుతున్నారు. దీని ద్వారా, మాతృ

సంస్థల ద్వారా ఏంటో కృషి చేస్తోందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో సేవా భారతి ద్వారా 1300 సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. 200 పడకల ఆసుపత్రి నుంచి మారుమూల గ్రామాలకు

కూడా నడిచి వెళ్లి వైద్యం చేసే ఆరోగ్య మిత్ర కార్యకర్తల వరకూ వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. అనాధ బాలుగా వసతి గృహాలు, కుష్ఠు రోగ నివారణ ఆరోగ్య కేంద్రాలు,

కంప్యూటర్, కుట్టు శిక్షణా కెంరాలు, భజన మండలులు, యోగ కేంద్రాలు నిర్వహించబడుతున్నాయన్నారు. 

మనతో పాటు అనేక మంది వ్యక్తులు, సంస్థలు ఇదే దిశలో కలిసి

పనిచేస్తున్నాయన్నారు. వారి ద్వారా పేదప్రజలు ఎంతో లబ్ది పొందుతున్నారని తెలిపారు. వారందరినీ ఒక వేదిక పై కలుసుకునే ఏర్పాటు చేసి, వారి అనుభవాలను పంచుకుని, ఆయా

రంగాల్లో నిష్ణాతులైన ప్రముఖులతో సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వారందరినీ సమావేశ పరిచే కార్యక్రమమే సేవ సంగమం అన్నారు. ఈ సదస్సులో స్టాల్స్, చిత్ర

ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయన్నారు. త్వరితగతిన సమగ్ర వికాసానికి, సామజిక చైతన్యానికి అందరూ కలిసి పనిచేసి ముందుకు నడవడానికి ఈ కార్యక్రమం

దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమం లో పాల్గొనేందుకు ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్ర కార్యదర్శి జి. సుబ్రహ్మణ్యం, సేవ భారతి విశాఖ అధ్యక్షులు మురళి మహేశ్వర రాజు, ఆర్ ఎస్ ఎస్ విశాఖ పట్నం విభాగ్ సంఘ సంచలక్ కార్యదర్శి డాక్టర్ తిరుపతి రావు

తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam