DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆరు నెలల్లోనే జగన్ ది  ప్రజా రంజక పాలన  

ఐదేళ్లలో చంద్రబాబుది ప్రజాకంటక పాలన

మంచి పేరు వస్తోందనే అక్కసుతోనే విమర్శలు

పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తాం

ఎమ్మెల్యే అనంత

వెంకట రామిరెడ్డి స్పష్టీకరణ

(DNS రిపోర్ట్ : మనోహర్ , స్టాఫ్ రిపోర్టర్, అనంతపూర్): . . . .

అనంతపూర్, నవంబర్ 30, 2019 (డిఎన్‌ఎస్‌) : ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన

రోజు చెప్పినట్టుగానే ఆరు నెలల్లోనే మంచి సీఎంగా వైఎస్‌ జగన్‌ పేరు తెచ్చుకున్నారని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి అన్నారు. à°—à°¡à°¿à°šà°¿à°¨ ఐదేళ్లలో

చంద్రబాబు ప్రజాకంటక పాలన చేస్తే.. తాము ప్రజారంజక పాలన సాగిస్తున్నట్లు చెప్పారు. శనివారం అనంతపురంలోని 50à°µ డివిజన్‌లో వార్డు సచివాలయాన్ని ఎమ్మెల్యే

ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ముంగిటకు పరిపాలన తెచ్చేందుకే సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చినట్లు చెప్పారు. గతంలో ఏ పని కావాలన్నా తహశీల్దార్,

మునిసిపల్‌ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇకపై సచివాలయాల్లోనే అన్ని రకాలు సేవలు అందించనున్నట్లు చెప్పారు. నగర పరిధిలో 72 సచివాలయాలు ఏర్పాటు

చేస్తున్నామని, అన్ని కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. సచివాలయ ఉద్యోగులు, వార్డు వాలంటీర్లు సమన్వయంతో పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు

తీసుకురావాలని కోరారు. ఎట్టి పరిస్థితిల్లోనూ అర్హులకు అన్యాయం జరగకూడదని స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆరు నెలల్లో అనేక

సంక్షేమ పథకాలు తెచ్చామన్నారు. ఇప్పటికే పింఛన్‌ను రూ.2250కు పెంచామని, 65 ఏళ్ల పింఛన్‌ వయసును 60 ఏళ్లకు తగ్గించినట్లు చెప్పారు. ప్రస్తుతం ‘వైఎస్‌ఆర్‌ నవశకం’ సర్వే

జరుగుతోందని, అర్హులంతా తమ వివరాలను వార్డు వాలంటీర్లకు తెలియజేయాలన్నారు. డిసెంబర్‌లో ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రత్యేక కార్డులు అందజేయనున్నట్లు

చెప్పారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఎలాంటి సంక్షేమ పథకాలు అందాయో అంతకుమించి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే

టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు అసూయతో విమర్శలు చేస్తుండడం సిగ్గుచేటన్నారు. ఐదేళ్ల పాటు అన్ని రకాలుగా చంద్రబాబు విఫలం కావడంతోనే ప్రజలు

తిరస్కరించారన్న విషయాన్ని ఆ పార్టీ నేతలు తెలుసుకోవాలని హితవు పలికారు. అనంతపురం నగర అభివృద్ధికి ప్రజలు సహకారం అందించాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన

ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు. అవినీతి రహిత, పారదర్శక పాలన అందిస్తామని చెప్పారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam