DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నలుగురేనా ? . . .న్యాయం, చట్టం, ప్రభుత్వం, ప్రజలు కాదా ? 

హైదరాబాద్ లోని ఈ దుర్ఘటన కు బాధ్యులెవరు ?

చట్టాలు వీళ్ళకి చుట్టాలైనా? శిక్షలు వెయ్యరా? 

నిశీధిలోని నిశాచర పిశాచాలకు చట్టాలు చుట్టాలైనా?

దేశం

యావత్తూ సిగ్గు తో తలదించుకోవాల్సిన దుర్ఘటనలు ఇవి.

రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు స్టేషన్లను ఏకీకృతం చెయ్యాలి. . .

శిక్షలు లేకుంటే బాధిత మహిళలకు రక్షణ

ఏదీ ?

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి). . . . . .

అమరావతి, నవంబర్ 30, 2019 (డిఎన్‌ఎస్‌) : దేశం మొత్తం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితికి  à°¹à±ˆà°¦à°°à°¾à°¬à°¾à°¦à± లో

రెండు రోజుల క్రితం జరిగిన వైద్యురాలి దుర్ఘటనకు భాద్యులు ఎవరు ? ఈ ఘటనలో ఎన్నో లోపాలు బహిరంగంగానే కనపడుతున్నాయి. వీటికి భాద్యులు కూడా ఎదురుగానే ఉన్నా. . శిక్షల

నుంచి మాత్రం తప్పించుకు తిరుగుతున్నారు. ఈ ఘటనలో ముందుగా ఆపదలో భయంతో ఉన్న ఒక యువతి తన వాహనాన్ని పార్క్ చేసుకునేందుకు నిరాకరించిన టోల్ ప్లాజా సిబ్బంది ప్రధమ

దోషిగా కనపడుతున్నారు. వీళ్ళకి జనాన్ని ఇబ్బడి ముబ్బడిగా దోచుకోడమే తప్ప, ప్రజల గోడు పట్టని వీరు దోషులే అవుతారని తెలుస్తోంది.  

చట్టాలు ఉన్నప్పటికీ,

కఠినతరం కాకపోవడం, సత్వర శిక్షలు లేకపోవడం, పట్టుబడ్డ నిందితులను పోలీసులు పలు కారణాలవల్ల వదిలి పెట్టడం ఎన్నో సమస్యలకు అలవాలంగా నిలుస్తోంది.  à°µà°¿à°¡à±à°¦à°²à±ˆà°¨ దోషులు,

బాధితులను భయపెట్టి, బెదిరించి, మరీ కేసులను వెనక్కి తీసునేలా చెయ్యడం, పైగా నేరాన్ని రూపుమాపేలా వికృత చేష్టలు చేసేందుకు చట్టాలలో లోపలే కారణంగా

నిలుస్తున్నాయి.  à°—తం లో ఎన్నో కేసుల్లో ఇదే నిరూపితమైందనడానికి బాధితులు, కుటుంబాలు బలవన్మరణాలకు పాల్పడినా  à°®à°°à°£à°¿à°‚చినప్పడికీ, నేరాలు చేసిన దోషులు మాత్రం

దొరల్లాగా తిరుగుతూ, అధికారాల్లో కొనసాగుతూనే ఉన్నారు.  

మొన్నటి కేసులో ఎన్నో లోపాలు ప్రత్యక్షంగానే కనపడుతున్నాయి. 
  
నడి రోడ్డు పై లారీలు ఆపేసి,

విచ్చలవిడిగా మందు కొడుతున్న వీళ్ళని నిరోధించకుండా, వీళ్ళని పట్టించుకోని హైవే పెట్రోలింగ్ సిబ్బంది కూడా దోషులే అవుతారు. 

రాత్రి 10 గంటల ప్రాంతంలో ఎంతో

బిజిగా ఉండే తొండుపల్లి (శంషాబాద్) హైవేపై ఓ యువతిని లాక్కెళుతున్న అటు వైపు దృష్టి పెట్టని వాహనదారులు, స్థానికులకు కూడా భాద్యత ఉన్నట్టు

కనపడుతోంది. 

సీసాల్లో పెట్రోల్ పొయ్యొద్దని ఉత్తర్వులున్నా అర్ధరాత్రి అనుమాన పడకుండా బాటిల్ లోనే పెట్రోల్ పోసిన బంకు సిబ్బంది కి భాద్యత

లేదనగలమా?

పోలీసుల పాత్ర కీలకం :. . . .

ఆపదలో ఉన్న వారు సమీపంలోని పోలీసు స్టేషన్ కు వచ్చిన సమయాల్లో కేసు తమ పరిధి కాదు అని తప్పించుకునే అవకాశం పోలీసులకు

ఉండకూడదు. అయితే సాంకేతిక పరంగా అవార్డులు, రివార్డులు పొందుతూ గొప్పలు చెప్పుకునే పోలీసు యంత్రాంగానికి రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లనూ

నెట్వర్కింగ్ పరిధిలోకి తీసుకు రావాలి అని తెలియక పోవడం మహా తప్పిదంగానే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా నేరాలు అరికట్టాల్సిన భాద్యత రాష్ట్రంలోని పోలీసు

యంత్రాంగానికి ఉంది. అయితే జిల్లాల వారీగా విడగొట్టినది కేవలం పాలనా సౌలభ్యం కోసమే అనేది అందరికీ తెలిసిన విషయం. అయితే పోలీసు స్టేషన్లలో కేసుల నమోదు

ప్రక్రియను రాష్ట్రంలోని అన్ని స్టేషనల్లోనూ అనుమతించాల్సిన దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. తదుపరి తమ పరిధిలోని కేసులను సంబంధిత స్టేషన్లకు బదిలీ

చేసుకునే సౌలభ్యం చేసుకోవాల్సి ఉంది. తద్వారా రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ కేసు నమోదు అయ్యిందో రాష్ట్రం వ్యాప్తంగా తెలిసే అవకాశం ఉంటుంది. అనంతరం సమీపంలోని

పోలీసు యంత్రాంగం ఘటనా స్థలాన్ని చేసుకోగలరు. 

సత్వర శిక్షలు పడితే. . మరోక నేరం జరగదు: . . . .

ఒక నేరం జరిగిన వెంటనే సత్వర శిక్షలు అమలు చేస్తే. . . వీటికి భయపడి

మరొకరు నేరం చెయ్యడానికి కూడా వెనకడుగు వెయ్యడం జరుగుతుంది. ప్రస్తుతం అమలవుతున్న చట్టాల ప్రకారం భయంకర నేరాలు చేసిన వారిని కూడా భారీ భద్రతా ఇచ్చి, జైళ్లలో

తిండి పెట్టి మేపుతూ, కాలయాపన చేస్తూ, బాధితులను ఘోరంగా అవమానిస్తున్నారు. సింగపూర్ తరహా సత్వర కఠిన శిక్షలే వీటికి తగిన పరిష్కారం అనే అభిప్రాయం మొత్తం

ప్రజలందరిలోనూ వ్యక్తం అవుతోంది. 

బాధిత మహిళలకు రక్షణ ఏది ?. . . . 

ఎన్నో నేరాల్లో నిందితులకు శిక్ష పడని కారణంగా ఎన్నో కేసులు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది

కేసులు పెండింగ్ లోనే ఉండిపోయాయి. వీటిల్లో మహిళలపై జరిగిన అఘాయిత్యాలకు చెందిన కేసులు చాలానే ఉన్నాయి. అయితే ఎఫ్ ఐ ఆర్ నమోదు అయినా తర్వాత కూడా నిందితులకు

శిక్షలు పడని కారణంగా బాధితులపై తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయి. తద్వారా బాధిత మహిళలకు బెదిరింపు కూడా వస్తుండడంతో వీరికి రక్షణ కరువవుతోంది. పైగా కేసులు పెట్టిన

మహిళలనే దోషులుగా సమాజం చూసే విధంగా నిందితులు ప్రచారం చేస్తుండడం బాధాకరం. ఈ విధంగా అఘాయిత్య కేసులు పెట్టిన మహిళలకు రక్షణ కల్పించడం పోలీసులపై ఉంది. తద్వారా

దోషులు కేసులను తప్పుదారి పట్టించే అవకాశం ఉండదు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam