DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సమాచార శాఖలో ఫ్రాన్సిస్ సేవలు అనిర్వచనీయం 

ఫ్రాన్సిస్ సేవలు మరి కొంత కాలం కొనసాగాలి . 

వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు అభినందనలు 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి) : . . .

అమరావతి,

డిసెంబ‌రు 01, 2019 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్ర ప్రగతి ని బాహ్య ప్రపంచానికి తెలియడం లో సమాచార శాఖ కీలక భూమిక వహిస్తుందని, à°† శాఖలో అధికారుల పాత్ర మరింత కీలకం అని రాష్ట్ర

వ్యవసాయ శాఖామంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.
సమాచారం శాఖలో ఎన్నో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించడంలోనూ, పెను మార్పులు అమలు చేయడంలోనూ ఆ శాఖ సంయుక్త

సంచాలకులు ఎం. ఫ్రాన్సిస్ పాత్ర కీలకం అని తెలిపారు. శనివారం పదవి విరమణ చేసిన ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలియచేసారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జరిగిన

అభినందన సభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఫ్రాన్సిస్ తో తనకు ఉన్న పరిచారాన్ని గుర్తు చేసుకున్నారు. గత రెండు దశాబ్దాలుగా ఆయనతో పరిచయం ఉందని,

తానూ గతంలో ప్రముఖ పత్రిక లో పశ్చిమ గోదావరి జిల్లా ఇంచార్జి à°—à°¾ ఉన్న సమయంలో ఫ్రాన్సిస్ à°† జిల్లా సమాచార విభాగం జిల్లా అధికారిగా ఉన్నారన్నారు. 

పదవి విరమణ

అనంతరం ఆయన సేవలు ప్రభుత్వానికి అవసరమని, ఉన్నతాధికారులతో చర్చించి తదుపరి కార్యాచరణ చేపడతామన్నారు. 
కార్యక్రమం లో పాల్గొన్న తూర్పు గోదావరి జిల్లా

కలెక్టర్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ ఫ్రాన్సిస్ లాంటి అధికారులు ఎన్నో సునిశిత అంశాలపై సానుకూల నిర్ణయాలు తీసుకోవడం ద్వారా క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం

లభించిందన్నారు. 

ఫ్రాన్సిస్ 1985 లో సమాచార శాఖలో à°¡à°¿ పి ఆర్ à°“ à°—à°¾ విధుల్లో చేరి, 34 సంవత్సరాల సేవల అనంతరం సంయుక్త  à°¸à°‚చాలకులుగా పదవి విరమణ చేసారు. కృష్ణ జిల్లాలో

పనిచేసిన సమయంలో గోదావరి పుష్కరాలలోను, నంది నాటకోత్సవాల్లోనూ, కాకినాడ బీచ్ ఫెస్టివల్ తదితర ప్రధాన ఉత్సవ, వేడుకలు విజయవంతం కావడంలో ప్రధాన భూమిక

వహించారన్నారు.  
à°ˆ అభినందన సభలో తూర్పు గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ లక్ష్మి à°·à°¾, సంయుక్త కలెక్టర్ 2 రాజేశ్వరి, ఇతర అధికార, అనధికారులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam