DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైభవంగా సంప్రదాయ కార్తీక కళామహోత్సవం

కూచిపూడి నృత్య గురుకులం మన గౌరవం: ధర్మాన 

ప్రతీ ఏటా వేడుకలు నిర్వహిస్తాం : కలెక్టర్ నివాస్ 

సంప్రదాయానికి అద్భుత ఆదరణ : స్వాతి సోమనాథ్

 

అశేషంగా హాజరైన ప్రజలు. క్రిక్కిరిసిన కళామందిరం

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం) : . . .

శ్రీకాకుళం, డిసెంబ‌రు 01, 2019 (డిఎన్‌ఎస్‌):

శ్రీకాకుళం లో  à°œà°°à±à°—ుతున్నా కార్తీక కళామహోత్సవం లో సంప్రదాయం గురుకులం విద్యార్థులు చేసిన సంగీత, నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.  à°¸à±à°¸à°°à°¾à°ªà±

లక్ష్మీగణపతి శర్మ బృందం శాస్త్రీయ, సినీ, సంగీత విభావరి., కాయల శివకుమార్ బృందం శాస్త్రీయ నృత్య ప్రదర్శన ప్రేక్షకుల మన్ననలు పొందాయి. సంప్రదాయం విద్యార్థులు,

కళాకారులు చక్కటి అభినయం ప్రదర్శించారు

ముఖ్య అతిథి గా హాజరైన మాజీ మంత్రి, శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ సంప్రదాయం గురుకులం ద్వారా సంప్రదాయ

కళలను నేటి బాల బాలికలు, యువతరానికి అందించడం అత్యద్భుతమన్నారు. గత 3 నెలలు కోర్సుల నుంచి పూర్తి స్థాయి శిక్షణ ద్వారా మన సంప్రదాయ కళా ప్రాభవాన్ని

విస్తరింపచేయడాన్ని అభినందించారు. 
 à°¸à±à°¥à°¾à°¨à°¿à°•à°‚à°—à°¾ సంగీత నాట్య కళా గురుకులం సంస్థ ఉండటం, స్థానికంగా గురుకులం నృత్య కళాశాల ఉండటం వలన స్థానిక చిన్నారులు గొప్ప

నృత్య కళాకారులుగా ఎదిగే అవకాశం ఉంటుందన్నారు. నృత్యం లో ఉండటం వలన విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. దేశంలో కూచిపూడి నృత్యంలో ఇది ఒక్కటే

సంస్థ మన శ్రీకాకుళం లోనే ఉండడం గర్వకారణమన్నారు. à°ˆ కిల్లిపాలెం శ్రీకాకుళం కార్పొరేషన్ లో భాగస్వామ్యం కానుందని తెలిపారు. 

మా కృషి సాఫల్యం అయ్యింది:

కలెక్టర్ నివాస్ 

ఈ కార్యక్రమ నిర్వాహక కమిటీ అధ్యక్షులు, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ డాక్టర్ నివాస్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఆశించిన స్థాయిలో ఆదరణ

లభిస్తుందా అనే సంశయం ఉండేదని, అయితే ప్రజల నుంచి, కళాభిమానులు నుంచి లభించిన ఆదరణ అత్యద్భుతమన్నారు. కళామహోత్సవం చూసిన తరువాత కళలను ప్రోత్సహించే ప్రజలు అని

నిరూపించారు. ఇంత మంది ప్రజలు ప్రేక్షకులుగా రావడం గొప్ప అనుభూతి కల్గిందన్నారు. ఈ సంప్రదాయం లో ప్రతి ఏడాది కళామహోత్సవం నిర్వహిస్తామని, ప్రముఖ కళాకారుల

ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 

ఈ సందర్భంగా నృత్య, కళా గురువులు సుసరాపు లక్ష్మీగణపతి శర్మ, కాయల శివకుమార్, నాదస్వరం కళాకారులు కృష్ణ, రెడ్డి

సత్యనారాయణ, పార్వతీశం., తదితర కళాకారులు, సాంకేతిక బృందాన్నీ ముఖ్య అతిధి సత్కరించారు. కార్యక్రమం లో ఇన్ టాక్ ప్రతినిది వావిలాపల్లి జగన్నాథం నాయుడు, సంప్రదాయం

సంచాలకులు స్వాతి సోమనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam