DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చికిత్స తర్వాత కూడా జీవన భృతి, ఇదే వై ఎస్ ఆర్ ఆసరా. .

చికిత్స తర్వాత కూడా జీవన భృతి, ఇదే వై ఎస్ ఆర్ ఆసరా. . .

సర్వజన ఆసుపత్రిలో ప్రారంభమైన వైయస్ఆర్ ఆసరా

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ).

.

శ్రీకాకుళం, డిసెంబ‌రు 02, 2019 (డిఎన్‌ఎస్‌):  à°šà°¿à°•à°¿à°¤à±à°¸ అనంతరం జీవనోపాధి భృతి కల్పించే  à°¡à°¾. వై.యస్.ఆర్ ఆరోగ్య ఆసరా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం

 à°ªà±à°°à°¾à°°à°‚భమైంది. శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ జె నివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. à°¡à°¾. వై.యస్.ఆర్ ఆరోగ్య శ్రీ

హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆరోగ్య ఆసరా కార్యక్రమం ప్రారంభమైంది. ఆరోగ్య శ్రీ ఆసరాలో భాగంగా చికిత్స అనంతరం జీవనోపాధి భృతి కల్పించడం జరుగుతుందని

అన్నారు. డిసెంబరు 1వ తేదీ నుండి అమలులోకి వస్తుందని చెప్పారు. చికిత్స అనంతరం రోగి కోలుకునే వరకు రోజుకు రూ.225 చొప్పున నెలకు గరిష్టంగా రూ.5 వేలు వరకు అందిస్తారని

పేర్కొన్నారు. ఆరోగ్య ఆసరా అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించిందన్నారు. ఒక వ్యక్తి జీవన భృతి దెబ్బతినడం వలన జీవితాన్ని గడిపేందుకు కష్టంగా

పరిణమిస్తుందని దానిని ప్రభుత్వం గుర్తించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవ శకం కార్యక్రమంలో భాగంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారికి పింఛన్ల

రూపంలో ఆర్ధిక సహాయం అందించుటకు చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ అన్నారు. ప్రభుత్వం సూచించిన మేరకు తలసేమియా మేజర్,సికిల్ సెల్ ఎనీమియా,సివియర్

హీమోఫీలియా, బైలేటరల్ ఎలీఫాన్టియాసిస్ (బోదకాలు) - గ్రేడ్ 4, నడవలేని స్థితిలో గల పేరాలిసిస్ (పక్షవాతం), ప్రమాదం కారణంగా మంచం పట్టినవారు మరియు అన్ని కండరాలు

బిగుసుకు పోవడం వలన మంచం పట్టినవారు, 3, 4, 5 దశల్లో ఉన్న కిడ్నీ రోగులు – మూడు నెలల సమయంలో సీరం క్రియాటిన్ 5 à°Žà°‚.జికి పైబడి కనిపించడం, సోనో గ్రాఫిక్ పరీక్షలలో 8 సెం.మీ

కంటే తక్కువగా కిడ్నీ పరిమాణం ఉన్నట్లు ధృవపడినవారు, జి.ఎఫ్.ఆర్ 15 ఎం.ఎల్. కంటే అధికంగా ఉన్న వ్యాధిగ్రస్తులు; లెప్రసి వలన బహుళ అవయవాల లోపం కలిగిన వారు., వై యస్ ఆర్

ఆరోగ్య శ్రీ క్రింద కిడ్నీ, కాలేయం, గుండె ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగినవారికి పింఛను వర్తింపజేయుటకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు. సంబంధిత వ్యాధులకు

సంబంధించిన వ్యక్తుల జాబితాను సేకరించడం జరుగుతోందని అందులో నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. 
పింఛను పొందుటకు అర్హమైన వ్యక్తులను ప్రభుత్వ

మార్గదర్శకాలకు అనుగుణంగా నమోదు కావడానికి  à°ªà±à°°à°¤à°¿ ఒక్కరూ సహకరించాలని కోరారు. అర్హులైన వ్యక్తులు ఆధార్, బ్యాంకు ఖాతాల నంబర్లతో సహా సమర్పించాలని స్పష్టం

చేసారు. 
సూపర్ 60 బ్యాచ్ మేథో వికాసానికి సహకరించాలి : ఎస్.టి, ఎస్.సి విద్యార్ధులు ఐ.ఐ.టి, ఎన్.ఐ.టి, నీట్ పరీక్షలలో విజయం సాధించుటకు సూపర్ 60 బ్యాచ్ లను

నిర్వహిస్తున్నామని కలెక్టర్ నివాస్ చెప్పారు. సూపర్ 60 బ్యాచ్ విద్యార్ధుల మేథో వికాసానికి, పోటీ పరీక్షలకు సరిపడా జ్ఞాన సముపార్జనకు సంబంధిత రంగాలలో నిపుణులు

సహకరించాలని అన్నారు. తమకు లభ్యమైన సమయంలో వారికి అవగాహన కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. 
ఆరోగ్య శ్రీ జిల్లా సమన్వయ అధికారి డా కె. సాయిరాం మాట్లాడుతూ

వ్యాధి తీవ్రత ఉంటే వైద్య నిపుణుల సూచన మేరకు జీవనోపాధి భృతి మంజూరు జరుగుతుందని తెలిపారు. ఆరోగ్య శ్రీ  à°•à±à°°à°¿à°‚à°¦ 1059 వ్యాధులకు చికిత్స ఉందని అందులో  836 చికిత్సలకు

చేయూత ఇస్తున్నారని చెప్పారు. ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయిన 48 గంటల్లోనే రోగి బ్యాంకు ఖాతాకు ఆసరా మొత్తం జమ కానుందని పేర్కొన్నారు. 
ఈ సందర్భంగా ఆరోగ్య శ్రీ

క్రింద చికిత్స పొంది జీవన భృతి క్రింద ఆరోగ్య శ్రీ ఆసరా పథకం క్రింద సనపల రాజు, గొండు కృష్ణ, కొల్లి రమణమ్మకు జిల్లా కలెక్టర్ చెక్కులను అందజేసారు. చికిత్స

పొందినవారితో కలెక్టర్ స్వయంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల డా.ఏ.కృష్ణ వేణి, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి

సూపరింటిండెంట్ à°¡à°¾.ఏ.కృష్ణమూర్తి, రెసిడెంట్ మెడికల్ అధికారి à°¡à°¾.బి.సి.హెచ్.అప్పల నాయుడు, స్త్రీవైద్య నిపుణులు à°¡à°¾.పార్వతి,  à°œà°¿à°²à±à°²à°¾ వైద్య ఆరోగ్య అధికారి

à°¡à°¾.à°Žà°‚.చెంచయ్య,  à°œà°¿à°²à±à°²à°¾ ఆసుపత్రుల సమన్వయ అధికారి à°¡à°¾. బి.సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam