DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తాను ఉన్నానని మరోసారి నిరూపించే అవకాశం వెంకన్నకు ఇవ్వొద్దు

శ్రీనివాసుడే అందరికీ బాస్ - ఆయనతో పెట్టుకుంటే అంతా లాస్   

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ లో ఎవరూ బాస్ లు లేరు, అందరూ సేవకులు,  

టిటిడి లో లోపాలపై రాధా మనోహర్ దాస్

మండిపాటు 

టీటీడీలో ప్రతి ఒక్కరితో తిరునామం పెట్టించి పని చేయించగలరా?

వైవీ సుబ్బారెడ్డి కి రాధా మనోహర్ దాస్ సవాల్ . . .

ఇప్పుడు ఆలయాలే

ప్రభుత్వాన్ని పోషిస్తున్నాయి. . 

వెంకన్నకు మరోసారి నిరూపించుకునే పరిస్థితి తేవద్దు :

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి): . . . .

తిరుపతి ,

డిసెంబ‌రు 03, 2019 (డిఎన్‌ఎస్‌) : తిరుమల వేంకటేశ్వరుడు గతంలో ఎన్నో సార్లు తాను ఉన్నాను అని, మరోసారి నిరూపించుకునే అవసరం, అవకాశం ఆయనకు ఇవ్వవద్దని రాధా మనోహర్ దాస్

తెలిపారు. తిరుపతి ప్రెస్ ప్రెస్ క్లబ్ లో జై హిందూస్తాన్ పార్టీ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన చాలా విషయాలను కూలంకషంగా వివరించారు. కలియుగం తొలినాళ్ళ

నుంచి భక్తులను అనుగ్రహిస్తున్న శ్రీవేంకటేశ్వరుని పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు పరాచికాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కోట్లాది మంది భక్తులు వేసే

హుండీల నుంచి డబ్బులు ప్రతి నెలా జీతాలు తీసుకునే వారందరూ కచ్చితంగా హిందువులే అయి ఉండాలన్న నిబంధనలు ఉన్నా, వాటిని తుంగలోకి తొక్కేశారన్నారు. ఈ సందర్బంగా ఈయన

తిరుమల తిరుపతి దేవస్థానములు ( à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ) ట్రస్ట్ బోర్డు చైర్మన్, కమిటీ సభ్యులకు à°’à°• సవాల్ విసిరారు. à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ లో పని చేసే చైన్ మాన్ నుంచి చైర్మన్ వరకూ ప్రతి ఒక్కరూ

స్వామి తిరునామం ( వెంటేశ్వరుని మాదిరిగా  à°¨à°¾à°®à°‚) పెట్టుకుని ప్రతి రోజూ విధులు నిర్వహించగలరా అని చైర్మన్ వై వి సుబ్బారెడ్డి à°•à°¿ సవాల్ విసిరారు. వాళ్ళందరూ అలా

చేస్తే తానూ చైర్మన్ కు సాష్టాంగం పడి దణ్ణాలు పెడతానని ప్రకటించారు.  

ఇప్పడికే వేంకటేశ్వరుడు చాలా సార్లు తానూ ఉన్నాను అని నిరూపించుకున్నది, అయనతో

పరాచికాలు ఆడితే మరోసారి నిరూపిస్తాడని హెచ్చరించారు. టిటిడి లో ఉన్న 1500 మంది క్రైస్తవ ఉద్యోగులూ కచ్చితంగా టిటిడి వదిలి పోవాలని హెచ్చరించారు. శ్రీనివాసుడి

అందరికీ బాసు అనీ, ఆయనతో పెట్టుకుని నాటకాడేవాళ్ళకి లాసు అని సూచించారు. వీళ్ళని బయటకు పంపడానికి భక్తులు వెనకడుగు వేసినా, వెంకన్న ముందడుగే వేస్తాడన్నారు. ఆ

రోజు కూడా తొందరలోనే ఉందన్నారు. 
గతం లో ప్రభుత్వాలు దేవాలయాలను పోషించేవని, ఇప్పుడు ఈ దేవాలయాలను దోచుకుంటూ ప్రభుత్వాలు బ్రతుకుతున్నాయని

మండిపడ్డారు. 

ప్రతి రోజూ కోట్లు సంపాదించే వెంకటేశ్వరునికి కొప్పెర ( హుండీ పై వస్త్రం) ప్రతి రోజు ఒక కొత్త వస్త్రం మార్చాలని, అలాంటిది ఆయనకు వస్త్రం

కొట్టడానికి దర్జీ దొరకలేదని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ నాటకాలాడుతోందన్నారు. ఆయన కోసమే ఎంతో ప్రయాస పడి  à°•à±‹à°Ÿà±à°²à°¾à°¦à°¿ రూపాయలు భక్తులు హుండీల్లో వేస్తుంటే, à°† డబ్బుని దోచుకుని

పెద్దలు కార్లు కొనుక్కుంటున్నారని, నెల నెలా వేలాది రూపాయలు జీతాలు తీసుకునే అధికారులు చర్చిలకు పోస్తున్నారని మండిపడ్డారు.  

అందరూ పనోళ్లే, ఎవ్వరూ బాస్

లు కాదు: . . .

స్వామి ముందు ఎంతటి మహారాజులైనా సామాన్యులెనని, అలాంటిది ఈ రాష్ట్రంలో అధికారులు, బోర్డు సభ్యులు పెద్ద గొప్పెళ్ళేమీ కాదని మనోహర్ దాస్ తెలిపారు.

కోట్లాది మందిలో కేవలం వీళ్ళకి మాత్రమే వచ్చిన à°ˆ అవకాశాన్ని పూర్తి à°—à°¾ సద్వినియోగం చేసుకుని, మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. 

టిటిడి బోర్డు కు

చిత్తశుద్ధి ఉంటె ప్రతి రోజూ సుమారు 4 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం హుండీలో వేస్తున్న సామాన్య భక్తుల కోసం తిరుపతి నుంచి ప్రతి రోజు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿  à°•à±Šà°‚డపైకి బస్సులు

ఉచితంగా నడపాలని సూచించారు. నిరంతరం భక్తులకు ఉపయోగపడే కార్యక్రమాలే చేపట్టాలన్నారు. 

ఇక్కడ పెంచుడు. . అక్కడ పంచుడు :. . . 

రాష్ట్ర ప్రభుత్వానికి

హిందువులంటే పెద్దగా గౌరవం ఉన్నట్టు కనపడడంలేదన్నారు. దేవాదాయ శాఖా పేరిట రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాలు, వాటికి దాతలు ఇచ్చిన భూములను స్వాధీనం చేసుకున్న

రాష్ట్ర ప్రభుత్వం, ఆలయాల్లో భక్తులు వేసే ముడుపులు దోచుకు తింటున్నారన్నారు. ఇక్కడ తిన్న డబ్బులను ఇతర మాటలకూ పంచడానికి, క్రీడలకు, తిరుపతి లో రోడ్లు

వెయ్యడానికి ఇబ్బడి ముబ్బడిగా వాడేస్తున్నారన్నారని మండిపడ్డారు. 

రాష్ట్ర వ్యాప్తంగా కనీసం ఒక్క చర్చి గానీ, ఒక్క మసీదు గానీ రాష్ట్ర ప్రభుత్వ అధీనం లో

ఉన్నాయా అని ప్రశ్నించారు. పైగా  à°µà±€à°Ÿà°¿ నుంచి కనీసం ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి ఆదాయం రాదన్నారు. 

ఇటీవల పాస్టర్లకు, మౌల లకు నెలకు వేలకు వేలు జీతాలు

ఇస్తామని ప్రకటించేశారన్నారు. ఈ డబ్బులన్నీ ఎక్కడ నుంచి ఇస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఖజానా అంటే కేవలం క్రైస్తవులు, ముస్లిం లు మాత్రం పన్నులు కట్టారని,

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మతాల వారూ పన్నులు చెల్లిస్తారన్నారు. అందరూ చెల్లించిన పన్నుల నుంచి కేవలం ఒక మతం వారికే డబ్బులు ఎలా చెల్లిస్తారని

ప్రశ్నించారు. 

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿  à°²à±‹ చేసిన తప్పిదాలను ఆయన ప్రకటించారు :

లడ్డు ప్రసాదం ధరలను ఇబ్బడి ముబ్బడిగా పెంచేశారని, గదుల అద్దెలను రెట్టింపు

చేశారన్నారు. 

ధర్మా రెడ్డి నియామకమే పెద్ద వివాదం అన్నారు. వేలాది మంది సిబ్బంది ఉండగా మరొకరిని డిప్యుటేషన్ పై తీసుకు రావడం ఏంటని

ప్రశ్నించారు. 

డాలర్ శేషాద్రిని తొలగించకుండా కొనసాగించడం కూడా వివాదమేనన్నారు.   

36 మందితో టీటీడీ జంబో బోర్డు వివాదం మరియు టీటీడీ బోర్డు సభ్యులు

ఆర్థికంగా టీటీడీని నష్టం కలిగించడం కదా అని ప్రశ్నించారు. 

గతంలో ఇదే బోర్డులో ఉండగా కేసుల్లో నిందితుడు శేఖర్ రెడ్డి ని మళ్ళీ టీటీడీ బోర్డు లో

నియమించడం పెద్ద  à°µà°¿à°µà°¾à°¦à°‚ అన్నారు. 

అత్యంత పవిత్రమైన కార్తిక మాసంలో పుష్కరిణి మూసివేయడం చాలా వివాదం à°—à°¾ మారిందన్నారు. 

ఉచితంగా ఇవ్వవలసిన లడ్డు

బ్యాగులకు ధరలు నిర్ణయించడం దారుణం అన్నారు.  

శ్రీ వాణి ట్రస్ట్ పేరుతో విఐపి దర్శనము 10,000 రూపాయలు ప్రవేశ పెట్టడం ఎవరిని మేపడానికి అని అడిగారు.

శ్రీనివాసునికి ఆదాయం కొరత లేదన్నారు.  

కపిలతీర్థంలో ప్రైవేట్ హోమం ఎవరి కోసం చేయించారన్నారు.?  

కోట్లాది మంది ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీ వారి లడ్డు

ప్రసాదాలను విశాఖ పీఠాదిపతి కాళ్ళ దగ్గర పెట్టడం కోట్లాది మంది భక్తుల్లో ఆగ్రహాన్ని తెచ్చిందన్నారు. 

విఐపి దర్శనాలు ,సేవా టిక్కెట్లు , వస్త్రాలంకరణ

టికెట్ల వివాదం -

టీటీడీ ఉద్యోగస్తులే చర్చి లు కట్టిన చర్యలు తీసుకోకపోవడం వెనుక కారణం ఏంటన్నారు?  
   
టీటీడీలో హిందూ ముసుగులో ఉన్న క్రైస్తవులు

చర్చిలకు నేరుగా à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ వాహనాల్లోనే   వెళ్తున్న వారిపై చర్యలు తీసుకోకపోవడం చాలా పెద్ద దుమారాన్నే లేపిందన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam