DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హోమ్ గార్డు వ్యవస్థ సేవలు అమోఘం: ఎస్పీ అమ్మి రెడ్డి.

à°’à°• గార్డు 5గురు పీసీలకు సమానంగా పని చేస్తున్నారు 

జిల్లాలో మొదటి హోమ్ గార్డు కృష్ణ వేణి à°•à±€ పురస్కారం 

రక్తదానం చేయడం మరింత

అభినందనీయం:

ఎచ్చెర్ల లో 57à°µ హోమ్ గార్డు రైసింగ్ డే లో అభినందనలు 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం) : . . . . .

శ్రీకాకుళం, డిసెంబ‌రు 06, 2019

(డిఎన్‌ఎస్‌): హోమ్ గార్డు వ్యవస్థ సేవలు అమోఘం, అనిర్వచనీయమని శ్రీకాకుళం ఎస్పీ ఆర్ ఎన్ అమ్మి రెడ్డి తెలియచేసారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో

జరిగిన 57à°µ హోమ్ గార్డు రైసింగ్ డే  (అవతరణ దినోత్సవ వేడుకలు) కు ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసారు. à°ˆ సందర్బంగా ఆయన హోమ్ గార్డులందరికీ అభినందనలు తెలిపారు. అంతకు ముందు

ఆయన హోమ్ గార్డ్ à°² నుంచి 
గౌరవ వందనం స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ హోమ్ గార్డు వ్యవస్థ సేవల ప్రాముఖ్యత పెరిగిందన్నారు. 1946లో స్వచ్ఛంద వ్యవస్థగా ప్రారంభం జరిగి

పోలీస్ శాఖలో మమేకమైందన్నారు. ఒక హోమ్ గార్డు ఐదుగురు కానిస్టేబుల్ లతో సమానంగా పనిచేస్తున్నారన్నారు. యూనిఫామ్ లో ఉన్న ప్రతి వ్యక్తిని సమాజం పరిశీలిస్తోంది.

దానిని గమనించి విధులు నిర్వర్తించాలని, ఆదర్శంగా పనిచేయాలని సూచించారు. మొత్తం సర్వీస్ లో ఎటువంటి రిమార్కు లేకుండా పని చేయడం ద్వారా మంచి పేరు

సాధించవచ్చన్నారు. ఎటువంటి ప్రలోభాలతో పెడద్రోవ పట్టవద్దని, అసాంఘిక శక్తులతో కలవవద్దని, వారికి సహకరించవద్దు అని సూచించారు. జిల్లాలో రహదారి ప్రమాదాలు ఎక్కువ.

వాటిని నివారించాలి. హోమ్ గార్డులు కీలక పాత్ర పోషించాలని కోరారు. 

హోమ్ గార్డ్ లందరూ మరిన్ని మంచి సేవలు అందించాలని, పోలీసు శాఖ నుంచి అన్ని విధాలా

సహకరిస్తామన్నారు. చక్కని పెరేడ్ నిర్వహించిన పెరేడ్ కమాండర్ కు నగదు పురస్కారాన్ని అందజేశారు. 

కార్యక్రమం లో పాల్గొన్న డిఎస్పీ సత్యనారాయణ మాట్లాడుతూ

1965లో జిల్లాలో హోమ్ గార్డు వ్యవస్థ ప్రారంభమైందని, హోమ్ గార్డు వ్యవస్థ ఉపయోగకరంగా ఉందని తెలిపారు. వీరు అన్ని రంగాల్లో మంచి పనితీరు చూపిస్తున్నారు. ఉత్తమ

పనితీరు కనబరిచిన హోమ్ గార్డులకు ఎస్పీ నగదు పురస్కారాన్ని పంపిణీ చేశారు. ఈ బృందం లో శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటి హోమ్ గార్డు కృష్ణ వేణి కూడా

ఉన్నారు

హోమ్ గార్డు సంతోష్ కుమార్ మాట్లాడుతూ జీతాలు పెరగడం ఆనందంగా ఉందని, ఇళ్ళ మంజూరుకు చర్యలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. విధులు సక్రమంగా

నిర్వహించి న్యాయం చేస్తాం అని హామీ ఇచ్చారు. 

ఈ వేడుకల్లో డిస్పీలు సిహెచ్ జివి ప్రసాద్, ఎన్ ఎస్ ఎస్ శేఖర్, ఫల్గుణ రావు, పోలీస్ సంఘం అధ్యక్షులు అప్పన్న, ఏఓ

సిహెచ్ ఎస్ ఎస్ ప్రసాద్, ఇన్స్పెక్టర్ లు, ఎస్ ఐ లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 

రక్తదానం చేయడం మరింత అభినందనీయం:

హోమ్ గార్డు లు ప్రజా సేవ వరకే

పరిమితం కాకుండా సమాజ సేవలో కూడా పాల్గొంటున్నాం అంటూ రక్తదానం చెయ్యడం అభినందనీయం అని ఎస్పీ అమ్మి రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా హోమ్ గార్డు లు నిర్వహించిన

రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ శిబిరంలో పెద్ద సంఖ్యలో హోమ్ గార్డ్ లు రక్తం దానం చేసారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam