DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చెత్త సినిమాలు, టీవీ సీరియళ్లు, డాన్స్ లు బ్యాన్ చెయ్యాలి  

గల్లీ నుంచి ఢిల్లీ దాక మహిళలకు రక్షణ ఇవ్వండి. . .

డబ్బే ప్రధానంగా ఉన్న సెన్సార్ బోర్డు రద్దు చెయ్యండి 

ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు మాధవి

డిమాండ్ 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం): . . . .

విశాఖపట్నం, డిసెంబ‌రు 06, 2019 (డిఎన్‌ఎస్‌):  à°¸à°®à°¾à°œà°¾à°¨à±à°¨à°¿ పూర్తిగా తప్పుదారి పట్టిస్తున్న మద్యం అమ్మకాలు,

విచ్చలవిడి శృంగారం తో పెట్రేగి పోతున్న అశ్లీల సినిమాలు, టీవీ సీరియళ్లు, ఆడా మొగ కలిసి విచ్చలవిడి తనంతో టీవీల్లో చేస్తున్న డాన్స్ పోటీలు తదితర అన్ని

మాధ్యమాలనూ తక్షణం నిషేధించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.యన్. మాధవి డిమాండ్ చేసారు. ఆడపిల్లల కు ఉన్న హక్కుల పట్ల అవగాహన

కల్పించాలని ఐద్వా కంచరపాలెం జోన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ప్రగతి ఒకేషనల్ జూనియర్ కళాశాల లో సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న ఈమె మాట్లాడుతూ

ప్రభుత్వం ఆడపిల్లలకు భద్రత పరంగా చర్యలు తీసుకోవాలని, కటినంగా చట్టాలు అమలు చేస్తేనే దిశా లాంటి ఘటనలు  à°ªà±à°¨à°°à°¾à°µà±ƒà°¤à°‚ కాకుండా వుంటాయని తెలియచేసారు. 

డబ్బే

ప్రధానంగా ఉన్న సెన్సార్ బోర్డు రద్దు చెయ్యండి : . . .

సినిమాల ప్రభావం సమాజంపై ప్రత్యక్షంగా చాలా ఉందని, అలాంటిది సినిమాల్లో విచ్చలవిడి శృంగారం

పెరిగిపోయిందని, వాటిని అదుపు చెయ్యవలసిన సెన్సార్ బోర్డు కేవలం డబ్బే ప్రధానంగా కళ్ళు మూసుకు పోయిందన్నారు. సమాజం పట్ల ఏమాత్రం భాద్యత లేని సెన్సార్ బోర్డు ను

తక్షణం దీన్ని రద్దు చెయ్యాలని డిమాండ్ చేసారు. ఇక పై టీవీ ఛానెళ్ల లో సైతం చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా ఆడ-మొగా అందరూ కలిసి విచ్చలవిడిగా అసభ్యకరమైన డాన్స్ లు

చేస్తూ సమాజానికి చెత్త సందేశాన్ని ఇస్తున్న à°ˆ డాన్స్ ప్రోగ్రామ్స్ ని కూడా వెంటనే బ్యాన్ చెయ్యాలని డిమాండ్ చేసారు.  

గల్లీ నుంచి ఢిల్లీ వరకూ అందరు మహిళల

భధ్రతకై పోలీసు యంత్రాంగాన్ని  à°ªà±†à°‚చాలని డిమాండ్ చేశారు. ఆడపిల్లలకు ఏటువంటి అన్యాయం జరిగినా మేము వారి వెంట ఉంటామని, కలశాల యాజమాన్యం కూడా పిల్లలంతా చైతన్య

వంతులుగా ఉండాలని కోరడమైనది.

విద్యార్థినులను చైతన్య పరిచే విధంగా ఎన్నో అంశాలను ఐద్వా ప్రతినిధులు ఈశ్వరమ్మ, పుష్ప, విజయ తదితరులు తెలియచేసారు. à°ˆ

కార్యక్రమం లో  à°•à°³à°¾à°¶à°¾à°² కరస్పాండెంట్ మాథ్యూ, ప్రిన్సిపాల్ అరుణ, వైస్ ప్రిన్సిపాల్ చార్లెస్ ఫిన్నీ, ఉపాధ్యాయ బృందం, 200 à°•à°¿ పైగా విద్యార్థినులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam