DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్రా మనోభావాలను మోడీ మొత్తానికి ముంచేశారు.

రాక్షస రాజకీయం లో ఏపీ విభజన బిల్లు అంశాలు 

విశాఖపట్నం, జూన్  19 , 2018 (DNS Online ) : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు 2013 - 14  à°²à±‹ ఉన్న అంశాలపై రాక్షస క్రీడలు చేస్తున్న

రాజకీయ పార్టీలపై సర్వత్రా ప్రజలు మండిపడుతున్నారు.   à°ˆ క్రమం లో మోడీ చేసిన మోసం లో తప్పు ఎవరిదీ ? ఎవరి పాత్ర à°Žà°‚à°¤ ? à°ˆ తప్పు మోసపోయిన వారిదా లేక మోసగించిన వారిదా ?

అనేదే ప్రస్తుతం నడుస్తున్న అంశం. దీనిలో పూర్తిగా భారతీయ జనతా పార్టీ స్వార్థం, అందునా మోడీ వ్యక్తిగత స్వార్థం సుస్పష్ఠంగా కనపడుతున్నాయి. పైగా బీజేపీ

రాష్ట్ర నాయకత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. పార్టీ పగ్గాల కోసం బీజేపీ నేతలు కొట్టుకున్నారు తప్ప, రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడిన దాఖలాలే లేవు. 

ఈ విభజన

బిల్లు లో అందరూ కోరుకునే అంశాల్లో ప్రధాన మైనవి.... ప్రత్యేక హోదా, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు. ఈ రెండు హామీలూ సాక్షాత్తు ప్రధాన మంత్రి అభ్యర్థి హోదా లో

నరేంద్ర మోడీ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో జరిగిన బహిరంగ సభల్లో ఆయనే ఇచ్చారు. ఇప్పుడు అధికారం లోకి వచ్చాక ప్లేట్ ఫిరాయించారు. ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని

మోడీ 2014 లోనే తేల్చడం తో అతని వ్యవహారం అంతా మోళీ అని తేలింది. అయితే ఇక మిగిలింది విశాఖ కేంద్రం గా రైల్వే జోన్ ప్రకటన. అది కూడా కుదరదు అని 2018 లో తేల్చేసింది. ఇక

దీన్ని రాజకీయం చేసేందుకు రాక్షస క్రీడగా మార్చేసిన రాజకీయ పార్టీలు ఒకళ్ళ పై మరొకళ్ళు దుమ్మెత్తి పొయ్యడానికే అధిక కృషి చేస్తున్నారు తప్ప, కేంద్రం పై

పోరాటానికి ఒక్కళ్ళు కూడా ప్రయత్నం చెయ్యడం లేదన్నది వాస్తవం. 

రైల్వే జోన్ కోసమే . . . సురేష్ ప్రభు à°•à°¿ సీటు 

విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఇస్తారు

అనే ఒకే ఒక్క నమ్మకం తోనే కేంద్ర మంత్రి సురేష్ ప్రభు కు ఆంధ్ర ప్రదేశ్ కోటా లో రాజ్య సభ సీటు కేటాయించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ విషయం లో చంద్రబాబు

చర్యను ఎవ్వరూ తప్పు పట్టలేరు. అయితే ఆయన కేంద్రం పై చెయ్యవలసినంత ఒత్తిడి తీసుకు రాకపోవడం వల్లనే రాష్ట్రానికి రావాల్సిన ఫలితాలు రాలేదు అనే అభియోగాలు

మూటకట్టుకున్నారు. 

ఆంధ్రా ని ముంచడమే పని... అని మంత్రులు తేల్చేశారు.:

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ముంచడం ఒక్కటే తమ లక్ష్యమని నరేంద్ర మోడీ అండ్ కో

మొత్తానికి తేల్చేశారు. విశాఖ కు రైల్వే జోన్ ఇవ్వమని బిల్లు లో చెప్పలేదు, కేవలం పరిశీలించమనే ఉందని  à°µà°¿à°·à°¯à°¾à°¨à±à°¨à°¿ కేంద్ర రైల్వే మంత్రి కేంద్ర రైల్వే శాఖా మంత్రి

పీయూష్ గోయల్, మానవ వనరుల శాఖా మంత్రి ప్రకాష్ జవదేకర్ తేల్చేశారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ అంటే కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీ కి ఎంత అభిమానమో తేలిపోయింది. కేంద్రం

లో అధికారం లో ఉన్నది బీజేపీ అయినా సరే, కాంగ్రెస్ అయినా సరే ఎవడికైనా ఆంధ్ర అంటే అభిమానం లేదని తేలింది.  à°‡à°• రానున్న కాలం లో à°ˆ పెద్ద పార్టీలకు ఆంధ్రా లో చుక్కలు

తప్పవన్న విషయం నిర్ధారణ అయ్యింది. 

విభక్త ఆంధ్ర ప్రదేశ్ ను ఆదుకుంటాం అని ఆంధ్రా లో ఓట్లు అడుక్కున్న నాయకులు నేడు మొహం చాటేయడం తో బీజేపీ క్యాడర్

పార్టీని వీడి పోతోంది. అయినప్పటికీ వీళ్ళకి కావాల్సిన పదవులు దక్కాయి కనుక రాష్ట్రం ఏమైతే మాకేంటి అనే నిర్లక్ష్య ధోరణి ఉంది ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ నాయకుల

బృందం. కనీసం ఒక వార్డు స్థాయి లో కూడా గెలుస్తారో లేదో తెలియని వాళ్లకి ఎం పీ గానూ, ఎమ్మెల్యే గానూ, ఎమ్మెల్సీ గానూ గెలిపించిన పాపానికి విశాఖపట్నం ప్రజలకు మంచి

బహుమానం ఇచ్చిన à°ˆ ఆంధ్రా క్యాడర్ బీజేపీ రానున్న కాలంలో భవిష్యత్ కోసం వేడుకులాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది అనడం అతిశయోక్తి కాదు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam