DNS Media | Latest News, Breaking News And Update In Telugu

29 న సాహిత్య రాజధానిరాజమహేంద్రి లో యుగళ శతావధానం, 

రాజమహేంద్రి లో సందీప్, లలిత్ ఆదిత్యల శతావధానం 

సదనం శతవర్ష వేడుకల్లో శతావధానం వైభవం   

మూడు రోజుల పాటు నగరవాసులకు కవితా ఉత్సవం 

రెండు

దశాబ్దాల తర్వాత తొలి  à°¶à°¤à°¾à°µà°§à°¾à°¨à°‚. . . .

చదివింది ఇంగ్లిష్, ప్రావిణ్యం సంస్కృతాంధ్ర భాషల్లో , 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి) : . .. . 

అమరావతి,

డిసెంబ‌రు 09, 2019 (డిఎన్‌ఎస్‌) : సాహిత్య రాజధాని à°—à°¾ పేరుపొందిన రాజమహేంద్రవరం లో ఈనెల 29 నుంచి మూడు రోజుల పాటు యువ అవధానులు యుగళ శతావధానం ఉత్సవాలు జరుగనున్నాయి. అవధాన

కిశోరాలు గా పెద్దలందరితోనూ కొనియాడబడుతున్న గన్నవరం లలితదిత్య, తాతా సందీప్ శర్మ లు ఈ యుగళ శతావధానం చేయనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. ఈ నెల 29 న

రాజమహేంద్రవరం లోని సదనం కాలేజీ, శుభోదయం ఇన్ఫరా సంయుక్త ఆధ్వర్యవంలో à°ˆ వేడుక ఆరంభం అవుతుందని ప్రవచన రాజహంస డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి తెలిపారు.  
ఎన్నో

సాహితీ కార్యక్రమాలకు, అష్టావధానాలకు వేదికగా నిల్చిన సదనం వందవ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంలో శుభారంభంగా నిర్వహిస్తున్న యుగళ శతావధానం

నిర్వహిస్తున్నట్టు తెలిపారు. భారత, అమెరికా దేశాల అవధాన కిశోరాలు  à°¤à°¾à°¤à°¾ సందీప్ శర్మ , గన్నవరం  à°²à°²à°¿à°¤à± ఆదిత్యల యుగళ శతావధానం డిసెంబర్ 29, 30, 31తేదీల్లో జరుగబోతోంది.

ఆంద్ర యువతీ సంస్కృత కళాశాల (సదనం) ,శుభోదయం ఇన్ఫరా సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 

వీరిద్దరూ కూడా చదివింది ఇంగ్లిష్ మాధ్యమంలోనే

అయినప్పటికీ సంస్కృతాంధ్ర భాషల్లో అద్వితీయమైన సాధన చేసి, మంచి పట్టు సాధించారు.  

ఈ విలేకరుల సమావేశంలో సదనం కరస్పాండెంట్ బోడా అన్నపూర్ణ శ్రీరామ్,

కార్యదర్శి కోట్ల కనకేశ్వరరావు, ప్రిన్సిపాల్ వి అన్నపూర్ణ, తాతా సందీప్ శర్మ లతో కల్సి బ్రోచర్ ని ఆయన ఆవిష్కరించారు. 
పాలక వర్గ అధ్యక్షులు పొలసానపల్లి

జగ్గారావు సారధ్యంలో పాలకవర్గం ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి వేదిక ఇచ్చారని, అలాగే శుభోదయం ఇన్ఫరా అధినేత డాక్టర్ కలపటపు లక్ష్మి ప్రసాద్ సహాయం

అందిస్తున్నారని ఆయన తెలిపారు. 

రెండు దశాబ్దాల తర్వాత తొలి శతావధానం. . . .

 à°¦à°¾à°¦à°¾à°ªà± రెండు దశాబ్దాల తర్వాత రాజమహేంద్రవరంలో శతావధానం జరుగుతోందని, ఈసారి

యుగళ శతావధానం విభిన్నంగా జరుగబోతుందని డాక్టర్ మహాదేవమణి చెప్పారు. తాతా సందీప్ శర్మ , లలిత్ ఆదిత్య  à°‡à°¦à±à°¦à°°à±‚ కూడా ఇంగ్లీష్ చదువులు చదువుకుని, మక్కువతో అవధాన

ప్రక్రియ నేర్చుకున్నారని ఆయన తెలిపారు. సందీప్ శర్మ నాయనమ్మ దగ్గర పద్యాలూ అలవోకగా నేర్చుకోవడతో అవధాన ప్రక్రియ సులువుగా వంటబట్టిందని అందుకే ఎన్నో

అవధానాలు చేసాడని వివరించారు. అలాగే అమెరికాలో ఉంటున్నది లలిత్ ఆదిత్య ఇంగ్లిష్ తో పాటు సంస్కృతం నేర్చుకుని అలవోకగా పద్యాలు కూడా రాసాడని, అమెరికాలో

కొంతమందికి సంస్కృతం కూడా నేర్పుతున్నాడని, ఏకసంథాగ్రాహి అయిన అతడికి వాట్సాప్ లో పాఠాలు చెప్పడంతో బాగా వంటబట్టించుకున్నాడని ఆయన

వివరించారు. 

వీరిద్దరి కలయికలో యుగళ శతావధానం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అవధాన ప్రక్రియ చాలా కష్టతరమైనదని, దీనికి ధార, పూరణ,ధారణ అనే మూడు అంశాలు

కీలకమని చెప్పారు.  à°¯à±à°—à°³ శతావధానం ప్రారంభ సభ  à°¡à°¿à°¸à±†à°‚బర్ 29 ఉదయం 8.30 గంటలకు  à°®à±Šà°¦à°²à°µà±à°¤à±à°‚ది. రాష్ట్రపతి పురస్కార గ్రహీత, మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ విశ్వనాధ గోపాలకృష్ణ

శాస్త్రి అధ్యక్షత వహిస్తారు.  à°­à°¾à°—వత విరించి డాక్టర్ టివి నారాయణరావు, అసమాన అవధాన సార్వభౌమ డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ ఆశీస్సులు అందిస్తారు. అనంతరం

అవధాన ప్రక్రియ ప్రారంభమై మధ్యాహ్నం 1గంటవరకూ ,ఆలాగే సాయంత్రం 4నుంచి 8à°—à°‚à°Ÿà°² వరకూ జరుగుతుంది. శతావధాని  à°°à°¾à°‚భట్ల పార్వతేశ్వర శర్మ, శతావధాని ఆముదాల మురళి,

అష్టావధాని చెరుకూరి సూర్యనారాయణ శర్మ,  à°¡à°¾à°•à±à°Ÿà°°à± రాయప్రోలు కామేశ్వర శర్మ,డాక్టర్ డిఎస్వి సుబ్రహ్మణ్యం,డాక్టర్ ఉమా రామలింగేశ్వరరావు, పెరుమాళ్ళ రఘునాధ్,

డాక్టర్ ఎస్వీ రాఘవేంద్రరావు, కవితా ప్రసాద్, బంకుపల్లి రమేష్, డాక్టర్ రాంభట్ల వెంకట రాయ శర్మ, శుభకోటి వీరయ్య శర్మ, దశిక కృష్ణమోహన్, ఎం.వి.ఎస్.ఎన్. మూర్తి,

ఎర్రాప్రగడ రామకృష్ణ, డాక్టర్ మేడూరి చినకనకయ్య, సవితాల చక్ర భాస్కరరావు తదితరులు  à°ªà±ƒà°šà±à°›à°•à±à°²à±à°—à°¾ పాల్గొంటారు. 


రెండవ రోజు కూడా ఉదయం 9నుంచి మధ్యాహ్నం

1గంటవరకూ , ఆలాగే సాయంత్రం 4నుంచి 8గంటల వరకూ అవధానం కొనసాగుతుంది. మూడవరోజు 31వ తేదీ సాయంత్రం 4గంటలకు విజయోత్సవ సభ రాష్ట్రపతి అవార్డు గ్రహీత, మహామహోపాధ్యాయ

ప్రాచార్య శలాక రఘునాధ శర్మ అధ్యక్షతన జరుగుతుంది. మహా మహోపాధ్యాయ బ్రహ్మశ్రీ దోర్బల ప్రభాకర శర్మ , సాహితీ బృహస్పతి  à°®à°²à±à°²à°¾à°ªà±à°°à°—à°¡ శ్రీమన్నారాయణ ఆశీస్సులు

అందజేస్తారు.  à°¸à°¿à°¬à°¿à°µà°¿ ఆర్కే శర్మ అభినందనలు తెలుపుతారు. నిషిద్ధాక్షరితో అవధానం మొదలవుతుందని , దీనివలన వేదిక అవధానుల ఆధీనంలోకి వస్తుందని డాక్టర్ మహాదేవమణి

చెప్పారు. నిషిద్ధాక్షరులు మూడు, సమస్యలు 24, దత్తపదులు 24, వర్ణనలు 24, ఆశువులు18, ఘంటావధానాలు 4, అప్రస్తుత ప్రసంగాలు 3 ఉంటాయని వివరించారు.  

బోడా అన్నపూర్ణ శ్రీరామ్

మాట్లాడుతూ ఇలాంటి బృహత్తర సాహితీ కార్యక్రమానికి తమ కళాశాల వేదిక కావడం తమకెంతో ఆనందంగా ఉందన్నారు. వ్యక్తిగతంగా కూడా సహకారం అందిస్తామని చెప్పారు. కోట్ల

కనకేశ్వరరావు మాట్లాడుతూ వందేళ్లలోకి అడుగుపెడుతున్న సదనంలో ఈ కార్యక్రమం జరగడం అభినందనీయమన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam