DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మూడు రాజధానులు . . అబ్బో. .అద్భుతం. . చరిత్ర 

అయితే వినడానికి బాగున్నా..ఆచరణలో ఎలా ఉంటుందో? 

అధికారులు తిరగడానికి రవాణా ఖర్చు ఎవరిదీ ?

కార్లు, కాన్వాయిలు తిరగడానికి డబ్బులు ఎవరిదీ?

దృశ్యం

లేకుంటే. . . సమయం, డబ్బు వృధా. . . :

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, డిసెంబ‌రు 19, 2019 (డిఎన్‌ఎస్‌): కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో మూడు

రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్టు వస్తున్నా ప్రకటనలతో ఎన్నో సందేహాలు వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇదొక సాహసోపేతమైన చర్య, ఒక రికార్డు కాబోతోంది. ఇంతవరకూ

కొన్ని దేశాలను, రాష్ట్రాలకు కేవలం రెండు రాజధానులు మాత్రమే ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ కు మూడు రాజధానులు పెడితే ప్రపంచ చరిత్రలోనే ఇదొక రికార్డు

కానుంది. 

ఇబ్బడి ముబ్బడిగా రవాణా ఖర్చులు 

ఒకటి శాసన సభ కోసం అమరావతి , మరో ఒకటి పరిపాలన కోసం విశాఖపట్నం, ఇంకొకటి న్యాయ పరంగా మరొక నగరాన్ని రాజధానిగా

ప్రకటించడం పై ప్రజల్లో ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. ఒక రకంగా ప్రజలకు, రాష్ట్ర అభివృద్ధి కి అనుకూలంగా ఉన్నప్పటికీ, మూడు విభిన్న ప్రాంతాల్లో ఉండడంతో

ఒక్కొక్క విభాగం తోనూ మరొక విభాగం తో అనుబంధం, అనుసంధానం ఉంటుంది. ఆయా పనుల కోసం వచ్చే అధికారులు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు మూడు ప్రాంతాల మధ్య తిరుగాడక

తప్పని పరిస్థితి. సమీక్షలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించినా, ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా పర్యవేక్షించవలసి ఆవశ్యకత ఉంది. ఈ క్రమం లోనే నిరంతరం సాగే

ఈ ప్రయాణాలతో ప్రజా ప్రతినిధులు, మంత్రుల వెంట నడిచే కార్లు, కాన్వాయిలు కోసం అయ్యే రవాణా ఖర్చు ఎవరు పెడతారో ప్రకటించలేదు. పైగా ప్రతి ఒక్కరూ అన్ని ప్రాంతాలనూ

సందర్శించవలసిన అవసరం ఉంది. చిన్న స్థాయి ఉద్యోగులు కదలవలసిన అవసరం లేదనుకున్న, అసెంబ్లీ సమావేశాలు జరిగిన సమయాల్లో మొత్తం యంత్రాంగం అంతా అమరావతి లోనే

ఉండాల్సిన అవసరం ఉంది. ఇదే న్యాయ పరంగా ఉన్న సమస్యలు పరిష్కారానికై హైకోర్టుకు హాజరు కావాల్సిన అధికారులు విశాఖ నుంచి వందల కిలోమీటర్ల దూరం లో ఉన్న కర్నూల్ కు

వెళ్లాలంటే అదొక ప్రహసనమే. పైగా రవాణా సదుపాయాలు అంతంత మాత్రమే. వీటిని తట్టుకుని వెళ్లాలంటే రవాణా ఖర్చు లు అధికంగానే అవుతాయి. వీటిని ఉద్యోగులను

పెట్టుకోమంటే కష్టసాధ్యం. ప్రభుత్వం ఖజానా ఖాళీగా ఉంది. ఈ ప్రకటన వినడానికి బాగున్నప్పటికీ ఆచరణలో ఎదుర్కోవాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయి. వీళ్ళ కార్లు, ఇతర

రవాణా సాధనాలు నడవాలంటే ఒక్కో విభాగానికి ఒక్కో పెట్రోల్ బంక్ ఏర్పాటు చెయ్యవలసిన అవసరం ఉంటుందేమో. . .

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam