DNS Media | Latest News, Breaking News And Update In Telugu

AU లో మరో వివాదం.. HRM తరగతి గదిలో రాహుల్ బర్త్ డే వేడుకలు

ఏ యూ సిబ్బందికి నిబంధనలు తెలియవా లేక పట్టింపు లేదా ?

విశాఖపట్నం, జూన్ 19 , 2018 (DNS Online ) : అత్యంత ప్రతిష్ఠాత్మక మైన ఆంధ్ర విశ్వ కళాపరిషత్ లో రోజుకో వ్యవహారం వెలుగు

చూస్తున్నా సరిదిద్దుడు కార్యక్రమమే జరగడం లేదన్నది మరో సారి రుజువైంది. మంగళవారం ఆంధ్ర విశ్వ విద్యాలయం హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ విభాగం లో జరిగిన ఒక

శుభకార్యం (కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ 49 à°µ  à°œà°¨à±à°®à°¦à°¿à°¨ వేడుకలు నిర్వహించడం ) వివాదం à°—à°¾ తలెత్తింది. విద్యాలయం నిబంధనల ప్రకారం à°ˆ విద్యా ప్రాంగణం లో

గానీ, భవనాల్లో గానీ ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు గానీ, నేతల వ్యక్తిగత కార్యక్రమాలు గానీ చెయ్యకూడదు. అయితే మంగళవారం హెచ్ ఆర్ ఎం విభాగం లోని తరగతి గదిలో

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ 49 à°µ  à°œà°¨à±à°®à°¦à°¿à°¨ వేడుకలు నిర్వహించడం వర్సిటీ నిబంధనలకు విరుద్ధం అంటూ కొందరు విద్యార్థి సంఘాల ప్రతినిధులు

మండిపడుతున్నారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయడం, వేడుకలు జరుపుకోవడం తప్పు కాదని, తమకు అభ్యంతరం కాదని,  à°…యితే అది యూనివర్సిటీ తరగతి గది లో చేయడాన్ని

తప్పు పడుతున్నామని తెలిపారు. ఈ మేరకు ఏ యూ ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లే ఉద్దేశ్యంలో ఉన్నట్టు తెలిసింది. ఈ కార్యక్రమం లో పాల్గొన్న సీనియర్

అధ్యాపకులు సైతం మద్దతు ప్రకటించి ఈ వేడుకల్లో పాల్గొనడం కొంత ఇబ్బందికరంగా పరిణమించింది. పైగా కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో సానుకూలత పెరిగిందని, ఈ

రాష్ట్రానికి ప్రత్యెక హోదా ఇస్తామని మాటిచ్చిన కాంగ్రెస్ పార్టిని తిరిగి ఆదరిస్తున్నారని అన్నట్టు గా నిర్వాహకులు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో

ప్రచురించడం జరిగింది. 


ఇదే కొత్త కాదు ....

ఏయు ప్రాంగణాల్లో ఈ విధమైన రాజకీయ సంబంధిత కార్యక్రమాలు జరపడం ఇదే కొత్త కాదు, గతం లో ప్రతిపక్ష వైఎస్సార్

కాంగ్రెస్ పార్టీ ఏకంగా పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టడం, ఆపై చీవాట్లు తినడం కూడా జరిగింది. ఇక అధికార తెలుగుదేశం పార్టీ ఏకంగా పార్టీ కార్యకలాపాలు నిర్వహించిన

దాఖలాలూ ఉన్నాయి. అయితే వీరంతా ఏ యూ లోని బహిరంగ  à°ªà±à°°à°¦à±‡à°¶à°‚ లోనూ, మైదాన ప్రాంతాల్లోనూ నిర్వహించారు. à°ˆ రోజు ఏకంగా హెచ్ ఆర్ à°Žà°‚ తరగతి గది లోనే రాహుల్ జన్మ దిన వేడుకలు

జరపడం వివాదం à°—à°¾ మారింది. 

అసలు ఏ యూ లోని తరగతి గదుల్లో రాజకీయ సభలు, జన్మదినం. జరుప వచ్చా? తరగతి గదిలోనే. రాహుల్ బర్త్ డే. కేక్ కోసి,. త్వరలో కాంగ్రెస్ పాలన

వస్తుందంటూ ప్రకటన చె య్య వచ్చా ?  à° యు లో సిబ్బంది యూనివర్సిటీ నిబంధనలు వర్తించవా, లేక వీరికి ప్రత్యేక చట్టాలు ఉన్నాయా ? లాంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

ఇలా ఒక్కరెంటి అందరూ గాడి. తప్పుతున్నారు.

ఇదీ నిర్వాహకులు పంపిన సందేశం : 

ఆంద్ర విశ్వ విద్యాలయం హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ విభాగంలో

కాంగ్రెస్ పార్టి జాతీయ అద్యక్ష్యుడు రాహుల్ గాంధి జన్మదిన వేడుక జరిగింది. ఈ సందర్భం గా ప్రొఫెసర్ ..... . కేక్ కట్ చేసి విద్యార్ది నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ

రాష్ట్రానికి ప్రత్యెక హోదా ఇస్తామని మాటిచ్చిన కాంగ్రెస్ పార్టిని తిరిగి ఆదరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రములో ఎఐసిసి రిసెర్చ్ విభాగం రాష్ట్ర

కోఆర్డినేటర్, ఆంద్ర విశ్వ విద్యాలయం జాక్ కన్వీనర్, కాంగ్రెస్ నాయకులు రంగనాద్ రాయ్, విశాఖ తూర్పు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అద్యక్ష్యులు, రాష్ట్ర

కాంగ్రెస్ కార్యదర్శి à°®à°°à°¿à°¯à± పలువురు విద్యార్దిని విద్యార్దులు పాల్గొన్నారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam