DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ రైల్వే జోన్ సాధ్యం కాదు: రైల్వే మంత్రి.... లేదు త్వరలో వస్తుంది: ఆంధ్ర MLC

మనిషి కో మాట ఇదీ భాజపా తీరు.

నాయీ బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పాల్సిందే : సోమువీర్రాజు

విశాఖపట్నం, జూన్ 19 , 2018 (DNS Online ): విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇవ్వడం

సాధ్యం కాదు అని సాక్షాత్తు కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రకటిస్తే. . . రాజమండ్రి కి చెందిన ఎం ఎల్ సి సోము వీర్రాజు 2019 లోగా వచ్చేస్తుంది అని

ప్రకటిస్తున్నారు.  à°­à°¾à°°à°¤à±€à°¯ జనతా పార్టీ లో మనిషి కో మాట చెప్తుంటే ప్రజల్లో వీళ్లపై పూర్తిగా నమ్మకం పోతుంది అనే భయం కూడా లేకుండా పోయింది. మంగళవారం విశాఖ నగరం

లో నిర్వహించిన విలేకరుల సమావేశం భారతీయ జనతా పార్టీ జాతీయ కమిటీ సభ్యులు, ఆంధ్ర ప్రదేశ్ ప్రచార సమన్వయ కర్త, ఎంఎల్ సి సోము వీర్రాజు à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ తమకు మరో ఏడాది

కాలం గడువు ఉందని ఆ లోగా విశాఖ రైల్వే జోన్ వస్తుంది అని ప్రకటించారు. అయితే ఈయన ప్రకటన చేయడానికి కేవలం 24 గంటల ముందే సాక్షాత్తు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఆంధ్ర

ప్రదేశ్ విభజన బిల్లు లో ఆంధ్ర కు రైల్వే జోన్ ఇవ్వమని లేదని, ఇవ్వడానికి సాధ్యాసాధ్యాలు పరిశీలించామని మాత్రమే ఉందన్నారు. దాని అర్ధం ఇవ్వమని కాదంటూ పత్రికా

ముఖంగా చేసిన ప్రకటన ఆంధ్రా లో బీజేపీ ని మరింత పాతాళానికి తొక్కేసే విధంగా మారింది. అయితే ఒక్కరోజు అనంతరం సోము వీర్రాజు ఇదిగో రైల్వే జోన్ వచ్చేస్తుంది అని

ప్రకటన చేస్తే వీళ్ళని ఏమనుకోవాలి. 

కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై సైతం కేంద్రం సాధ్యం కాదు అని తేల్చినా, సోము వీర్రాజు సానుకూల ప్రకటన వస్తుంది అని

చెప్పడం వెనుక బీజేపీ రెండు నాల్కల ధోరణి కనపడుతోంది. కేంద్రం లో క్యాబినెట్ మంత్రులుగా ఉన్న వారు కేంద్రం తీసుకున్న నిర్ణయాలు స్పష్టంగా ప్రకటిస్తుంటే...

 à°†à°‚ధ్రా లో ఉన్న à°’à°• సాధారణ à°Žà°‚ ఎల్ సి అవి తప్పని, వాటిపై సానుకూల ప్రకటన వస్తుంది అని చెప్పడం అంటే ఎలా సాధ్య పడుతుందో తెలియదు. 

అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి

చంద్రబాబు నాయుడు పై విరుచుకు పడ్డారు. సమస్యలను పరిష్కరించమని నాయి బ్రాహ్మణులూ సచివాలయానికి వస్తే వారిపై బెదిరింపులు, హెచ్చరికలు జారీ చేసిన ఏకైక

ముఖ్యమంత్రి ఇతనే అన్నారు. తక్షణం వారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం నిర్మాణ క్రమం లో జరిగిన అవినీతిపై బహిరంగ విచారణకు సిద్ధమా అని

సవాల్ విసిరారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam