DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కాళహస్తి లో  సూర్య గ్రహణ కాలం లో రాహు కేతు పూజలు, 

(DNS రిపోర్ట్ : DSN మూర్తి, ప్రత్యేక ప్రతినిధి, శ్రీకాళహస్తి): 

శ్రీకాళహస్తి, డిసెంబ‌రు 26, 2019 (డిఎన్‌ఎస్‌) : గురువారం సూర్యగ్రహణం సందర్బంగా రాష్ట్రం లోని అన్ని

ఆలయాలనూ మూసివేయడం జరిగింది. అయితే దేశ వ్యాప్తంగా తెరిచి ఉంచి, ఆరాధనలు, అభిషేకాలు జరిగే ఏకైక ఆలయం ఒక్క శ్రీకాళహస్తి కావడం గమనార్హం. గురువారం ఉదయం గ్రహణ

సమయంలో శ్రీకాళ హస్తి లో ని శ్రీ జ్ఞాన ప్రసూనాంబ  à°…మ్మ వారి ఉత్సవ మూర్తి ని తిరువీధుల్లో అర్చక బృందం ఊరేగించారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వరుని ఆలయం లో స్వామికి

ప్రత్యేక అభిషేకాలు, జప తపాదులు నిర్వహించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులచే రాహు, కేతు దోష నివారణా పూజలు నిర్వహింపచేసారు. 
ఈ నెల 26. గురువారం ఉదయం 8.08 గంటల నుండి

"సూర్యగ్రహణం" సందర్భంగా ఆలయం గ్రహణ సమయంలో ప్రత్యేక ఆరాధనలు, జపతపాలు నిర్వహిస్తున్నట్టు శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థానము కార్యనిర్వహణాధికారి ఓ

ప్రకటనలో తెలియచేసారు. 
గ్రహణ కాలము: కేతుగ్రహస్త పాక్షిక సూర్య గ్రహణము. స్పర్శకాలం :ఉ.8.08 ని.లకు, మధ్యకాలం:ఉ.9.33 ని. లకు, పూర్తి అయ్యే మోక్షకాలం :ఉ.11.16 ని.లకు

ఉంటుందన్నారు. ఈ సందర్బంగా గురువారం ఉదయం 5.00 గంటలకు 1వ కాలము అభిషేకం, ఉదయం 6.00 గంటలకు 2వ కాలము అభిషేకం, ఉదయం 8.10 గంటలకు గ్రహణకాలాభిషేకము, మధ్యాహ్నం 12.00 గంటలకు

మూడవకాలాభిషేకము, సాయంత్రం 4.00 గంటలకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఆలయంలో జరుగుతాయన్నారు. à°ˆ అభిషేకములు అన్ని దేవస్థానం తరుపున నిర్వహించబడును.  à°°à°¾à°¹à±

కేతు పూజలు యధావిధిగా జరుగుతాయని, మిగిలిన ఆర్జిత సేవలు అన్నియు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam