DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖకె నా ఓటు, పార్టీ అవసరం లేదు : మాజీ ఎమ్మెల్యే రెహమాన్

గ్రేటార్ విశాఖ ను భ్రష్టు పట్టించింది చంద్రబాబే, నిధుల్లేవు 

తెలుగు దేశానికి నగర అధ్యక్షుడు రెహమాన్ రాజీనామా. . .

రైతులకు చంద్రబాబు క్షమాపణ

చెప్పాలని డిమాండ్‌

పార్టీ ని భూస్థాపితం చేసింది లోకేషే. . క్యాడరంటే విలువలేదు  .  .   

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం ): . . .

విశాఖపట్నం, డిసెంబ‌రు 26, 2019

(డిఎన్‌ఎస్‌): తెలుగుదేశం పార్టీ à°•à°¿ విశాఖ నుంచి కోలుకోలేని గట్టి దెబ్బ తగిలింది.  à°µà°¿à°¶à°¾à°– నగర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రెహమాన్‌ పార్టీకి రాజీనామా చేశారు.

గురువారం నిర్వహిచిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ తనకు పార్టీ కంటే విశాఖ నగర అభివృద్దే ముఖ్యం అన్నారు. ముఖ్యమంత్రి విశాఖ నగరాన్ని కార్యనిర్వహణా

రాజధాని గా ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. దీనిపై పార్టీ తో పూర్తి విభేదిస్తున్నట్టు తెలిపారు. చంద్రబాబు పుత్ర రత్నం లోకేష్ రాకతో పార్టీ

పూర్తి గా దెబ్బతిందని, లోకేష్ వలన నాయకులు, కార్యకర్తలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఇతనికి అనుకూలంగా ఉన్న కొంతమంది నాయకులు అభివృద్ధి చెందారు తప్ప

సామాన్య నాయకులు, కార్యకర్తలు నష్ట పోయారని మండిపడ్డారు. పౌరసత్వ బిల్లు పై చంద్రబాబు తన వైఖరి ఇప్పడి వరకూ ప్రకటించలేదన్నారు. ఇదే విషయం పై విశాఖ కు చెందిన

యువకుడు చంద్రబాబు ను ప్రశ్నిస్తే తరువాత మాట్లాడుదాం అని మాట దాటవేసారు.  

ముఖ్యమంత్రి చేసిన మూడు రాజధానులు ప్రతిపాదన ను ఖండించమని పార్టీ తరపున  

ఆదేశించారు. అయితే విశాఖ కు రాజధాని ఇస్తానంటే మేము ఎందుకు ఖండించాలి. విశాఖకు రాజధాని వస్తే మరింత అభివృద్ధి చెందుతుంది. 

విశాఖ అభివృద్ధి ని దెబ్బ

తీసింది చంద్రబాబే. . .

విశాఖ కార్పొరేషన్‌కు కేంద్రం నుంచి నిధులు రాకుండా చేసింది చంద్రబాబేనని ఆరోపించారు. నగర అభివృద్ధి పై కంటే లోకేష్ వ్యాపార వైఖరికే

ప్రాధాన్యత ఇచ్చారన్నారు. నగరాభివృద్ధి కై కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాకుండా చేసి, నిధుల మరలింపు కూడా చేసారని మండిపడ్డారు. పైగా ఓడిపోతామనే భయంతోనే

జీవీఎంసీ ఎన్నికలను సైతం బహిక్షరించిన ఘనత బాబుదేనన్నారు. 

రాజధాని భూములను సేకరణలో బాబు రైతులను మోసగించిందని, తక్షణం రైతులకు చంద్రబాబు క్షమాపణ

చెప్పాలన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam