DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎప్పటికైనా ప్రజా రాజధాని అమరావతే : చంద్రబాబు 

ఎప్పటికైనా ప్రజా రాజధాని అమరావతే : చంద్రబాబు 

రాష్ట్రానికి కావాల్సిన ఆదాయ వనరుల్ని ఇచ్చే రాజధాని 

నిర్మాణాలు లేక పొతే ఇంతకాలం ఎక్కడున్నారు ?

 

గ్రూప్ 1 అధికారి ని పెద్ద ఎక్స్పర్ట్ à°—à°¾ చూపిస్తున్నారు 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, డిసెంబ‌రు 27, 2019 (డిఎన్‌ఎస్‌) :

ఎప్పడికినా ప్రజా రాజధాని అమరావతి మాత్రమేనని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియచేసారు. శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ 13

జిల్లాల అభివృద్ధికి కావాల్సిన ఆదాయ వనరుల్ని సమకూర్చే రాజధాని ఇదేనన్నారు. అధికార పార్టీలో మనిషి కో మాట మాట్లాడుతూ ప్రజల్ని, అధికారుల్ని గందరగోళానికి

గురిచేస్తున్నారన్నారు. అభివృద్ధి చేసి సంపద సృష్టిస్తే అది రాష్ట్రానికి ఆదాయ మార్గం అవుతుందన్నారు. హైద్రాబాద్ లాంటి నగరాన్ని నిర్మిస్తే రాష్ట్రానికి

సరిపడా ఆదాయం అదే ఇస్తుందన్నారు. దీనికి నిదర్శనమే హైదరాబాద్ అన్నారు. తెలంగాణ మొత్తం ఆదాయం లో  65 శాతం  à°†à°¦à°¾à°¯à°‚ హైదరాబాద్ నుంచే వస్తోందని,  à°®à±à°‚బై, బెంగళూరు, చెన్నై

ఆయా రాష్ట్రాలకు ఆర్థిక వనరులుగా తయారయ్యాయి - రాజధానిపై ప్రభుత్వం ఏడు నెలలుగా మీనమేషాలు లెక్కిస్తోంది - ఐదు కోట్ల మంది ఆంధ్రులు ఆలోచించాల్సిన అవసరం

ఉందన్నారు.

అమరావతిలో తొమ్మిది వేల కోట్లకుపైగా పనులు చేపట్టాం - డబ్బులు లేకుండా రాజధానిని కట్టాలనే ఆలోచనలో భాగమే ల్యాండ్ పూలింగ్ - రైతులు స్వచ్ఛందంగా 33

వేల ఎకరాలు ఇచ్చారు - భూములు ఇచ్చిన రైతులకు ఆమోదయోగ్యమైన ప్యాకేజీ ఇచ్చాం - రాజధానిలో భూమిలేని వారికి రూ.2500 పెన్షన్ ఇచ్చాం - ఈ విధానాన్ని ప్రపంచం మొత్తం అధ్యయనం

చేసే పరిస్థితి కల్పించాం - డబ్బులు లేకపోతే ఇక్కడే అన్ని సౌకర్యాలు ఉన్నాయి - వైసీపీ నేతలు ఇక్కడి నుంచే పాలన చేయొచ్చు కదా అని సూచించారు.

నిర్మాణాలు లేక

పొతే ఇంతకాలం ఎక్కడున్నారు ? . . .  

రాజధానిలో మా ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టకపోతే గత ఏడూ నెలలుగా తమరు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. అసెంబ్లీ లేకపోతే ఎక్కడ

సమావేశాలు పెట్టారు? ప్రస్తుతం కేబినెట్ సమావేశం శ్మశానంలో పెట్టారా ? అని ప్రశ్నించారు. 

ఇక్కడ రైతులు ఉదారంగా ఇచ్చారు - అన్ని ఆవసరాలు పోగా 10 వేల ఎకరాల భూమి

ప్రభుత్వం వద్ద ఉంది - à°ˆ భూమిని అమ్మగా వచ్చిన డబ్బుతో మహానగరం నిర్మించేవాళ్లం - భూమి అమ్మిన డబ్బులనే అమరావతికి ఖర్చు చేస్తున్నాం - బ్యాంక్‍à°² ద్వారా తక్కువ

వడ్డీకి తెచ్చి పనులు చేపట్టాం - దేశ చరిత్రలో రాజధాని మార్పు ఎక్కడా జరగలేదు - అన్ని ప్రాంతాలకు సమానదూరంలో అమరావతి పెట్టాం - రాజధానిపై శాస్త్రీయంగా నిర్ణయం

తీసుకున్నాం - అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు చేశాం - విశాఖను ఐటీ, ఫార్మా, హబ్‍à°—à°¾ అభివృద్ధి చేయాలనుకున్నాం - 

డేటా సెంటర్ ను ఎందుకు రద్దు చేసారు ? . .

.

విశాఖపై మీకు ప్రేమ ఉంటే డేటా సెంటర్‍ను ఎందుకు రద్దు చేశారు - ఆదానీ గ్రూప్ వచ్చి ఉంటే నాలుగైదు ఏళ్లలో విశాఖ.. హైదరాబాద్‍కు సమానంగా ఉండేది - à°“ కంపెనీని

తేవడం చాలా కష్టం, వెళ్లగొట్టడం ఈజీ - ఫార్చూన్ 500 కంపెనీలకు కేంద్రంగా విశాఖను చేయాలనుకున్నాం - విశాఖలో మెట్రో కూడా శ్రీకారం చుట్టాం.. కానీ అడ్డుపడ్డారన్నారు.

 

అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అనే లక్ష్యం తో  à°¤à°¿à°°à±à°ªà°¤à°¿ లో హార్డ్ వేర్, ఎలక్ట్రానిక్స్ హబ్ చేయాలనుకున్నాం - రిలయన్స్ సంస్థ వెనక్కి వెళ్లిపోయింది -

ప్రపంచంలో మూడు రాజధానులు ఎక్కడైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. 

అమరావతి బంగారు గుడ్డు పెట్టే బాతు - డబ్బులు ఉంటే హైదరాబాద్‍ను అభివృద్ధి చేశామా? - తెలంగాణకు

హైదరాబాద్ ఉంది, కర్ణాటకకు బెంగళూరు ఉంటే మనకు ఒక అమరావతి అవసరం లేదా? - మన పిల్లల భవిష్యత్ అవసరం లేదా? - ఉపాధి కోసం హైదరాబాద్ పోవాలా? అని ముఖ్యమంత్రి ని సూటిగా

ప్రశ్నించారు.  

గ్రూప్ 1 అధికారి ని పెద్ద ఎక్స్పర్ట్ à°—à°¾ చూపిస్తున్నారు . . . . 

జి ఏన్ రావు అనే  à°’à°• సాదా సీదా గ్రూప్ 1 అధికారి ని పట్టుకుని పెద్ద అంతర్జాతీయ

నిపుణునిగా చూపిస్తున్నారని మండిపడ్డారు. జి ఏన్ రావు అనే వ్యక్తి ఎవరో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన తనకు చెప్పనక్కరలేదన్నారు.  à°…తను ఏ రంగంలో

నిపుణుడా చెప్పాలని డిమాండ్ చేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam