DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అమెరికా అబ్బాయి రాజమండ్రి లో శతావధానం అదరహో . .

సాహితి కళా రాజధాని లో అబ్బుర పరుస్తున్నశతావధానం   

లలితంగా సాగుతున్న యువ అవధాని శతావధాని ప్రతిభ 

ఉండేది అమెరికా - చదివింది ఆంగ్లం - చేసేది

తెలుగులో అవధానం. .

సదనం శతవర్ష వేడుకల్లో లలిత్ ఆదిత్య శతావధానం ఆరంభం . . .  

రెండు పుష్కరాల తర్వాత తొలి శతావధానం ఇదే : మహదేవమణిi  .

నారసింహ ఉపాసకుడు

అక్షరాలతో అలవోకగా. . . అవధాని. . .

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి) 

అమరావతి, డిసెంబ‌రు 29, 2019 (డిఎన్‌ఎస్‌) : à°† యువకుడు ఉండేది అమెరికాలో. . చదువు పూర్తిగా

ఆంగ్ల మాధ్యమం. . . చేసే ప్రక్రియ మాత్రం అచ్చ తెలుగులో శతావధానాలు. ఇదే యువ అవధాని గన్నవరం లలిత్ ఆదిత్య.  à°¤à±†à°²à±à°—ు భాషాభిమానులకు పరిచయం అవసరం లేని పేరు ఇది. ఇటీవల

కాలం లో అటు అమెరికాలోనూ, ఇటు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ తన అవధాన ప్రతిభతో అందరినీ అబ్బుర పరుస్తున్న చిరంజీవి కళలకు కాణాచిగా పేరు గాంచిన, ఆంధ్ర

ప్రదేశ్ సాహితీ రాజధాని రాజమహేంద్రవరం లో 
తన శతావధాని ప్రక్రియ తో ఆకట్టుకుంటున్నారు. 

సదనం శతవర్ష వేడుకల్లో . . . :

దాదాపు రెండు పుష్కరాల తర్వాత

 à°°à°¾à°œà°®à°¹à±‡à°‚ద్రవరంలో జరుగుతున్న తోలి శతావధానం ఇదేనని, ప్రముఖ అవధాని, శతావధాని లలిత్ ఆదిత్య ఆచార్యులు డాక్టర్ మహాదేవ మణి తెలియచేసారు.  

రాజమహేంద్రవరం లోని

ఆంధ్ర మహిళా సంస్కృత కళాశాల (సదనం) వేదిక à°—à°¾ జరుగుతున్న à°ˆ  à°¶à°¤à°¾à°µà°§à°¾à°¨  à°¸à°¾à°¹à°¿à°¤à±€ యజ్ఞం కు శుభోదయం ఇన్ఫరా సంస్థ సహకారం అందిస్తోందన్నారు. సదనం కళాశాల శతవర్ష వేడుకల్లో

భాగంగా à°ˆ అవధాన యజ్ఞం జరుగుతోందని తెలిపారు. ఆదివారం ఆరంభమైన à°ˆ శతావధానం మరో యువ అవధాని సందీప్ శర్మ  à°¤à±‹ కలిసి యుగళ అవధానం జరగాల్సి యుందన్నారు. అయితే కొన్ని

వ్యక్తిగత కారణాల వల్ల సందీప్ పాల్గొనలేకపోతున్నట్టు తెలిపారు. దీంతో లలిత్ పూర్తి స్థాయి లో శతావధానము చేస్తున్నట్టు తెలిపారు. 

అమెరికా దేశంలో నివాసం

ఉంటున్న à°ˆ అవధాన కిశోరం గన్నవరం లలిత్ ఆదిత్య శతావధానం à°ˆ నెల 31తేదీ వరకూ  à°¸à°¾à°—ుతుందన్నారు. ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం రెండు విభాగాలుగా సాగుతుందని, నగర వాసులు,

సాహితి అభిమానులు పెద్ద సంఖ్యలో 
పాల్గొనాల్సిందిగా అహ్వాహిస్తున్నారు. 

రాష్ట్రపతి పురస్కార గ్రహీత, మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ విశ్వనాధ గోపాలకృష్ణ

శాస్త్రి అధ్యక్షత వహిస్తూ, తిరుపతి వెంకట కవులు మొదలుకుని ఎందరో సాహితీ మూర్తులు గోదావరి తీరంలో  à°¶à°¤à°¾à°µà°§à°¾à°¨à°¾à°²à± నిర్వహించారని చెప్పారు. ఆయా అవధానుల

గొప్పతనాన్ని ప్రస్తావించారు.  à°¦à°¾à°¦à°¾à°ªà± 25ఏళ్ళ తర్వాత ఇప్పుడు శతావధానం జరగడం అభినందనీయమని  à°…న్నారు. à°šà°¿ లలిత్ ఆదిత్య నిర్వహిస్తున్న శతావధానం సర్వ జన మనోహరంగా

సాగాలని ఆకాక్షింస్తూ ఆశీర్వదించారు. 

భాగవత విరించి డాక్టర్ టివి నారాయణరావు ఆశీస్సులు అందిస్తూ,ఈ శతావధానం అంత్యంత సుందరంగా,లలితంగా సాగి,విజయోత్సవం

జరుపుకోవాలన్నారు. అసమాన అవధాన సార్వభౌమ డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ ఆశీస్సులు అందిస్తూ, నిత్య నారసింహ ఉపాసకుడైన లలిత్ ఆదిత్య త్రిసంధ్యా గాయత్రి

చేస్తూ, అమ్మవారి అనుగ్రహంతో సంస్కృతాంధ్ర భాషల్లో పరిణతి చెందాడని పేర్కొన్నారు. ఈ శతావధానాన్ని విజయవంతంగా చేయగలడని పేర్కొన్నారు.

   à°¸à°¦à°¨à°‚

కరస్పాండెంట్ బోడా అన్నపూర్ణ శ్రీరామ్ మాట్లాడుతూ ఇలాంటి బృహత్తర సాహితీ కార్యక్రమానికి తమ కళాశాల వేదిక కావడం తమకెంతో ఆనందంగా ఉందని, ఇలాంటి కార్యక్రమం

పెట్టడంతో à°ˆ సంస్థ పులకించిపోతోందని అన్నారు. 

సదనం పాలక వర్గ అధ్యక్షుడు పొలసానపల్లి జగ్గారావు మాట్లాడుతూ ఇంతమంది పండితులు ఇక్కడికి రావడం చాలా

ఆనందంగా ఉందన్నారు. 1920లో స్త్రీ విద్య కోసం స్వర్గీయ నాళం రామలింగయ్య నెలకొల్పిన ఈ సంస్థ 1931లో విద్యా సంస్థగా మారిందని,1955లో ఎయిడ్ వచ్చిందని వివరిస్తూ, ప్రస్తుతం

రిటైరైన వారి స్థానంలో కొత్తగా రిక్రూట్ మెంట్ లేకపోవడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటోందని చెప్పారు.  

సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ వి అన్నపూర్ణ మాట్లాడుతూ

ఇంతమంచి కార్యక్రమం ఇక్కడ జరగడం,ఇంతమంది మహనీయముల సరసన ఉండే భాగ్యం కలిగినందుకు ఎంతోఆనందంగా ఉందన్నారు.   కోట్ల కనకేశ్వరరావు మాట్లాడుతూ వందేళ్లలోకి

అడుగుపెడుతున్న సదనంలో ఈ కార్యక్రమం జరగడం అభినందనీయమన్నారు.


సంచాలకులుగా వ్యవహరించిన ప్రవచన రాజహంస డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ అవధాని

గురించి వివరించారు.  

శతావధానం జరిగే ప్రక్రియ ఇదే :  . . 

నిషిద్ధాక్షరులు మూడు, సమస్యలు 24, దత్తపదులు 24, వర్ణనలు  24, ఆశువులు18,  à°˜à°‚టావధానాలు 4, అప్రస్తుత

ప్రసంగాలు 3 ఉంటాయి టాయని వివరించారు. 

పృచ్ఛకులు వీరే : . . 

శతావధాని పుల్లాభట్ల శాంతి, శతావధాని  à°°à°¾à°‚భట్ల పార్వతేశ్వర శర్మ, శతావధాని ఆముదాల మురళి,

అష్టావధాని  à°šà±†à°°à±à°•à±‚à°°à°¿ సూర్యనారాయణ శర్మ, డాక్టర్ రాయప్రోలు కామేశ్వర శర్మ, డాక్టర్ డిఎస్వి సుబ్రహ్మణ్యం, డాక్టర్ ఉమా రామలింగేశ్వరరావు, పెరుమాళ్ళ రఘునాధ్,

డాక్టర్ ఎస్వీ రాఘవేంద్రరావు, కవితా ప్రసాద్, బంకుపల్లి రమేష్, డాక్టర్ రాంభట్ల వెంకట రాయ శర్మ, శుభకోటి వీరయ్య శర్మ, దశిక కృష్ణమోహన్, ఎం.వి.ఎస్.ఎన్. మూర్తి,

ఎర్రాప్రగడ రామకృష్ణ, డాక్టర్ మేడూరి చినకనకయ్య, సవితాల చక్ర భాస్కరరావు తదితరులు  à°ªà±ƒà°šà±à°›à°•à±à°²à±à°—à°¾ పాల్గొంటున్నారు. 

అతిధులను సదనం పక్షాన సత్కరించారు.

 à°…నంతరం శతావధాని ప్రక్రియ ఆరంభమైంది. పలువురు సాహితీ ప్రియులు, పండితులు హాజరయ్యారు. 

31à°µ తేదీ వరకూ ప్రతిరోజూ ఉదయం 8.30 à°—à°‚à°Ÿà°² నుంచి  à°®à°§à±à°¯à°¾à°¹à±à°¨à°‚ 1 à°—à°‚à°Ÿ  à°µà°°à°•à±‚, ఆలాగే

సాయంత్రం 4 à°—à°‚à°Ÿà°²  8 à°—à°‚à°Ÿà°² వరకూ జరుగుతుంది. చివరిరోజు సాయంత్రం 4 గంటలకు విజయోత్సవ సభ జరుగుతుంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam