DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇంకా బ్రతికి ఉన్నాం అని చెప్పేందుకే ప్రతిపక్షాల విమర్శలు 

సిఏఏ పై విమర్శలపై బీజేపీ అధికార ప్రతినిధి దినకర్ మండిపాటు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం) : . . .

విశాఖపట్నం, డిసెంబ‌రు 30, 2019 (డిఎన్‌ఎస్‌): à°ˆ దేశం లో ఇంకా

తాము బ్రతికి ఉన్నాం అని చెప్పుకునేందుకు కాంగ్రెస్, వామపక్షాలు సహా ఇతర ప్రతిపక్షాలు సీఏఎ , ఎన్ ఆర్ సి  à°²à°¨à± విమర్శిస్తున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర

అధికార ప్రతినిధి లంక దినకర్ మండిపడ్డారు. సోమవారం నగరం లోని పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ పౌరసత్వ సవరణ చట్టం (CAA) - 2019 పై

కాంగ్రెస్, వామపక్షాలు లేని పోనీ అభూత కల్పనలు చేసి, నిరసనలు చెయ్యడంతో ప్రజల్లో à°’à°• భయానక వాతావరణం కల్పించారన్నారు. భారత్‌కు పొరుగున ఉన్న పాకిస్థాన్,

అప్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల్లో మతపరమైన హింసకు గురై మన దేశానికి శరణార్థులుగా 2014 డిసెంబర్ 31లోగా వచ్చిన వారికి భారత పౌరసత్వం కల్పిస్తుందని తెలిపారు. ఈ చట్టం

వలన భారత దేశంలో నివసిస్తున్న వివిధ మతాలకు చెందిన పౌరుల హక్కులకు ఎటువంటి భంగం కలుగదని, పౌరసత్వ సవరణ చట్టం వలన శరణార్థులను గుర్తించి వారికి పౌరసత్వం

కల్పించడం జరుగుతుందని, అలాగే ఈ చట్టం అమలు చేయడం వలన దేశంలోకి అక్రమంగా చొరబడుతున్న తీవ్రవాదులకు అడ్డుకట్ట వేయడం సులువవుతుందని చెప్పారు. కానీ కాంగ్రెస్,

కమ్యూనిస్ట్ పార్టీలు ఈ చట్టంపై దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు. విభజన సమయంలో అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రు పాకిస్థాన్ ప్రధానమంత్రి లియాఖత్

అలీఖాన్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం అల్పసంఖ్యాక వర్గాలకు భద్రతా కల్పించాల్సి ఉండగా పాకిస్థాన్ ఆ ఒప్పందానికి తూట్లు పొడిచి అల్పసంఖ్యాక వర్గాలపై దారుణ

అత్యాచారాలు జరపడం వలన ఆ దేశ జనాభాలో మైనారిటీ ప్రజల నిష్పత్తి తగ్గిపోయి వారు శరణార్థులుగా భారతదేశానికి వచ్చారు. ఈ చట్టం వలన వారికీ సాంత్వన చేకూరుతుందని, 2003 లో ఈ

చట్టం కోసం మాజీ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్ లో కోరగా,  à°•à°¾à°‚గ్రెస్ ప్రభుత్వం à°ˆ చట్టాన్ని వ్యతిరేకించడం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం అని ఆయన

అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం CAA కు ముఖ్యమంత్రి శ్రీ YS జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ప్రకటించగా, ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా గారు ఈ చట్టానికి వ్యతిరేకంగా

మాట్లాడటంపై ముఖ్యమంత్రి గారు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసారు. à°ˆ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు GC నాయుడు, నగర ప్రధాన కార్యదర్శి A కేశవకాంత్,  K ధనుంజయ నాయుడు

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam