DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ముందున్నవి అన్నీ మంచి రోజులే: న్యాయవాది పోతుకూచి

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, జనవరి  01, 2020 (డిఎన్‌ఎస్‌) : ఆలోచన మంచిదయితే ముందున్నవి అన్నీ మంచి రోజులేనని, ప్రముఖ న్యాయవాది, తొంభై ఒక్క

సంవత్సరాల వయో వృద్ధులు పోతుకూచి సూర్యనారాయణ మూర్తి తెలియచేసారు. తెలుగు సంవత్సరాది అయినా, ఆంగ్ల సంవత్సరాది అయినా జీవన ప్రయాణానికి అన్నీ మంచిరోజులే అని, వేల

పుస్తకాలు చదివిన ప్రముఖ న్యాయవాది, తొంభై ఒక్క సంవత్సరాల విద్యా, వయో వృద్ధులు పోతుకూచి 
అన్నారు. కాలమాన ప్రయాణానికి, రెండు సంవత్సరాలూ  à°•à±€à°²à°•à°‚à°—à°¾ మారాయని‌ ఆయన

అన్నారు. 

ఆంగ్ల సంవత్సరాది ఉదయం ప్రముఖ స్వచ్చంద సంస్ధ "అరోధృతి " పోతుకూచిని దానవాయిపేటలో సత్కరించింది. ఈ సందర్భంగా పోతుకూచి మాట్లాడుతూ, వినాయక చవితి,

శ్రీరామ నవమి, సుబ్రహ్మణ్య షష్టి, అంటూ హిందూ దేవతల పేరిట మంచి రోజులను ప్రస్తావిస్తామని చెప్పారు.
అనేక దశాబ్దాలుగా న్యాయవాద వృత్తిలో ఉన్న తనకు క్లయింట్ ల

కంటే, విద్యార్ధు లే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. ఇంతవరకూ తాను పదిహేను వేల పుస్తకాలు చదివి ఉంటానని వెల్లడించారు. జ్ఞానాన్ని పెంచుకునేందుకు, పుస్తకాలే అసలైన

నేస్తాలని పోతుకూచి చెప్పారు.
బ్రౌను నిర్వాహకుడు సన్నిధానం శాస్త్రి పోతుకూచిని సన్మానించారు. అరోధృతి వ్యవస్ధాపకురాలు కోసూరి చండీప్రియ, మాజీ కార్పొరేటర్

రెడ్డి పార్వతి, ధన్వంతరి ఫౌండేషన్ మేనేజర్ సూర్యలక్ష్మి, హెల్పింగ్  à°¹à±à°¯à°¾à°‚డ్స్ వ్యవస్దాపకులు అనుప్ జైన్, బిల్డర్ రెడ్డి సతీష్, శుభోదయం ఇన్ ఫ్రా రవి,

ఉపాధ్యాయుడు  à°¶à±à°°à±€ బీవీఎస్ ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam