DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉపమాక లో వైభవంగా ధనుర్మాసోత్సవాలు 

హంస వాహనంలో స్వామి వారి తిరువీధిసేవ

(DNS రిపోర్ట్ : కళ్యాణి CSV , స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, జనవరి  02, 2020 (డిఎన్‌ఎస్‌) : విశాఖ జిల్లా నక్కపల్లి

మండలంలోని ఉపమాక శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నెల రోజుల పాటు జరుగుతున్న ఈ వేడుకల్లో భాగంగా 18 వ రోజు ఆలయంలో నిత్య

పూజలు  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚à°šà°¿à°¨ తరువాత ఉభయదేవేరులతో స్వామి వారిని హంసవాహనపైన ఆండాళ్ అమ్మవారిని పల్లకీలోను వేంచేపుచేసి గ్రామ తిరువీధిసేవ నిర్వహించారు.

తిరుమల

తిరుపతి దేవస్థానముల ( టిటిడి) అధీనంలో నిర్వహించబడుతున్న ఈ ఆలయం లో అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా అర్చనలు, ఆరాధనలు, సేవలు తిరుమల తరహాలోనే వైభవంగా

జరుగుతుంటాయి.

అంతకు ముందు తెల్లవారుఝామునే సుప్రభాత వేళల్లో తిరుప్పావై గోష్ఠి, సేవాకాలం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. 
అనంతరం ఆండాళ్ అమ్మవారి

ఆలయంలో ప్రత్యేక నీరాజన మంత్రపుష్పాలు, తీర్ధగోష్ఠి, ప్రసాద వినియోగం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఉదయం కూరపాటి రోహిణి చే ధనుర్మాస వ్రత వైభవం

ప్రవచనం నిర్వహించారు. మద్యాహ్నం అన్నమాచార్య ప్రాజెక్టు, ధర్మప్రచార పరిషత్తు వారిచే అన్నమయ్య కీర్తనలు , హరికధలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు

గొట్టుముక్కల వర ప్రసాదాచార్యులు , కృష్ణమాచార్యులు , సిబ్బంది రాజశేఖర్ , గ్రామానికి చెందిన నున్న సుభాష్ , సిద్దాబత్తుల కృష్ణ , పలువురు భక్తులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam