DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అవుట్ సోర్సింగ్ వారికి అమ్మఒడి వర్తించదా?

జిల్లా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం మండిపాటు 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, జనవరి  04, 2020 (డిఎన్‌ఎస్‌) :

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న తమ పిల్లలకు సమగ్ర శిక్ష లో పనిచేస్తున్న ఉద్యోగులకు అమ్మ ఒడి వర్తించదని ప్రకటించడం పై శ్రీకాకుళం

జిల్లా సమగ్ర శిక్ష ఒప్పంద, పొరుగు సేవలు, తాత్కాలిక ఉద్యోగస్తుల సంఘం మండిపడింది. ఈ మేరకు శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఈ సంఘం అధ్యక్షులు గంగు వెంకటరమణ,

ప్రధాన కార్యదర్శి గుండ బాల మోహన్ మాట్లాడుతూ తామంతా తాత్కాలిక, చిన్న స్థాయి ఉద్యోగులమని, ప్రభుత్వ 
ఉద్యోగుల పరిధిలోకి రామని తెలిపారు. సామాన్యులకు సైతం

అమ్మఒడి వర్తిస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ చిన వీరభద్రుడు శుక్రవారం ఒక ప్రకటన విడుదల

చేయడాన్ని తప్పుపడుతున్నారు. ఈ ప్రకటన చిన్న స్థాయి, తాత్కాలిక ఉద్యోగులను శిక్షించడం లాంటిదేనన్నారు. ఇప్పటికే తమకు 10, 000, 12,000 నెలసరి ఆదాయం ఇస్తున్నారని ఈ ఆదాయంతో తమ

కుటుంబం పోషణ ఏ మాత్రం సక్రమంగా నిర్వహించ లేక పోతున్నామని తెలిపారు. ప్రభుత్వ పధకాలు తమకు వర్తించక పొతే తమ భవిష్యత్ ఏంటని ప్రశ్నించారు. సంక్రాంతి

సమీపిస్తున్న ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాలు జీతాలు జమ చేయక పోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ముఖ్యంగా కేజీబీవీ కళాశాలలో పనిచేస్తున్న మహిళ

లెక్చరర్లకు గత ఐదు నెలలుగా జీతం అందకపోవడంతో కుటుంబము అప్పులు పాలు అయ్యిందన్నారు. అదేవిధంగా ఈ ప్రాజెక్టులో గత ఎనిమిది సంవత్సరాల నుండి ప్రభుత్వ పాఠశాలలో

 à°’ప్పంద ఉద్యోగస్తులుగా పనిచేస్తున్న ఆర్ట్, క్రాఫ్ట్, వ్యాయామ ఉపాధ్యాయులకు ఇప్పటికే à°—à°¤ నాలుగు సంవత్సరాలుగా 14, 203 నెల జీతం మాత్రమే ఇస్తున్నారని నేటికీ ఒక్క

రూపాయి కూడా జీతం పెంచలేదని తెలిపారు. అయితే రెండు రోజుల క్రితం రాష్ట్ర  à°¸à°®à°—్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ చేసిన ప్రకటనలో అన్ని కేటగిరి లో పనిచేస్తున్న

వారికి పనికి తగ్గ వేతనం, ఇస్తున్నట్లు ప్రకటించారన్నారు. à°† ప్రకటనలో పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్టర్ లు లేకపోవడంతో విచారం వ్యక్తం చేశారు, 
ఇప్పటికైనా ఆంధ్ర

ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పనికి తగ్గ వేతనం ఇవ్వాలని , అమ్మ à°’à°¡à°¿  à°¸à°®à°—్ర శిక్ష ఉద్యోగస్తుల కుటుంబాలకు

వర్తింపచేయాలని కోరుతున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam