DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అభివృద్ధి వికేంద్రీకరణే తప్ప పాలనా వికేంద్రీకరణ కాదు 

మూడు రాజధానులపై బీజేపీ విధానం సుస్పష్టం.

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, జనవరి  06, 2020 (డిఎన్‌ఎస్‌) :  à°…భివృద్ధి వికేంద్రీకరణ

చెయ్యాలి గానీ పరిపాలన వికేంద్రీకరణ కాదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాయికృష్ణ తెలిపారు. మూడు రాజధానుల పేరిట రాష్ట్ర ప్రజలను సందిగ్ధం లో

పడేసిన ప్రభుత్వ నిర్ణయం పై బీజేపీ పార్టీ విధానాన్ని అయన ప్రకటించారు. అమరావతి సీడ్ క్యాపిటల్లో పూర్తి శాసన,పరిపాలన వ్యవస్థ &హైకోర్టుబెంచ్ ఉండాలని,  à°µà°¿à°¶à°¾à°–

ఆర్ధికరాజధానిగా ఎదగడానికి కావాల్సిన ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చెయ్యాలని తెలిపారు.  à°ˆ విధంగా అభివృద్ధి వికేంద్రీకరణ

చెయ్యాలని బీజేపీ డిమాండ్ చేస్తోందన్నారు. 

రాష్ట్ర రాజధాని తరలింపు విషయంలో భూమిలిచ్చిన రైతులు గత 20 రోజులుగా అనేక విధాలుగా నిరసన తెలియజేస్తున్నా కూడా

ప్రభుత్వ పక్షాన్నించి వాళ్ళ గోడు వినే  à°¨à°¾à°¥à±à°¡à± లేక పోవటం నిజంగా శోచనీయం అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఆలోచనలను తాను వేసిన కమిటీల ద్వారా

చెప్పిస్తున్నారనేది సుస్పష్టం అన్నారు.  à°¦à°¶à°² వారీగా సచివాలయాన్ని తరలించాలని సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న అడుగులు రాజధాని ప్రాంతం లో భూములిచ్చిన

రైతులకు అన్యాయం చేయటమె కాక, దాదాపు 20 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను వెనక్కి నెట్టినట్టే నన్నారు.  à°®à°‚గళవారం జరిగే హై పవర్ కమిటీ లో ప్రధానంగా రైతులకు ఎలా న్యాయం

చేయాలని మాత్రమే చర్చించాలని డిమాండ్ చేసారు. రాజధాని ప్రాంతంలో భాగస్వామ్యం ఉన్న అన్ని వర్గాలను చర్చలకు పిలిచి వారి అభిప్రాయాలను తెలుసుకోవాలి. వారి

అభిప్రాయాలను గౌరవించాలని తెలిపారు. 
రైతులపై పెడుతున్న పోలీసు కేసులను బిజేపి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. నేడు తాజాగా మరో 16 మంది రైతులను అరెస్టు చేసిన

చర్యలను ఖండిస్తూ...రైతులపై కేసులను బేషరతు గా విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రాజధాని తరలింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని

సూచించారు. 

మంత్రులు తలో రకంగా మాట్లాడి ప్రజల్లో భయాందోళన, గందరగోళం వ్యాప్తి చేస్తున్నారు. ఈ ప్రభుత్వం తీసుకుంటున్న ఏక పక్ష నిర్ణయాలను బిజేపి

వ్యతిరేకిస్తున్న విషయం మీ దృష్టికి తీసుకు వస్తున్నాం అన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam