DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సత్య సంకల్పులు పెద్ద జీయర్ స్వామి : చిన్న జీయర్  

జీయర్ వ్యవస్థకే తలమానికంగా నిలిచారు.

కరువు సమయంలో తిరుమల లో వర్షాలు కురిపించిన దైవజ్ఞులు 

టిటిడి లో శ్రవణం ప్రాజెక్ట్ ఆరంభానికి పెద్ద జీయర్

స్వామే నాందీ 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం): . . . 

విశాఖపట్నం, జనవరి  07, 2020 (డిఎన్‌ఎస్‌) :ఆధునిక దక్షిణ భారత దేశ  à°†à°§à±à°¯à°¾à°¤à±à°®à°¿à°• ప్రపంచంలో హైందవ ధర్మ

ప్రచారానికి నడుంబిగించింది సత్యసంకల్పులు త్రిదండి పెద్ద జీయర్ స్వామి అని ఆధ్యాత్మిక వేత్త చిన్న జీయర్ స్వామి అన్నారు. మంగళవారం పెద్ద జీయర్ స్వామి

పరమపదానికి చేరుకున్న రోజు కావడంతో అయన ఈ సమాజానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. గుంటూరు లోని గ్రంధి కాంతారావు ( క్రేన్ ఒక్కపొడి) పర్యవేక్షణలో

జరుగుతున్నా ధనుర్మాసోత్సవాల్లో పెద్ద జీయర్ స్వామి పూర్వాశ్రమం నుంచి సన్యాసం స్వీకరించిన పర్యంతం వారి వైభవాన్ని చిన్న జీయర్ స్వామి తెలియచేసారు. పెద్ద

జీయర్ స్వామి à°’à°• కార్యక్రమం చెయ్యాలి అని సంకల్పం చేస్తే అది కచ్చితంగా పరిపూర్ణం అవుతుందన్నారు. అందుకే వారిని సత్య సంకల్పులు  à°…ని మహామహోపాధ్యాయులు,

పండితులు, వారిని  à°µà±à°¯à°µà°¹à°°à°¿à°‚చారన్నారు. పెద్ద జీయర్ స్వామి గురించిన జీవన విశేషాలను చిన్న జీయర్ స్వామి భక్తులకు తెలియచేసిన వివరాలు : .

 .

శ్రీమన్నారాయణాచార్యులుగా పేరు గాంచిన పెద్ద జీయర్ స్వామి పూర్వాశ్రమంలో భారత దేశ స్వతంత్ర పోరాటం లో సైతం పాల్గొన్నారు. అనంతర కలం లో పూర్తి వైరాగ్యంతో

సన్యాసం దీక్ష ను చేపట్టి ఆసేతు హిమాచలం పాదయాత్రగానే సాగించి అన్ని దివ్య క్షేత్రాల్లో శ్రీరామ క్రతువులు నిర్వహించారు. వారి కాలంలో దక్షిణ భారత దేశం లోని

సన్యాసులకు పెద్దగా ఆదరణ లభించేది కాదని, అయితే  à°ªà±†à°¦à±à°¦ జీయర్ స్వామి సన్యాసం స్వీకరించి, ఉత్తరాది ప్రాంతాల్లో పర్యటించి, ఎన్నో బృహత్తర యజ్ఞ యాగాదులు చేసి, అన్ని

ప్రాంతాల వారినీ భాగస్వాముల్ని చెయ్యడం తో వారి కి అంతకుముందు ఉన్న అభిప్రాయలు పూర్తి గా మారిపోయాయి. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ సంప్రదాయవాదులు

అణ్ణంగరాచార్య స్వామి సైతం పెద్ద జీయర్ స్వామికి దాసులు అవ్వడం నాటి కాలంలో చాలా విశేషం అన్నారు.  à°’à°• వైదిక వ్యవస్థను / సంస్థ ను ప్రారంభించి, వేద పరిరక్షణకై

వేలాది మంది విద్యార్థులను చేతుర్వేదాలలో శిక్షణ ఇచ్చారన్నారు. కేవలం ఉత్తరాది కె పరిమితమైన అధర్వ వేదం లో శిక్షణ కోసం కొందరు విద్యార్థులు, పండితులను గుజరాత్

కు పంపి, తదుపరి దక్షణ భారత దేశం లో అధర్వ వేద సంపదను విస్తరింపచేశారన్నారు. వారి సంకల్పం టోన్ నేడు వెలది మంది విద్యార్థులు వేద సంరక్షణలో నిమగమై

యున్నారన్నారు. 

కరువు సమయంలో తిరుమల లో వర్షాలు : . . . 

1972 లో పెద్ద జీయర్ స్వామి సహస్ర కుండాత్మక యాగం తిరుమల కొండపై శ్రీనివాసుని సన్నిధిలో నిర్వహించాలి

అని చేసిన సంకల్పానికి నాటి టిటిడి చైర్మన్ గోకరాజు రంగరాజు ( మాజీ ఎంపీ గంగరాజు తండ్రి) ఒప్పుకోక పోవడం బాధాకరం అన్నారు. అయితే అయన పెట్టిన నిబంధన ఒక అద్భుతమైన

ఘట్టానికి తేరా తీసింది. అప్పడి పరిస్థితుల్లో తిరుమల కొండపై పాపనాశనం మొత్తం ఎండిపోయి, దాదాపుగా కరువు ఏర్పడింది. అయితే తిరుమల కొండపై వర్షం కురిపిస్తే సహస్ర

కుండాత్మక యాగానికి అనుమతి ఇస్తాం అంటూ టిటిడి పెద్ద జీయర్ స్వామికి ఒక సవాల్ విసిరింది. శ్రీనివాస కటాక్షం అని తప్పకుండ నిర్వహిస్తాం అంటూ మూడు రోజుల పాటు

వరుణుని ప్రసన్నం చేసుకునేందుకు ఒక ఇష్టి యాగాన్ని నిర్వహించడం జరిగింది. పూర్ణాహుతి సమయానికి ఒక నల్లని గుర్రం పై యాగ జలాన్ని జల్లితే అది విదిలించుకునే

సమయానికి సరిగ్గా వర్షం పడితే యాగం పరిపూర్ణం అయినట్టు. అయితే పెద్ద జీయర్ స్వామి చేసిన ఇష్టి ముగిసిన వెంటనే వర్షం కుంభవృష్టిగా కురవడం మొదలు పెట్టి రెండు

రోజుల తరబడి పడడం తో తిరుమల గిరులన్నీ నీటిమయంగా మారిపోయాయి. దీంతో యాగం లో పాల్గొన్న వేదపండితులు జీయర్ స్వామిని ప్రార్ధించి వర్షం ఆగడానికి మరో ఇష్టి చేయడం

విశేషం. దీంతో టిటిడి ట్రస్ట్ బోర్డు జీయర్ స్వామిని మన్నించమని ప్రార్ధించి, అత్యంత వైభవంగా 1008 కుండాత్మక యాగం నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయడం

జరిగింది. 

టిటిడి లో శ్రవణం ప్రాజెక్ట్ ఆరంభానికి నాందీ : .. .

ఆ సహస్ర కుండాత్మక యాగం ముగిసిన తదుపరి యాగ నిర్వహణలో మిగిలిన 8 లక్షల రూపాయలను టిటిడి లోని

వివిధ పథకాలకు విరాళం ఇచ్చేసిన ఉదారులు పెద్ద జీయర్ స్వామి. రెండు లక్షల రూపాయలను చెవి, గొంతు సమస్యలతో బాధపడే చిన్నారులకు ఒక ఆసుపత్రి / శిక్షణా కేంద్రాన్ని

ప్రారంభించామని నాటి గవర్నర్ మదన్ లాల్ ఖురానా చేతుల మీదుగా టిటిడి బోర్డు కు అందించారన్నారు. ఆ నిధుల ప్రోత్సాహంతోనే శ్రవణం ఆరంభం అయ్యిందని చిన్న జీయర్ స్వామి

తెలిపారు. ఆ యాగం చెయ్యడానికి తిరుమలకు పెద్ద జీయర్ స్వామి తమ త్రిదండం తో మాత్రమే వచ్చారని, యాగం ముగిసిన తర్వాతా అదే త్రిదండంతోనే తిరిగి ఒంటరిగా

వెళ్లారన్నారు. తమ వెంట ఒక్క పైసా కూడా తిరిగి తీసుకు వెళ్లలేదన్నారు. 

ప్రస్తుతం నేడు భారత దేశం లోని శ్రీవైష్ణవ దేవాలయాల్లో పెద్ద జీయర్ స్వామి

నిర్వహించిన శ్రీరామ క్రతు స్తూపాలు అందరికీ మంగళశానములు అందిస్తున్నామన్నారు.  à°†à°§à±à°¨à°¿à°• భారత దేశంలో జీయర్ అంటే పెద్ద జీయర్ స్వామి మాత్రమేనని, ప్రస్తుతం

ఉన్నవారంతా వారి పరంపరలో వారేనన్నారు.  
       
ఆధ్యాత్మికతకూ వారసులే. . .  

ఇద్దరూ సన్యాసం దీక్ష స్వీకరించక ముందు పెద్ద జీయర్ స్వామి వారు చిన్న జీయర్

స్వామికి స్వయానా తాత గారు (తండ్రికి తండ్రి)  à°•à°¾à°µà°¡à°‚ గమనార్హం. అయితే వారి వద్ద శిష్యరికం చేసి, పెద్దల వద్ద ఎన్నో సంప్రదాయ విద్యలను నేర్చుకుని, మహామహులందరితోనూ

 à°—ురుపరంపరగా వస్తున్న పీఠానికి సేవ చేసుకునే అర్హత సంపాదించారు అని అనిపించుకున్నారు. నాటి నుంచి నేటి వరకూ తదేక దీక్షతో పీఠానికి ఎటువంటి మచ్చ రాకుండా

కాపాడుకుంటూ, వారి ఆశయాల మేరకే వేలాదిగా యజ్ఞ యాగాది క్రతువులను నిర్వహిస్తూ, వేలాదిమంది వేదం విద్యార్థులను తయారు చేయడమే కాక, సమాజ సేవలో కూడా

తరిస్తున్నారు. 

అనంతరం తమ శిష్యులు త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి తో కలిసి చిన్న జీయర్ స్వామి పెద్ద జీయర్ స్వామికి ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam