DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహిళలు ఆర్ధికంగా ఎదగాలి : కలెక్టర్ డాక్టర్ నివాస్

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, జనవరి  08, 2020 (డిఎన్‌ఎస్‌) : మహిళలు  à°µà±ƒà°¤à±à°¤à°¿ నైపుణ్యాలను పెంపొందించుకొని ఆర్ధికంగా

నిలదొక్కుకోవాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆకాంక్షించారు. బుధవారం సాయంత్రం స్థానిక శాంతా అనురాగ నిలయంలో వంశధార నిర్వాసిత మహిళలకు రెడ్ క్రాస్ సంస్థ ద్వారా

కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. వంశధార నిర్వాసిత గ్రామాలైన కొల్లివలస,

గార్లపాడు ఆర్.ఆర్ కాలనీలకు చెందిన 49 మంది మహిళలకు జిల్లా రెడ్ క్రాస్ సంస్థ ద్వారా 6 మాసాల పాటు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో

స్త్రీ, పురుషులు, చిన్నారుల దుస్తులపై శిక్షణ తీసుకోవడం వలన తమలో ఉండే సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకొని ఆర్ధికంగా ఎదగాలని కలెక్టర్ కోరారు. ప్రభుత్వం

పాఠశాల విద్యార్ధుల దుస్తులను తల్లితండ్రులకు అప్పగించడం జరుగుతుందని, వాటిని మీ సహకారంతో కుట్టించుకోవచ్చని కలెక్టర్ స్పష్టం చేసారు. మహిళలు ఇంటికి మాత్రమే

పరిమితం కాకుండా ఒక దుకాణాన్ని ఏర్పాటుచేసుకొని టెక్కలి, పలాస వంటి పట్టణాల్లో గల రిటైల్ షాపుల వాళ్లతో ఒప్పందం చేసుకొని దుస్తులను కుట్టించి వ్యాపారాలను

అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. 
    à°œà°¿à°²à±à°²à°¾ రెడ్ క్రాస్ సంస్థ ఛైర్మన్ పి.జగన్మోహనరావు మాట్లాడుతూ పూర్వపు సంయుక్త కలెక్టర్ కె.వి.యన్.చక్రధరబాబు గారి సూచన

మేరకు నిర్వాసిత మహిళలకు కుట్టు శిక్షణ ఇవ్వడం జరిగిందని, అంతేకాకుండా ఉచితంగా కుట్టుమిషన్లను పంపిణీచేయడం సంతోషంగా ఉందని అన్నారు. 
    à°ˆ కార్యక్రమంలో

సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రోజెక్ట్ అధికారి సిఎం. సాయికాంత్ వర్మ, సహాయ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, జిల్లా రెడ్ క్రాస్

సంస్థ సభ్యులు సి.వి.యన్.మూర్తి, మేనేజర్  à°•à±†.శాంతారావు, సమన్వయకర్త కె.సత్యనారాయణ, శిక్షణ పొందిన మహిళలు తదితరులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam