DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీకాకుళం జిల్లాలో ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీకి చర్యలు

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, జనవరి  08, 2020 (డిఎన్‌ఎస్‌) : జిల్లాలో ఆరోగ్య శ్రీ హెల్త్ కార్డుల పంపిణీకి చర్యలు

చేపడుతున్నామని ఆరోగ్య శ్రీ జిల్లా సమన్వయ అధికారి డా. కెపిసిఎవి సాయిరాం తెలిపారు. ఈ మేరకు బుధ వారం ఒక ప్రకటన విడుదల చేస్తూ ఇప్పటికే జిల్లాకు 5 వేల కార్డులు

ఆరోగ్య శ్రీ ట్రస్టు నుండి చేరాయన్నారు. ఆరోగ్య శ్రీ కార్డులతో సహా రాష్ట్ర ముఖ్య మంత్రి సందేశం అందించడం జరుగుతుందని చెప్పారు. జిల్లాలో 8.50 లక్షల మందికి ఆరోగ్య

శ్రీ కార్డులు పంపిణీ చేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. 
ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ రశీదులు ముద్రణ : ఆరోగ్య శ్రీ హెల్త్ కార్డులను పంపిణీ చేస్తూ లబ్దిదారుల

నుండి రశీదులను తీసుకోవడం జరుగతుందని సాయిరాం చెప్పారు. ఆరోగ్య శ్రీ హెల్త్ కార్డు రశీదులు కలర్ కాపీలు ముద్రించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఇందుకు టెండర్లను

ఆహ్వానిస్తున్నామని, ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు టెండర్లు సమర్పించుటకు అవకాశం ఉందని చెప్పారు. అనుభవం గల ప్రింటింగు ప్రెస్ యాజమాన్యాలు టెండర్లలో

పాల్గొనవచ్చని పేర్కొన్నారు. 13వ తేదీ సాయంత్రం 4 గంటలకు టెండర్లు తెరవడం జరుగుతుందని వివరించారు. టెండర్లపై సందేహాలు ఉంటే వై.యస్.ఆర్ ఆరోగ్య శ్రీ కార్యాలయంలో 8333814017,

8333814018 ఫోన్ నంబర్ల ద్వారా లేదా స్వయంగా  à°¸à°‚ప్రదించవచ్చని సాయిరాం తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam