DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆలయాల్లో వైభవంగా ధనుర్మాస ఉత్సవాలు 

మింది, కొమ్మాది ఆలయాల్లో శ్రీకృష్ణ వైభవం. . .

కృష్ణ అవతారంలో అలరిస్తున్న వేంకటేశ్వరుడు. . .

(DNS రిపోర్ట్ : కళ్యాణి CSV , స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం) : . . .

.

విశాఖపట్నం, జనవరి  09, 2020 (డిఎన్‌ఎస్‌) : మానవ జాతికి మహత్తరమైన మనుగడను అందించిన పరిపూర్ణ అవతారం శ్రీకృష్ణ అవతారంగా వేదం తెలియచేస్తోంది. ధనుర్మాస వేడుకల్లో

భాగంగా 25 à°µ రోజున ఆలయాల్లో అత్యంత వైభవంగా ఆరాధనలు జరుగుతున్నాయి. మానవ మనుగడకు శ్రీకృష్ణుడు అందించిన మహా ఔషధం శ్రీమత్   భగవద్గీత. అయన వైభవాన్ని కొనియాడుతూ

ఆండాళ్ ధనుర్మాస పాశురాల్లో  à°…ందించింది. విశాఖలోని ప్రధాన ఆలయాలైన బి హెచ్ పివి ( మింది ) గ్రామం లోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం లోను, విశాఖ నగర శివారు

ప్రాంతమైన కొమ్మాది లోని పైడా ఇంజనీరింగ్ కళాశాల లో కొలువైన  à°¶à±à°°à±€ శరణ్య వెంకటేశ్వర స్వామి ఆలయంలోనూ స్వామి శ్రీకృష్ణ అవతారంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు.

ధనుర్మాస వేడుకల్లో 25 à°µ రోజు గురువారం తెల్లవారు ఝామునే ఆలయాల్లో తిరుప్పావై సేవా కాలం నిర్వహించారు. శ్రీకృష్ణ జననం, అనంతర బాల లీలలు తెలియ చేసే  à°† పాశుర

వైభవాన్ని తెలుసుకుందాం.  
 
ఒరుత్తి మగనాయ్ పిఱన్దు, ఓరిరవిల్ 
ఒరుత్తి మగనాయ్ ఒళిత్తు వళర, 
తరిక్కిలానాగి త్తాన్ తీంగు నినైన్ద, 
కరుత్తై ప్పిழேపిత్తు

కఞ్జన్ వయిత్తిల్, 
నెరుప్పెన్న నిన్ఱ నెడుమాలే! ఉన్నై, 
అరుత్తిత్తు వన్దోమ్ పఱై తరుదియాగిల్, 
తిరుత్తక్క శెల్వముమ్ శేవగముమ్ యాంపాడి, 
వరుత్తముమ్

తీర్‌న్దు మకిழన్దేలో రెమ్బావాయ్!

అర్ద‌ము

తనను చతుర్బాహు స్వరూపముతో కుమారునిగ కనవలెనని కోరిన సాటిలేని దేవకీదేవికి ఒక రాత్రి కుమారుడవై పుట్టి,

అదే రాత్రి బాలచేష్టలను కనవలెనని తపమాచరించిన మరొక అద్వితీయమైన యశోదమ్మ యొక్క ముద్దుబిడ్డవై రహస్యముగ పెరుగుచుండ, ఆ వార్తను వినిన కంసుడు సహించలేక నీకు

అపకారము చేయ తల్చగనే అతనియెక్క అభిప్రాయమును వ్యర్థమగునట్లు చేసి, ఆ కంసుని కడుపులో నీవే కారుచిచ్చువలె అయి అతనినే సంహరించి, నిన్ను మాకనుగ్రహించిన, మా పై

దీర్ఘవ్యామోహము కలవాడా! నిన్నే మేము యాచించవచ్చినాము. పఱై అను వాయిద్య విశేషమున్ను ఇచ్చినచో శ్రీలక్ష్మీదేవి కూడ అభిమానించు నీ ఐశ్వర్యమును, ఆమె వినగోరు నీ

యొక్క వీరచరితములనేకములు మేము పాడి, నిన్ను పొందుటకై యింతవరకు పడిన శ్రమలన్నిటిని మరచి ఆనందింతుము.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam