DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైభవంగా అంతర్జాతీయ సంగీత, యోగ, బివికె ఆవిర్భావ దినోత్సవం

విశాఖపట్నం,జూన్ 21 2018 (DNS Online ):  à°ªà±à°°à°ªà°‚చంలోని అన్ని ప్రాంతాల్లోనూ యోగాభ్యాసం సాధన చేస్తున్నారని, అయితే వేదవిద్య యోగ పుట్టిన భారత దేశం లో మాత్రం పెద్దగా గుర్తించడం

లేదని, ఉత్తరాంధ్ర ప్రట్టభద్రుల నియోజక వర్గ ఎం ఎల్ సి పివిఎన్ మాధవ్ అభిప్రాయపడ్డారు. గురువారం అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ నగరం లోని

ద్వారకానగర్ లో à°—à°² శ్రీ కృష్ణ విద్యామందిర్ పాఠశాలల లో జరిగిన  à°¸à°¾à°®à±‚హిక యోగ సాధన శిబిరం కు అయన ముఖ్య అతిధి à°—à°¾ పాల్గొన్నారు. à°ˆ సందర్భంగా అయన మాట్లాడుతూ పునర్జన్మ

పై నమ్మకం ఉన్న చైనా దేశస్తుల నాయకుడైన మావో ను నీ చివర కోరిక ఏంటని ప్రశ్నించగా నా పునర్జన్మ పవిత్ర భారత దేశం లోనే జరగాలని కోరుకున్నట్టు చరిత్ర

చెప్తోందన్నారు. ముస్లిం దేశమైన మలేసియా లో కార్మికులు తమ విధుల్లోకి వెళ్లే ముందు సామూహికంగా ఓంకారం చేసి తర్వాతే విధుల్లో పాల్గొంటున్నారన్నారు. భారతీయ

విద్యాకేంద్రం అధ్యక్షులు ప్రొఫెసర్ ఏ. నారాయణ స్వామి ప్రాస్తావిక భాష నిస్తూ ఒకే రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవం, అంతర్జాతీయ సంగీత దినోత్సవం జరుపుకోవడం తో

పాటు భారతీయ విద్య కేంద్రం ఆవిర్భావ దినోత్సవం కూడా జరుపుకోవడం చారిత్రిక ఘట్టమన్నారు. 

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ప్రాంత ప్రచారక్ భారత్ కుమార్

మాట్లాడుతూ జూన్ 21 న పగలు, రాత్రి సమానంగా ఉండే రోజని, అనంత శక్తి, జ్ఞానం , తేజస్సు ప్రసాదించమని సూర్య భగవానునికి నమస్కారం చేస్తున్నామన్నారు. సాధన ఒక పెట్టుబడి

లాంటిదని, సంవత్సరానికి ఒక సారి కాకుండా నిత్యం చెయ్యవలసిన అవసరం ఉందన్నారు. మానవత్వం నుంచి దైవత్వం వైపుకు తీసుకు వెళ్ళేదే యోగ, సంగీతం, కుటుంబ వ్యవస్థ అని

తెలిపారు. 

విశిష్ట అతిధి à°—à°¾ పాల్గొన్న  à°¦à°¿ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు à°Ÿà°¿ ఎస్ ఆర్ ప్రసాద్ మాట్లాడుతూ క్రమశిక్షణ కు మారుపేరుగా నిలిచిన బివికె

విద్యాసంస్థల కార్యాచరణ అందరికీ మార్గదర్శకం కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థి దశ నుంచే భారతీయ సంస్కృతి, ధర్మాన్ని నేర్పించడం

అభినందనీయమన్నారు. 

భారత దేశం లో అనాదిగా ఉన్న విద్యల్లో యోగ ఒకటని, యోగ అత్యున్నతమైన విద్య గా మహర్షులచే కొనియాడబడిందని యోగ శిక్షకులు కె. మురళీకృష్ణ

తెలియచేసారు. పూర్వం జగద్గురువు గా ఉండే భారత దేశం మళ్ళీ ఆ స్థానాన్ని పొందాలని ఆకాంక్షిస్తూ యోగ చేయుట వలన ఆరోగ్య పరంగా కూడా మంచి ఫలితాన్ని ఇస్తుందన్నారు.

అనంతరం విద్యార్థుల నుద్దేశించి యోగ సాధన వలన కలిగే శుభ పరిణామాలను తెలిపారు.  

భారతీయ విద్యాకేంద్రం కు అనుబంధం విద్యా సంస్థలకు చెందిన విద్యార్థిని

విద్యార్థులు à°ˆ శిబిరం లో పాల్గొని యోగాసనాల ప్రదర్శన చేశారు. 

అంతర్జాతీయ సంగీత దినోత్సవ సందర్భంగా హర్షిత, సునయన సంకీర్తనలు సుమధురంగా ఆలపించారు. ఈ

కార్యక్రమం లో భారతీయ విద్య కేంద్రం సంయుక్త కార్యదర్శి చక్రపాణి వందన సమర్పణ చేశారు. 
ఈ కార్యక్రమం లో బివికె అనుబంధ విద్యా సంస్థల అధ్యాపకులు, సిబ్బంది

పాల్గొన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam