DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జ్ఞాన సముపార్జనే నిజమైన సంక్రాతి: వీసీ జగన్నాథరావు

ఘనంగా నన్నయ లో సంక్రాంతి సంబరాలు

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . .

రాజమహేంద్రవరం /  à°µà°¿à°¶à°¾à°–పట్నం, జనవరి  10, 2020 (డిఎన్‌ఎస్‌) : విద్యార్థులు

జ్ఞానాన్ని సంపాదించుకోవడమే నిజమైన సంక్రాంతి అని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య మొక్క జగన్నాథరావు అన్నారు. శనివారం విశ్వవిద్యాలయంలో

విద్యార్థుల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వీసీ ఆచార్య ఎం.జగన్నాథరావు హాజరై భోగిమంటను వెలిగించి

సంక్రాంతి సంబరాను ప్రారంభించారు. విద్యార్థులు గొబ్బెమ్మలను ఏర్పాటు చేసి నృత్య ప్రదర్శనలు చేసారు. అలాగే గంగిరెద్దులు, పిట్టలదొర వేషదారణలతో ప్రదర్శనలు

నిర్వహించారు. తరువాత కన్వేన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వీసీ మాట్లాడుతూ ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన తొలిరోజు

విద్యార్థులచే నిర్వహించిన సంక్రాంతి కార్యక్రమం అద్బుతంగా ఉందని అన్నారు. సంక్రాంతి సంబరాలతో విద్యార్థులు ఘన స్వాగతం పలకడం అత్యంత ఆనందంగా ఉందని చెప్పారు.

విద్యార్థులు విజ్ఞానాన్ని సంపాధించుకోవడమే నిజమైన విజ్ఞానమని అన్నారు. విద్యార్థులు లేనిదే విశ్వవిద్యాలయం లేదని విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఉండాలని

చెప్పారు. విద్యార్థులకు, విశ్వవిద్యాలయానికి ఎంతో భవిష్యత్ ఉందని తెలిపారు. విద్యార్థుల సంక్షేమం కోసం పని చేస్తానని విద్యార్థులకు ఎటువంటి సమస్యలు వచ్చిన

వాటిని పరిష్కరిస్తానని చెప్పారు. అందరూ కలిసి విశ్వవిద్యాలయ అభివృద్ది కోసం పని చేద్దామని తెలిపారు. తరువాత ఆదర్శరైతు కందరెడ్డి మాట్లాడుతూ సంస్కృతి

సాంప్రదాయాలను నిత్యం పరిరక్షిస్తూ భవితరాలకు వాటిని అందజేయాలని చెప్పారు. విద్యార్థులంతా ఎంతో చక్కని సంప్రదాయ వస్త్రధారణతో పండుగకు రావడం ఆనందంగా ఉందని

తెలిపారు. ఎంతో విశిష్టత కలిగిన మన సంస్కృతి సంప్రదాయాలను మనమే కాపాడుకోవాలని చెప్పారు. అనంతరం విద్యార్థులు సాంప్రదాయ వస్త్ర ప్రదర్శనలు, నృత్య ప్రదర్శనలు,

తెలుగు సంభాషణలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సి.పి నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మీ, రెక్టార్ ఆచార్య పి.సురేష్ వర్మ, రిజిష్ట్రార్

ఆచార్య ఎస్.టేకి, ప్రిన్సిపల్స్ డా.కె.శ్రీరమేష్, డా.కె.రమనేశ్వరి డీన్స్ డా.వై.శ్రీనివాసరావు, డా.బి.జగన్మోహనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam