DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భగవద్బంధువులందరూ ఒక్కటే అనే సంకేతాన్నిచ్చే కూడారై 

ధర్మానుర్మాసం లో భక్తికి పరాకాష్ట కూడారై. . .వెల్లుం శీర్ గోవిందా. . .

స్వామిని ఎప్పుడూ  à°—ోష్టిగానే సేవించాలి: చిన్న జీయర్ స్వామి

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS ,

బ్యూరో , విశాఖపట్నం): . . .. 

విశాఖపట్నం, జనవరి  11, 2020 (డిఎన్‌ఎస్‌) : భగవంతుణ్ణి చేరే మార్గాన్ని ధనుర్మాసం వ్రతం ద్వారా తానూ ఆచరించి చూపించిన ఆండాళ్, భగవంతుణ్ణి

చేరాలి అనుకునే వారందరూ సమానమే అనే సంకేతాన్ని ఇచ్చేందుకే అనే విషయాన్నీ అందరికీ తెలియచేసే విధంగా కూడి ఇరుందు కుళిరిందు అనే పాశురాన్ని అందించి, అందరూ

కలిసి ప్రసాదం సేవించే ప్రక్రియను వివరించింది. 26 పాశురాల్లో ఆచార్య వైభవాన్ని, శ్రీకృష్ణ వైభవాన్ని  à°…త్యంత వైభవంగా వివరించిన ఆండాళ్, 27 à°µ పాశురంలో భక్తుల

ప్రాశస్త్యాన్ని వివరిస్తుంది.  
ఇదే సంప్రదాయాన్ని భగవద్రామానుజులు సైతం ఆచరించి, తానూ తన ఆచార్యుల వద్ద ఉపదేశం పొందిన ద్వయ మంత్రాన్ని గోష్ఠిపురం ఆలయం లోని

గోపురం పైకి ఎక్కి మరీ గ్రామస్తులు అందరికీ ఉపదేశం చేశారు. 

భగవంతుణ్ణి ఎప్పుడూ భక్తులతో కలిసి  à°—ోష్టిగానే సేవించాలి అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చిన్న

జీయర్ స్వామి తెలియచేసారు. గుంటూరు లో జరుగుతున్నా ధనుర్మాస ఉత్సవ వేడుకల్లో భక్తులకు కూడారై పాసుర వైశిష్ట్యాన్ని అందించారు. 

ఆధునిక కాలంలో అపర

రామానుజులుగా ఖ్యాతి గాంచిన చిన్న జీయర్ స్వామి సైతం అదే బాటలో నడుస్తూ సమాజంలోని వారందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అనే సంకల్పంతో జీయర్ వైద్య శాలను స్థాపించి, ఉచిత

వైద్యాన్ని, నేత్ర విద్యాలయ ప్రారంభించి అంధ విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక విద్యను ఉచితంగానూ అందిస్తూ అంతర్జాతీయ స్థాయిలో శిక్షణాతరగతులు సైతం

నిర్వహిస్తున్నారు. విశాఖ తరంగిణి అనే స్వచ్చంద విభాగాన్ని ప్రారంభించి సమాజ సేవ, ఆరోగ్య వికాస్ పేరుతొ ఉచిత వైద్య శిబిరాలు,  à°•à±à°¯à°¾à°¨à±à°¸à°°à± పై మహిళల్లో అవగాహనా

పెంపొందిస్తున్నారు. గతంలో రక్తదానం చెయ్యడానికి కూడా వెనుకాడే వారితో అవయవ దానం చేసే విధంగా భక్తులని చైతన్య పరుస్తున్నారు.  

ఈ రోజున అన్ని వైష్ణవ ఆలయాలు,

గృహాల్లోనూ తిరుప్పావై సేవాకాలం నిర్వహించిన అనంతరం అత్యంత వైభవంగా కూడారై ఉత్సవాన్ని ఆచరిస్తూ అత్యంత మధురమైన à°ªà±‚ర్తిగా ఆవుపాలతో కూడిన పాయసాన్ని తయారు

చేసి, భక్తులు, కుటుంబ సభ్యులు అందరితో కలిసి కూర్చుని సేవించడం ఆనవాయితీగా వస్తోంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam