DNS Media | Latest News, Breaking News And Update In Telugu

13 న ప్రభుత్వ పాఠశాలలో సంక్రాతి సంబరాలు ప్రారంభం  

గీతా మాధురి, ధనుంజయ్ లచే సినీ సంగీత విభావరి 

జిల్లా స్ధాయి నుంచి మండల స్ధాయి వరకు వేడుకలు 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం) : . . . .

.

శ్రీకాకుళం, జనవరి  11, 2020 (డిఎన్‌ఎస్‌) :  à°¸à°‚క్రాంతి సంబరాలను à°ˆ నెల 13à°µ తేదీన ఘనంగా నిర్వహిస్తున్నామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. à°ˆ మేరకు శని

వారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులు, సంస్ధలతో సమావేశం ఏర్పాటు చేసారు. సంక్రాంతి సంబరాలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం

ఆదేశించిందన్నారు. సంక్రాంతి సంబరాలను జిల్లా స్ధాయిలో శ్రీకాకుళం ఎన్.టి.ఆర్ నగర పాలక సంస్ధ ఉన్నత పాఠశాల మైదానంలో సోమ వారం నిర్వహిస్తున్నామని చెప్పారు. మండల

స్ధాయిలో మండల అధికారులు ఘనంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. సంక్రాంతి సంబరాలను ఉదయం మంత్రులు, ప్రజా ప్రతినిధులు ప్రారంభిస్తారని

చెప్పారు. సాయంత్రం సినీ సంగీత విభావరి, రేలా రేలా బృందం కార్యక్రమాలు నిర్వహించుటకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. సంక్రాంతి సంబరాల్లో జిల్లా ప్రజలు

అందరూ భాగస్వామ్యమై పెద్ద ఎత్తున విజవంతం చేయాలని పిలుపునిచ్చారు. జానపద కళలు, గ్రామీణ క్రీడలు, సాంప్రదాయ వంటలు, రంగోలి వంటి వివిధ రకాల సాంప్రదాయ కళలు

కనువిందులు చేయాలని కలెక్టర్ నివాస్ సూచించారు. కొత్త పంటలు ఇంటికి వచ్చే సమయం అని పేర్కొంటూ ధాన్యం నూర్పుతోపాటు రైతులు ఇంట కొలువైన కోళ్ళు, గొర్రెలు, పశు సంపద,

పంటలు సంక్రాంతి పండగను పూర్తి స్ధాయిలో ప్రతిబింబించాలని పేర్కొన్నారు. ఆహార పదార్ధాల స్టాల్స్, జిల్లాలో ప్రసిద్ధి చెందిన సుప్పులు, అప్పడాలు, సాంప్రదాయ

గిరిజన వంటకాలు, చిలక జోస్యం, సోది వంటి పలు గ్రామీణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పొందూరు ఖాదీ, బుడితి కంచు సామగ్రి తదితర ప్రదర్శనలు ఏర్పాటు

చేయాలన్నారు. భోగీ మంటలు వేయాలని ఆయన సూచించారు.  
తెలుగు సంస్కృతి ఉట్టి పడాలి : సంక్రాంతి సంబరాల్లో తెలుగు సంస్కృతి ఉట్టిపడాలని కలెక్టర్ నివాస్ అన్నారు.

జిల్లాలో ఉన్న జానపద కళారూపాలైన డప్పులు, చెంచు భాగవతం, జముకులు, కోలాటం, చెక్క భజన, బుడ బుక్కలు, కోలాటం, సవర నృత్యం, తప్పెట గుళ్ళు, గంగిరెద్దులు తదితర రూపాలతో

పెద్ద ఎత్తున శోభా యాత్రను నిర్వహించాలని సూచించారు. ఎన్.టి.ఆర్ ఎం.హెచ్.ఉన్నత పాఠశాల మైదానంలో సంక్రాంతి సంబరాల ప్రధాన వేదిక వద్ద శోభాయాత్ర చేరుకుని అచ్చట

ప్రదర్శనలు ఇస్తాయని చెప్పారు. 
రంగోలి, వంటల, గ్రామీణ క్రీడల పోటీలు : మన సంస్కృతిలో భాగంగా మహిళలకు రంగోలి, సాంప్రదాయ వంటల పోటీలను నిర్వహించాలని కలెక్టర్

నివాస్ అన్నారు. ఈ పోటీలకు బహుమతులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మొదటి బహుమతికి రూ.10 వేలు, ద్వితీయ బహుమతికి రూ.5 వేలు, తృతీయ బహుమతికి రూ.3 వేలు

అందించనున్నట్లు చెప్పారు. ఈ పోటీల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తమ ప్రతిభను, నైపుణ్యాలను ప్రదర్శించాలని కోరారు. సాంప్రదాయ వంటకాల్లో పాల్గొనే మహిళలు వేదిక

వద్దనే వంటకాలు తయారు చేయాల్సి ఉంటుందని చెప్పారు. వేదిక వద్ద సాంప్రదాయ పద్ధతిలో వంటకాలు తయారు చేయుటకు కట్టెలు, ఇటుకలు ఏర్పాటు చేయడం జరుగుతుందని

పేర్కొన్నారు. వంటల పోటీల్లో పాల్గొనే మహిళలు వంట సామగ్రి, పాత్రలు తీసుకురావాలని సూచించారు. 
    à°—్రామీణ క్రీడలలో ముఖ్యంగా సాంప్రదాయంగా సంక్రాంతి పండగలో

నిర్వహించే సంగిడీ, కబడ్డి, కర్రసాము, గాలి పటాల పోటీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. వీటితోపాటు గోళీ కాయలు తదితర ఆటలను నిర్వహించాలని సూచించారు. 
/> గీతా మాధురి సినీ సంగీత విభావరి : సంక్రాంతి సంబరాల్లో భాగంగా 13వ తేదీ సోమ వారం సాయంత్రం గీతా మాధురి, ధనుంజయ్ తో కూడిన రోషన్ లాల్ ఆర్కెష్ట్రా సినీ సంగీత విభావరి

కార్యక్రమంను నిర్వహించుటకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చెప్పారు. సంగీత విభావరితోపాటు విజయనగరం వారి రేలా రేలా జానపద కార్యక్రమ ప్రదర్శనలు

ఉంటాయని చెప్పారు. ఇందులో భాగంగా భోగీ మంటలు వేయడం జరుగుతుందని చెప్పారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఆహ్వానితులేనని,

ప్రవేశం ఉచితమని ఆయన పేర్కొన్నారు. 
    à°‡à°‚దులో భాగంగా ప్రధాన వేదిక ప్రదేశం ఎన్.à°Ÿà°¿.ఆర్.à°Žà°‚.హెచ్. గ్రౌండ్ ను కలెక్టర్ తనిఖీ చేసి పలు సూచనలు చేసాపు. 
    à°ˆ

సమావేశంలో  à°œà°¿à°²à±à°²à°¾ రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, రెవిన్యూ డివిజనల్ అధికారి à°Žà°‚.వి.రమణ, డిఎస్పి à°¡à°¿.ఎస్.ఆర్.వి.ఎస్.ఎన్.మూర్తి, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్ధ

ప్రాజెక్టు డైరక్టర్ ఏ.కళ్యాణ చక్రవర్తి, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్, జిల్లా విద్యా శాఖ అధికారి కె.చంద్రకళ, ఐసిడిఎస్ జి.జయదేవి, మెప్మా పిడి ఎం.కిరణ్

కుమార్, నగర పాలక సంస్ధ సహాయ కమీషనర్ శివప్రసాద్, పర్యాటక అధికారి ఎన్.నారాయణ రావు, సెట్ శ్రీ మేనేజర్ బి.వరప్రసాద రావు, సంప్రదాయం సంచాలకులు స్వాతి సోమనాథ్,

శ్రీకాకుళం రంగస్ధల కళాకారుల సమాఖ్య ప్రతినిధులు చిట్టి వెంకట రావు, ఎల్.రామలింగస్వామి, శివాని ఇంజనీరింగు కళాశాల ఎం.డి దుప్పల వెంకట రావు., లయన్స్ క్లబ్

అధ్యక్షులు నటుకుల మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam